మణిపూర్ లో 20 ఏళ్ల తర్వాత హిందీ మూవీ

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దాదాపు 2 దశాబ్దాల (20 సంవత్సరాలు) తర్వాత ఓ హిందీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో అక్కడి మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఓ హిందీ మూవీ ప్రదర్శితం అయి 20 సంవత్సరాలు అవుతుందంటే ఎవరూ నమ్మరు కానీ ఇదే నిజం. అక్కడ 20 సంవత్సరాల నుంచి హిందీ మూవీ అనే ముచ్చటే రాలేదు. గిరిజన విద్యార్థి సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (HSA) స్వాతంత్య్ర దినోత్సవతం […]

Share:

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దాదాపు 2 దశాబ్దాల (20 సంవత్సరాలు) తర్వాత ఓ హిందీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో అక్కడి మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఓ హిందీ మూవీ ప్రదర్శితం అయి 20 సంవత్సరాలు అవుతుందంటే ఎవరూ నమ్మరు కానీ ఇదే నిజం. అక్కడ 20 సంవత్సరాల నుంచి హిందీ మూవీ అనే ముచ్చటే రాలేదు. గిరిజన విద్యార్థి సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (HSA) స్వాతంత్య్ర దినోత్సవతం సందర్భంగా ఓ మూవీని అక్కడ ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. చుర్ చంద్ పూర్ జిల్లాలోని రెంగ్ కాయ్ (లంకా)లో ఓ హిందీ మూవీని ప్రదర్శిస్తామని అసోసియేషన్ తెలిపింది. అంతే కానీ వారు ఏ సినిమా వేయాలని అనుకుంటున్నారని మాత్రం అసోసియేషన్ వెల్లడించలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తామని అసోసియేషన్ వెల్లడించింది. 

ప్రభుత్వ చొరవతో.. 

అక్కడి బీరేన్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో కశ్మీర్ ఫైల్స్, రాకెట్రీ వంటి చిత్రాలను ప్రదర్శించింది. ఈ రెండు మూవీలు మినహా గడిచిన 20 సంవత్సరాలుగా అక్కడ ఒక్కటంటే ఒక్క హిందీ మూవీ కూడా ప్రదర్శించబడలేదు. ఈ మూవీలో ఏళ్లుగా ఒక జాతిని అణిచివేస్తున్న కొందరి గురించి ఉంటుందని తెలుస్తోంది. 

చివరి మూవీ అదే.. 

మణిపూర్ రాష్ట్రంలో చివరి సారిగా 2020 వ సంవత్సరంలో షారూఖ్ ఖాన్ హీరోగా, కాజోల్ కలయికలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై మూవీ అక్కడ లాస్ట్ గా ప్రదర్శించబడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క హిందీ మూవీ కూడా ప్రదర్శితం కాలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తిరుగుబాటు సంస్థ అయిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 2000 సెప్టెంబర్ లో అక్కడ హిందీ చిత్రాల ప్రదర్శనను బ్యాన్ చేసింది. 

అట్టుడుకుతున్న రాష్ట్రం 

మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా మండుతూనే ఉంది. దాదాపు మూడు నెలల నుంచి అక్కడ ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెగల మధ్య వైరం కారణంగా అక్కడ చాలా మంది నిరాశ్రయులయ్యారు. విపక్ష కూటమి ఇండియా సభ్యులు కూడా మణిపూర్ లో ఇటీవల పర్యటించారు. శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. అయినా కానీ అక్కడ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దేశానికే తలవంపు 

మణిపూర్ రాష్ట్రంలో సభ్య సమాజం తల దించుకునేలా ఒక ఘటన జరిగింది. కొంత మంది ఇద్దరు స్త్రీలను బహిరంగంగా నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో యావత్ దేశం ఈ ఘటన గురించి విస్తుపోయింది. స్వయానా ప్రధానే ఈ ఘటనను ఖండించారు. అయినా కానీ ప్రతిపక్షాలు శాంతించలేదు. ప్రధాని మోదీ ఈ ఘటన గురించి మాట్లాడాలని పట్టుబడుతూ మొన్న అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానం విజయం సాధించిందా? లేదా అనేది పక్కన పెడితే ఒక రాష్ట్రం గురించి సాక్ష్యాత్తు ప్రధాని మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనేది అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. త్వరగా అక్కడ శాంతి స్థాపన జరగాలని అంతా కోరుకుంటున్నారు. ఇలా అనేక రోజుల నుంచి అక్కడ శాంతి లేకుండా ప్రజలు భయం గుప్పిట్లో బతుకున్నారు. ఇలా ఇప్పడు హిందీ మూవీ ప్రదర్శన అనేది అక్కడి వారికి కొంత ఊరటనిచ్చే విషయమే అని చెప్పాలి.