చారిత్రక ఘట్టం: దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున మెట్రో ప్రయాణం

కోల్‌కతా మెట్రో బుధవారం చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా కోల్‌కతా మెట్రో నదిలో నిర్మించిన సొరంగంలో హుగ్లీ నది గుండా చేరుకుంది. ఈ ప్రయాణంలో కేవలం అధికారులు, ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు మెట్రో జి.ఎం ఉదయ్ కుమార్ రెడ్డి. ఈ ఏడాది నుంచి ఈ మార్గంలో సర్వీసులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. సేవలు ప్రారంభమైన తరువాత హౌరా దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ గా మారుతుంది..   పర్యాటకులకు శుభవార్త. త్వరలోనే […]

Share:

కోల్‌కతా మెట్రో బుధవారం చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా కోల్‌కతా మెట్రో నదిలో నిర్మించిన సొరంగంలో హుగ్లీ నది గుండా చేరుకుంది. ఈ ప్రయాణంలో కేవలం అధికారులు, ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు మెట్రో జి.ఎం ఉదయ్ కుమార్ రెడ్డి. ఈ ఏడాది నుంచి ఈ మార్గంలో సర్వీసులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. సేవలు ప్రారంభమైన తరువాత హౌరా దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ గా మారుతుంది..  

పర్యాటకులకు శుభవార్త. త్వరలోనే మీరు అందరూ వాటర్ మెట్రో ట్రైన్ ప్రయాణం చేయవచ్చు. అవును కోల్‌కతా లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో నుంచి మెట్రో రైలు నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇందుకు సంబంధించిన ట్రైన్ కూడా ఇంకొన్ని రోజుల్లోనే జరగనుంది. కోల్‌కతా మెట్రో ట్రైన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సివిల్ శైలేష్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అండర్ వాటర్ మెట్రో ట్రైన్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆ పనులలోనే ఇప్పుడు ఉన్నాం. త్వరలోనే ట్రైన్ కూడా నిర్వహిస్తామని తెలిపారు వాస్తవానికి గత ఆదివారమే ట్రైన్ రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా వాయిదా వేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ట్రైన్ రన్ సక్సెస్ అయితే సొరంగం పనులు పూర్తిగా గానే ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా హౌరా మైదాన్ సాల్ట్ లేక్ లలోని సెక్టార్ లను కలుపుతూ తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ మధ్య హుగ్లీ నదికి దిగువన రెండు తరంగాలను నిర్మించారు. ఈ మార్గంలోని ఒక భాగంలో త్వరలో ట్రయల్ రన్ ను కలకత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ షెడ్యూల్ చేసింది. ఇందులో భాగంగా రెండు నుంచి 6 కోచ్ లతో కూడిన మెట్రో రైలు హౌరా మైదాన్ రూట్లో 4.8 కిలోమీటర్ల దూరం ట్రైన్ ప్రయాణం చేయవచ్చు. హుబ్లీ నది గర్భం నుండి తీసిన సొరంగాలలో నుంచి మెట్రో రైలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. నది దిగువన ఉన్న మార్గం కవర్ చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. 16 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 10.8 కిలోమీటర్ల భూగర్భ విభాగాలు ఉన్నాయి. నది దిగువన ఉన్న భాగం కూడా ఇందులో కలిపారు. ఈ మెట్రో రైలు హుగ్లీ నది దిగువన 13 మీటర్లు వెళ్తుంది. హౌరా మెట్రో స్టేషన్ కూడా 33 మీటర్ల లోతు వరకు ఉంటుంది. 

కోల్‌కతా మెట్రో రైలు కార్పొరేషన్ అందించిన సమాచారం ప్రకారం.. భూగర్భ తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్టు డిసెంబర్ నాటికి పూర్తవుతుంది కోల్‌కతా మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్ పొడవు 15 కిలోమీటర్లు. ఇది హౌరా నుండి సాల్ట్ లేక్ సిటీ స్టేడియం వరకు విస్తరించి ఉంది. సాల్ట్ లేక్ సెక్టార్ 5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు ఈ మెట్రో మార్గంలో కరుణామయి, సెంట్రల్ పార్క్, సిటీ సెంటర్, బెంగాల్ కెమికల్ వద్ద మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోల్‌కతా మెట్రో నార్త్ సౌత్ లైన్ ఎస్ప్లానేటెడ్ స్టేషన్లో హౌరా స్టీల్దా లోని రైల్వే స్టేషన్లను కలుపుతుంది.

 కోల్‌కతా నగరం విషయానికి వస్తే.. ఇది 1984 లోనే దేశం లో మొట్టమొదటి మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని చేసింది. ఢిల్లీ నగరం కోల్‌కతా కంటే చాలా ఆలస్యంగా 2002లో మెట్రో ట్రైన్ సేవలను ప్రారంభించింది. లండన్ పారిస్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ తరహాలో కోల్కతా మెట్రో ట్రైన్ ను నడపనున్నారు. నీటి అడుగున రైలు ప్రయాణం ప్రారంభమైతే లక్షల మంది ప్రయాణికులకు రోడ్లపై ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మెట్రో నిర్మాణానికి సుమారు 120 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. హౌజ్ ఖాస్ తరువాత కోల్‌కతా లోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 కిలోమీటర్ల లోతుగా ఉంటుంది. ప్రస్తుతం హౌజ్ ఖాస్ 29 మీటర్ల లోతైన స్టేషన్ గా పరిగణించబడుతుంది.