ప్రశ్న పత్రాలు ఇంట్లో మర్చిపోయిన హెడ్ మాస్టర్

పరీక్షల సమయంలో ముఖ్యంగా విద్యార్థులు తమ చదివిన అన్ని విషయాలు గుర్తుండాలని ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జరిగిన విషయం వింటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు, విద్యార్థులు కంగారు పడుతున్నది ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయని కాదు, అసలు ప్రశ్నాపత్రం వస్తుందా లేదా.. మీరు చూసింది నిజమే.. అసలు విషయం తెలుసుకుందాం రండి క్వశ్చన్ పేపర్లు ఇంట్లో మర్చిపోయిన హెడ్ మాస్టర్:  ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది, ఒడిశా పాఠశాల హెడ్ మాస్టర్ […]

Share:

పరీక్షల సమయంలో ముఖ్యంగా విద్యార్థులు తమ చదివిన అన్ని విషయాలు గుర్తుండాలని ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జరిగిన విషయం వింటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు, విద్యార్థులు కంగారు పడుతున్నది ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయని కాదు, అసలు ప్రశ్నాపత్రం వస్తుందా లేదా.. మీరు చూసింది నిజమే.. అసలు విషయం తెలుసుకుందాం రండి

క్వశ్చన్ పేపర్లు ఇంట్లో మర్చిపోయిన హెడ్ మాస్టర్: 

ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది, ఒడిశా పాఠశాల హెడ్ మాస్టర్ 10వ తరగతి అర్ధవార్షిక ప్రశ్న పత్రాలను సమయానికి పరీక్షా కేంద్రానికి పంపించడం మర్చిపోయాడు. దీంతో విద్యార్థులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విషయానికి వస్తే, కటక్ జిల్లాలోని నియాలీ బ్లాక్ పరిధిలోని మహంగపాడలోని శ్రీశ్రీశ్రీ పింగళేశ్వర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఈ వింత ఘటన చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, పదో తరగతి విద్యార్థులకు గురువారం అర్ధవార్షిక మొదటి పరీక్ష జరగాల్సి ఉంది. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.

షెడ్యూల్ ప్రకారం, విద్యార్థులందరూ ఉదయం 9:30 గంటల నుండి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఉదయం 10:30 గంటలు అవుతున్నా హెడ్ మాస్టర్ పాఠశాల దగ్గర కనిపించలేదు. అయితే అసలు విషయం ఏమిటంటే అతను తన ఇంట్లోనే ప్రశ్నాపత్రాలు మర్చిపోయినట్లు తెలిసింది. పరీక్షా కేంద్రానికి సకాలంలో పరీక్ష ప్రశ్న పత్రాలు పంపించడం మర్చిపోయాడని తేలింది.

హెడ్ మాస్టర్ బాధ్యత వహించాలి: 

తర్వాత ప్రశ్నపత్రాలను తీసుకురావడానికి క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ (సీఆర్‌సీసీ) జగత్‌సింగ్‌పూర్‌లోని హెచ్‌ఎం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పరీక్షల విషయంలో తీవ్ర జాప్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. మొదటి అర్ధభాగంలో జరగాల్సిన MIL పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేదు. మధ్యాహ్నం జరిగే ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే హాజరు అవ్వడానికి వీలవుతుంది.

కేవలం అతని నిర్లక్ష్యం కారణంగా, తాము తమ MIL పరీక్షకు హాజరు కాలేకపోయామని. మధ్యాహ్నం 1:30 గంటలకు మాత్రమే రెండవ పరీక్షకు హాజరు కాగలిగామని.. MIL పరీక్ష కోసం ఎంతగానో ప్రిపేర్ వచ్చిన తమకి హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు పరీక్ష రద్దు చేయడం జరిగిందని విద్యార్థులు వాపోతున్నారు. అతను చాలా అరుదుగా పాఠశాలకు వస్తూ ఉంటాడని.. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి మాత్రమే వస్తాడు అని ఒక విద్యార్థి ఆరోపించారు. సిఆర్‌సిసి ఇప్పుడు సంఘటన గురించి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బిఇఓ)కి తెలియజేశామని, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

నిర్లక్ష్యమే కారణమా?: 

చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ అసంతృప్తితో ఉన్న విద్యార్థులు ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. చక్కగా చదువుకుని మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించాలని పేద విద్యార్థులు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థులు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న వైనం కనిపిస్తోంది. 

ముఖ్యంగా చాలామంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సమయానికి వస్తున్నప్పటికీ, కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు కేవలం వారానికి రెండు మూడు రోజులే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన సంఘటన దీనికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ముఖ్యంగా ఆరాటపడాల్సిన పాఠశాల హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం, ఇప్పుడు విద్యార్థులకు ఒక పరీక్ష రాయనివ్వకుండా చేసింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? విద్యార్థులు ఆందోళనకు గురవినప్పటికీ సమయం మించి పోవడం వల్ల పరీక్ష రాసేందుకు కుదరలేదు. సమయానికి జరగవలసిన పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థుల అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని కొంతమంది ఉపాధ్యాయులు గుర్తిస్తే ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉంటాయి.