ఉగాది పండుగ విశిష్టత..

ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.? ఆ రోజు ఏం కొంటే ఆర్థికంగా కలిసొస్తుంది.. తెలుగింటి తొలి పండుగ ఉగాది.. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది. అందుకే దీనిని తెలుగువారి పండగ అని అంటారు.  చైత్ర శుద్ధ పాడ్యమినే మనం ఉగాదిగా చెబుతాము.. ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పెద్దలు చెబుతారు.  వైకుంఠనాథుడు మత్స్యవతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ ఉగాది రోజే.. శాలివాహనుడు పట్టాభిషిక్తుడు […]

Share:

ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.? ఆ రోజు ఏం కొంటే ఆర్థికంగా కలిసొస్తుంది..

తెలుగింటి తొలి పండుగ ఉగాది.. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది. అందుకే దీనిని తెలుగువారి పండగ అని అంటారు.  చైత్ర శుద్ధ పాడ్యమినే మనం ఉగాదిగా చెబుతాము.. ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పెద్దలు చెబుతారు.  వైకుంఠనాథుడు మత్స్యవతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ ఉగాది రోజే.. శాలివాహనుడు పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈ ఉగాది రోజే..

ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?

తెలుగు సంవత్సరాదిలో తొలిరోజు ఉగాది. జనవరి 1ని అందరూ ఏడాదికి మొదటి రోజుగా చెప్పుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజు కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని.. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోనూ ఉగాది పెద్ద వేడుక.ఆ రోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని ఉగాది పచ్చడిని ప్రసాదంగా నివేదిస్తారు. ఏమైనా ఇతర ఆహారాలు తింటారు. ఆరు రోజుల కలయికతో తయారు చేసే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఎంతో.. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని చెబుతారు.

తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు,చేదు రుచుల కలయికతో ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. బెల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, మామిడికాయ, వేప పువ్వులని, ఆనవాయితీగా పచ్చడి తయారీలో ఉపయోగిస్తారు. కొంతమంది అదనంగా అరటిపండు, కొబ్బరి కోరు, పుట్నాల పప్పులలాంటివి కూడా వేసుకుంటారు. అది వారివారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అదే చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకుంటారు. పులుపు తగిలితే కష్టసుఖాలు కలయికగా ఉంటుందని అంటారు. అంతేకాకుండా ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది. ఉగాది పచ్చడి తినేటప్పుడు మీకు ఏ రుచి తగులుతుందో అంచనా వేయడం కష్టం. అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చిన జీవితాన్ని ముందుకు నడిపించాలని భావన ఉగాది పచ్చడిలో దాగుంది.

ఉగాది పచ్చడి తయారీ విధానం:

మిరపకాయలను, బెల్లాన్ని, మామిడి కాయలను తురుముకోవాలి. వేప పూపును నీళ్లలో కడిగేసి శుభ్రం చేసుకోవాలి.అలాగే చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి. చింతపండు పప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చిమిరపకాయల తురుము, వేప పువ్వు తురుము వేసి కలుపుకోవాలి. వేప పూవును అధికంగా వేయకూడదు చేదు ఎక్కువ అవుతుంది. మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.

చేయవలసినవి.. చేయకూడనివి..

ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించి ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాలలో కనిపిస్తాయి..అయితే ఉగాది మనకు ప్రకృతి పండగ లాగా అనిపిస్తుంది. అయితే ప్రతి పండుగకు కొన్ని ప్రత్యేకతలు ఎలా ఉంటాయో ఆయా రోజుల్లో తప్పకుండా చేయవలసిన పనులు.. అసలు ఏమాత్రం చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. మన పెద్దలు పండితులు, పండగ పూట చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి కూడా మనకి చెబుతూ ఉంటారు. ఇకపోతే ఈ ఉగాది రోజున ప్రత్యేకించి డబ్బు ఎల్లప్పుడూ ఇంట్లో కలకాలం ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.

ఆర్థికంగా ఎదగాలంటే ఉగాది రోజున ఇవి కొనాలి..

ఉగాది రోజు కొత్త గొడుగు కొనుగోలు చేస్తే మంచి కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడువున ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతోపాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసనకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే. ఉగాది రోజు దానం చేస్తే.. మంచి ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఉగాది ఇలా చేసినట్లయితే ఏడాది పొడవునా డబ్బు ఉంటుంది. 

ఇంకెందుకాలస్యం, ప్రతి ఉగాదికి ఇవి పాటించి శుభఫలితాలను పొందండి.