తగ్గిన గృహాల కొనుగోల డిమాండ్

భారతదేశంలో సరసమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా తగ్గిందని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఇక మధ్యస్థ మరియు అధిక-శ్రేణి విభాగాలలో డిమాండ్ మాత్రం సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్థ మరియు అధిక-శ్రేణి విభాగాలతో పోల్చితే మామూలు గృహాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గిందానే చెప్పుకోవాలి.  దేశంలో గృహాల డిమాండ్ తగ్గుదల:  భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటికాలను నెరవేర్చుకోవాలని, ముఖ్యంగా ఏదైనా మంచి ప్రాపర్టీ కొనాలని ఆశపడడం జరుగుతూ ఉంటుంది. అయితే […]

Share:

భారతదేశంలో సరసమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా తగ్గిందని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఇక మధ్యస్థ మరియు అధిక-శ్రేణి విభాగాలలో డిమాండ్ మాత్రం సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్థ మరియు అధిక-శ్రేణి విభాగాలతో పోల్చితే మామూలు గృహాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గిందానే చెప్పుకోవాలి. 

దేశంలో గృహాల డిమాండ్ తగ్గుదల: 

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటికాలను నెరవేర్చుకోవాలని, ముఖ్యంగా ఏదైనా మంచి ప్రాపర్టీ కొనాలని ఆశపడడం జరుగుతూ ఉంటుంది. అయితే గడిచిన కాలంతో పోలిస్తే ఇటీవల కాలంలో గృహాల కొనుగోలు డిమాండ్ గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నాయి ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థలు.

ఏది ఏమైనప్పటికీ, మధ్య మరియు అధిక-శ్రేణి విభాగాలతో పోల్చితే భారతదేశంలో సరసమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా తగ్గిందని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థలు హైలైట్ చేసిన విషయం వెల్లడి అయింది. ముఖ్యంగా గృహాల కొనుగోలు విభాగంలో విక్రయాలు క్షీణించాయి, ప్రధానంగా ఈ కేటగిరీలోని గృహ కొనుగోలుదారులు గృహ రుణాలపై ఎక్కువ ఆధారపడతారు ముఖ్యంగా లోన్ తాలూకా ఇంట్రెస్ట్ విషయం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా లోన్ ఇంట్రెస్ట్ పెరిగిన విషయం కారణంగా ముఖ్యంగా గృహాలకు కొనుగోలు విభాగంలో విక్రయాలు క్షీణించినట్లు సమాచారం.

RBI తన రేట్ల పెంపు విషయాన్ని ప్రస్తుతానికి పాజ్ చేసినప్పటికీ, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఎలివేట్‌గా ఉన్నాయి, కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఉన్న గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును 9 శాతానికి పెంచాయి. ఫలితంగా, పెరిగిన EMIల కారణంగా చాలా మంది గృహాలను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించట్లేదు అని తెలుస్తోంది. ఇదిలావుండగా, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ గత నెలలో ఒక నివేదికలో మాట్లాడుతూ, పెరుగుతున్న భూముల ధరలు మరియు ఇన్‌పుట్ ఖర్చులు కూడా భారతదేశంలో సరసమైన గృహాల డిమాండ్ క్షీణతకు కారణమయ్యాయి అంటూ చెప్పుకొచ్చాయి. 

మరోవైపు ఆఫీస్ స్థలాల డిమాండ్: 

అయితే ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై బెంగుళూరు నగరాలలో ఆఫీసుల కోసం స్థలాల గిరాకీ అనేది చాలా వరకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో మన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలుగా ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో 1.39 కోట్ల చెదరపు స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు, అధ్యయనం చేసిన వెస్టియన్ సంస్థ తెలిపింది. మొత్తం లీజుకు తీసుకున్న 1.39 చెదరపు స్థలాన్ని లీజులో, ప్రధమ నగరాల చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సుమారు 82 లక్షల చదరపు అడుగులు ఉన్నాయని అంచనా వేసింది. 

అంతేకాకుండా మొత్తం డిమాండ్ సుమారు 59% ఉన్నట్లు తెలిపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు వ్యాపార సంస్థలు అలాగే ప్రముఖ కంపెనీలు లీజుకు తీసుకున్న స్థలాల చదరపు అడుగులు 6% తగ్గినట్లు  నివేదిక వెల్లడించింది. సుమారు అన్ని పట్టణాలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ కలకత్తా ఇలాంటి ప్రముఖ నగరాల్లో సర్వే నిర్వహించగా ప్రస్తుతం స్థలాల డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.గ్లోబల్ మార్కెట్లు స్థిరంగా ఉన్నందున, సంవత్సరం ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది అని రావు చెప్పారు. అయితే ముఖ్యంగా స్థలాల డిమాండ్ ఐటి రంగం లోనించే ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. తరువాత లిస్టులో, ఉత్పత్తి రంగాలు, ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాదిలో నెలకొన్న ఆర్థికమాన్యం కారణంగా గతేడాదితో పోలిస్తే ఆరు శాతం భవనాల డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది.