హనీ ట్రాప్ లో ఇరుక్కున్న డిఆర్డిఓ సైంటిస్ట్

డిఆర్డిఓ సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ దగ్గర మిసైల్ సమాచారం సంపాదించిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్.  డిఆర్డిఓ సైంటిస్ట్ కురుల్కర్ పాకిస్తాన్ వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరోపించింది.  చార్జిషీట్లో ఏముంది? : చార్జిషీట్ ప్రకారం డి ఆర్ డి ఓ సైంటిస్ట్ పాకిస్తాన్ వాళ్ళతో సంప్రదింపులు జరిపాడు. తను మిసైల్స్ గురించి వాళ్లతో డిస్కస్ చేశాడు. అందుకే తన మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. మే 3న ప్రదీప్ అరెస్టు అయ్యాడు. తను జారదాస్ […]

Share:

డిఆర్డిఓ సైంటిస్ట్ ప్రదీప్ కురుల్కర్ దగ్గర మిసైల్ సమాచారం సంపాదించిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్.  డిఆర్డిఓ సైంటిస్ట్ కురుల్కర్ పాకిస్తాన్ వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరోపించింది. 

చార్జిషీట్లో ఏముంది? :

చార్జిషీట్ ప్రకారం డి ఆర్ డి ఓ సైంటిస్ట్ పాకిస్తాన్ వాళ్ళతో సంప్రదింపులు జరిపాడు. తను మిసైల్స్ గురించి వాళ్లతో డిస్కస్ చేశాడు. అందుకే తన మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. మే 3న ప్రదీప్ అరెస్టు అయ్యాడు. తను జారదాస్ గుప్తా అనే పర్సన్ తో మిసైల్స్ గురించి మాట్లాడాడు. తను డిఆర్డిఓ కు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వాళ్లకు తెలియజేశాడు. 

జారదాస్ గుప్తా కురుల్కర్ ని వలలో వేసుకొని మిసైల్స్ సమాచారం సంపాదించింది. ఇన్వెస్టిగేషన్లో జారదాస్ గుప్తా ఐపీ అడ్రస్ పాకిస్తాన్ లో ఉన్నట్టు తేలింది. తను మిసైల్స్ విషయాలన్నీ తెలుసుకునేదని తెలిసింది. కురుల్కర్ తనకు అట్రాక్ట్ అయి డి ఆర్ డి ఓ సమాచారం అందించాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది. డి ఆర్ డి ఓ ఇన్వెస్టిగేషన్ చేసే ముందే జారదాస్ గుప్తా ని కురుల్కర్ బ్లాక్ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో తనను ఎందుకు బ్లాక్ చేసావ్ అని అడిగినట్లు ఉంది. కురుల్కర్ డి ఆర్ డి ఓ ఇన్ఫర్మేషన్ బయటకు పంపించాడు. డి ఆర్ డి ఓ ఇన్ఫర్మేషన్ బయటకు పంపడం నేరం. అందుకే తను అరెస్ట్ అయ్యాడు. 

హనీట్రాప్ ఆంటే ఏంటి? :

మగవాళ్ళని ఆడవాళ్లు మాయమాటలు పెట్టి సమాచారం రాబట్టడాన్నే హనీ ట్రాప్ అంటారు. హనీ ట్రాప్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మనకు చాలా క్లోజ్ అనుకొని మన విషయాలన్నీ చెప్పేస్తుంటాం. కురుల్కర్ కూడా ఇలాగే అనుకొని అన్ని విషయాలు చెప్పేశాడు. తన దేశానికి సంబంధించిన వివరాలు కూడా అందులో ఉన్నాయి. అందుకే తను అరెస్ట్ అయ్యాడు. ఇలా అవ్వకూడదు అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మనకు ఎంత క్లోజ్ అయినా మన పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు. మన పర్సనల్ డీటెయిల్స్ గురించి వాళ్ళు ఎంత అడిగినా చెప్పకూడదు. తర్వాత మనతో మాట్లాడే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. అసలు తెలియని వాళ్ళతో మాట్లాడకుండా ఉండటమే బెటర్. అలా మాట్లాడటం వల్లనే చాలా సమస్యలు వస్తుంటాయి. మనకు సమస్య రావద్దంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే బెటర్. మనం ఎక్కువగా సొంత వ్యక్తితోనే అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. పరాయి వాళ్ళతో షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. అలా షేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా ప్రమాదం ఉంటుంది. డి ఆర్ డి ఓ లాంటి కంపెనీలో పని చేసే వాళ్లకు ఈ నియమాలు ఇంకా కఠినంగా వర్తిస్తాయి. మన వివరాలు తెలియజేయడం వల్ల ప్రమాదం ఉంటుందో లేదో తెలియదు కానీ మన దేశానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం వల్ల మన దేశానికి ప్రమాదం జరుగుతుంది. ఇలా అవ్వకూడదు అని మనం అనుకుంటే హనీ ట్రాప్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం.