భారత వైమానిక దళంలో సరికొత్త డ్రోన్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన వైమానిక దళం లోకి అత్యంత ఆధునిక హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ ప్రవేశ పెట్టింది. ఈ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా అవసరం అయితే ప్రత్యర్థుల మీద స్ట్రైక్ చేయగల సామర్థ్యం కూడా కలిగి ఉన్నాయి. ఈ హెరాన్ మార్క్ 2 డ్రోన్లు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తో పాటు మరి కొన్ని ఆయుధాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని నార్త్ సెక్టార్ లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లో […]

Share:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన వైమానిక దళం లోకి అత్యంత ఆధునిక హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ ప్రవేశ పెట్టింది. ఈ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా అవసరం అయితే ప్రత్యర్థుల మీద స్ట్రైక్ చేయగల సామర్థ్యం కూడా కలిగి ఉన్నాయి. ఈ హెరాన్ మార్క్ 2 డ్రోన్లు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తో పాటు మరి కొన్ని ఆయుధాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని నార్త్ సెక్టార్ లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లో ఉంచారు. 

36 గంటలు నిర్విరామంగా పని చేస్తాయి

సాధారణంగా డ్రోన్లు వాటి పరిమాణాన్ని చాలా తక్కువ సమయం మాత్రమే పని చేస్తాయి. కానీ భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న సరికొత్త హెరాన్ మార్క్ 2 డ్రోన్ లు నిర్విరామంగా 36 గంటల పాటు పని చేస్తాయి. ఇవి శాటిలైట్ కమ్యునికేషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా దూర ప్రాంతాల నుండి శత్రువుల స్థావరాలను లేజర్ కిరణాల ద్వారా నిర్దేశిస్తాయి. దీని వలన శత్రువుల స్థావరాలను కనుగొనడం లో యుద్ధ విమానాలకు చాలా సులభం అవుతుంది. హెరాన్ మార్క్ 2 డ్రోన్ లతో దేశం మొత్తాన్ని ఒక చోటు నుండి పర్యవేక్షించవచ్చు అని కమాండింగ్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. 

హెరాన్ మార్క్ 2 డ్రోన్ లు ఎలాంటి వాతావరణంలో అయినా ఎలాంటి ప్రదేశంలో అయినా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని మిషన్ ను పూర్తి చేయగల సామర్థ్యం ఉంది. 

ఈ డ్రోన్ ఆయుధాలను కూడా కలిగి ఉంటుంది

భారత భూ భాగానికి సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్ ఇటీవలి కాలంలో కవ్వింపు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్న విషయం తెలిసిందే. భారత భూభాగం లోనికి చొచ్చుకుని రావడానికి చైనా విఫలయత్నం చేసింది. భారత సైనికులు శక్తి సామర్ధ్యాలతో చైనా సైన్యాన్ని తిప్పి కొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హెరాన్ మార్క్ 2 డ్రోన్ సైనికులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సరిహద్దు వెంబడి సైనికులు వెళ్లలేని ప్రదేశాలకు కూడా ఈ డ్రోన్ సునాయాసంగా వెళ్తుంది. అంతే కాకుండా ఈ డ్రోన్ నుండి మిస్సైల్స్ ను కూడా ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ మిస్సైల్స్ ను ఈ డ్రోన్ గాలి లో నుండే ప్రయోగించగలదు. నిజానికి 2000 సంవత్సరంలోనే ఈ డ్రోన్ లు భారత వైమానిక దళం లోకి ప్రవేశించిన కూడా హెరాన్ మార్క్ 2 వర్షన్ డ్రోన్ లు అన్నిటికంటే ఉత్తమమైనవి మరియు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లు తెలియజేశారు. 

ఎటువంటి ప్రాంతంలో అయినా పని చేస్తాయి

దట్టమైన అటవీ ప్రాంతాల దగ్గర నుండి మహా సముద్రాల వరకూ ఎలాంటి ప్రాంతంలో అయినా ఇవి పని చేస్తాయి. హిందూ మహా సముద్రంలోని దూర ప్రాంతాలకు నిఘా ఉంచడానికి ఈ డ్రోన్ లు నౌక దళానికి కూడా  సహాయపడతాయి. దేశ రక్షణ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను తీసుకొని వస్తున్న భారత ప్రభుత్వం హెరాన్ మార్క్ 2 డ్రోన్ లను తీసుకుని రావడం కూడా రక్షణ వ్యవస్థ కు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయ్యింది. వీటిలో 70 డ్రోన్ లను ప్రాజెక్ట్ చీతా కోసం వాడుతూ ఉండగా 31 డ్రోన్ లను భారత సాయుధ దళాలు ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగి భారత రక్షణ వ్యవస్థ ను మరింత పటిష్టం చేయనున్నాయి.