సెక్షన్ 377 పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఇకపై స్వలింగ సంపర్కం మరింత స్వేచ్ఛగా..

తాజాగా స్వలింగ సంపర్కం నేరంగా గా చెప్పే ఐపిసి సెక్షన్ 377 పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ సందర్భంగా 5 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలను వెల్లడించారు. వ్యక్తుల యొక్క లైంగిక స్వభావం అనేది పూర్తిగా అంతర్గతమైంది. ఒక వ్యక్తి ఎవరి పట్ల ఆకర్షితులవుతున్నారు అన్నదానిపై నియంత్రణ ఉండదు.. దానిని అణిచివేయడం కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛను నాశనం చేసినట్లే. ముఖ్యంగా శరీర లక్షణాలు అన్నవి వ్యక్తిగతమైనవి. ఎవరూ కావాలని […]

Share:

తాజాగా స్వలింగ సంపర్కం నేరంగా గా చెప్పే ఐపిసి సెక్షన్ 377 పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ సందర్భంగా 5 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలను వెల్లడించారు. వ్యక్తుల యొక్క లైంగిక స్వభావం అనేది పూర్తిగా అంతర్గతమైంది. ఒక వ్యక్తి ఎవరి పట్ల ఆకర్షితులవుతున్నారు అన్నదానిపై నియంత్రణ ఉండదు.. దానిని అణిచివేయడం కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛను నాశనం చేసినట్లే. ముఖ్యంగా శరీర లక్షణాలు అన్నవి వ్యక్తిగతమైనవి. ఎవరూ కావాలని ఇలాంటి లక్షణాలను పొందరు. సహజంగా వచ్చే లక్షణాలను వారి ఇష్టపూర్వకంగానే వాళ్ళ ఆత్మగౌరవంలో భాగంగా పరిగణించాలి.

“ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, జీవితంలో అత్యంత కీలకం పరస్పర అంగీకార లేదా అంగీకారం లేని చర్యల విషయంలో కూడా తేడాను చూడడంలో సెక్షన్ 377 విఫలం అయింది. ముఖ్యంగా ఎల్ జీ బీ టి ( లెస్బియన్స్, గే, బైసెక్సువల్, క్వీర్ ఆర్ క్వశనింగ్ అండ్ ఇంటర్ సెక్స్) క్రైంకి బాధ్యులుగా చేయడం ద్వారా వారిని వేధించడానికి సెక్షన్ 377 అనేది ఒక ఆయుధంగా మారింది. ఇకపోతే మిగిలిన పౌరులకు లాగానే ఎల్ జి బి టి కమ్యూనిటీకి కూడా లైంగిక హక్కులు ఉంటాయి. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి” అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని నేరంగా పరిగణించరు. ఎవరి అనుమతి అయినా లేకుండా లైంగిక చర్యల్లో పాల్గొనడం మాత్రం నేరపూరితం.. ఈ విషయంలో పిల్లలకు పోస్కో చట్టం కింద రక్షణ లభిస్తుంది.

ఎవరైనా పశువులతో లేదా జంతువులతో లైంగిక చర్యలో పాల్గొంటే మాత్రం దానిని నేరంగా పరిగణిస్తారు.. ఇకపోతే పిటిషనర్లలో ఒకరైన ఐఐటి పూర్వ విద్యార్థి కృష్ణ ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ముంబైలో బీబీసీతో మాట్లాడుతూ.. నాకు ఐఐటీలో సీటు వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. తీర్పు వినగానే సంతోషం పట్టలేక కన్నీళ్లు వచ్చాయి. ఇకపై మేము కూడా ఎలాంటి భయం లేకుండా జీవించవచ్చు.. అంటూ తెలిపారు. అంతేకాదు ఈ ట్వీట్ పై ప్రముఖ నటి స్వరా భాస్కర్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఎల్ జి బి టి లకు అభినందనలు తెలిపిన ఆమె.. తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు ఐపిసి సెక్షన్ 377ను తొలగించాలని దాఖలైన ఎన్నో పిటిషన్లపై ఇప్పుడు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒకేసారి విచారణ చేపట్టింది. 2013లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసి పుచ్చిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరస్మృతిలోనే చేర్చింది. ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా ఎంతో మంది సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. వీరిలో లలిత గ్రూప్ కు చెందిన కేశవ సూరి కూడా ఉన్నారు. సెక్షన్ 377 కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇక సెక్షన్ 377 అంటే పురుషులు మహిళలు లేదా పశువులతో ఎవరైనా సంబంధాలు ఏర్పరచుకుంటే వారికి పదేళ్ల శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. దీనిలో జరిమానా నియమం కూడా ఉంది. ఈ నేరంలో ఎవరికీ బైలు లభించదు. మొత్తానికైతే సెక్షన్ 377 పై చారిత్రాత్మక తీర్పు తీసుకున్న సుప్రీంకోర్టుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.