హర్యానా హింసపై హోం మంత్రి తాజా ప్రకటన

హర్యానా లో  మత ఘర్షణలు చెలరేగాయి. ఓ వర్గం వారు నిర్వహించిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు విసరడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు నలుగురు చనిపోగా 200 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలతో నుహ్ జిల్లాలో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది.. ప్రభుత్వం ఆగస్టు 2 వరకు ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు.. […]

Share:

హర్యానా లో  మత ఘర్షణలు చెలరేగాయి. ఓ వర్గం వారు నిర్వహించిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు విసరడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు నలుగురు చనిపోగా 200 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలతో నుహ్ జిల్లాలో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది.. ప్రభుత్వం ఆగస్టు 2 వరకు ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించింది.

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు.. ఘటన జరిగిన నుహ్ జిల్లాలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు… అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. 

నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. నుహ్ హింసపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ, సోమవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల వెనుక “కుట్ర” ఉందని అనుమానించారు. మంగళవారం మీడియా తో మాట్లాడిన ఖట్టర్ ఈ ఘటన దురదృష్టకరమని, అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు.

హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నుహ్ జిల్లాలో చెలరేగిన ఈ మత ఘర్షణలు.. పక్కన ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు.

అప్పుడు  మణిపూర్ లో … ఇప్పుడు హర్యానా లో 

మణిపూర్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా పార్లమెంట్ ఉభయ సభలలో అధికార, విపక్షాల మధ్య వాదనలు గురించి తెలిసిందే .

 తాజాగా హర్యానాలో మరో గొడవ చెలరేగడం కలకలం రేపుతోంది. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గార్గి కక్కర్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రపై నుహ్‌లోని ఖేద్లా మోడ్ వద్ద ఓ అల్లరి మూక రాళ్లు విసరడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నాయి. చూస్తుండగానే విధ్వంసం సృష్టించారు. కార్లు, ఇళ్లు, మతపరమైన భవనాలకు నిప్పంటించారు. ఈ రాళ్ల దాడిలో హోంగార్డులు నీరజ్, గురుసేవక్ దుర్మరణం పాలయ్యారు. .

 ఈ ఘర్షణ మరింత తీవ్రం కాకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘర్షణ పరిస్థితుల కారణంగా నుహ్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు మెస్సేజ్ సేవల్ని ఆగస్టు 2 వరకు నిలిపివేశారు.  

ఘటనలు చెలరేగిన నుహ్ జిల్లాలో శాంతి కమిటీ చర్చలు జరిగాయి. ఇరు వర్గాలకు చెందిన నేతలు.. నుహ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో భేటీ అయి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే చర్యలు చేపట్టారు. హర్యానాలో చెలరేగిన మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ హెచ్చరించారు.

ఇది చాలా దురదృష్టమైన ఘటన అని.. ఈ సమయంలో హర్యానా ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. ఈ ఘర్షణలపై 20 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నిందితుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హర్యానా సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

 ఇందులో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, రాష్ట్ర డీజీపీ పాల్గొన్నారు.ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్న నుహ్ ఏరియాలో బలగాలను మోహరించినట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలిపి సహాయం కోరగా.. భద్రతా సిబ్బందిని పంపుతామని చెప్పినట్లు తెలిపారు. ఈ గొడవపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగకుండా ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు.