హెరిటేజ్ సిటీలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహం

ఢిల్లీ యమున ఎక్స్ప్రెస్ హైవే మధుర బృందావన్ సమీపంలో అద్భుతమైన ఓ హెరిటేజ్ సిటీని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్షరధామ్ ఆలయం తరహాలో ఈ హెరిటేజ్ సిటీలో ఒక కృష్ణ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ హెరిటేజ్ సిటీలో ఉదయపూర్ లోని శిల్పాగ్రామ్ తరహా ఓ గ్రామాన్ని ఢిల్లీలోని హై స్ట్రీట్ మార్కెట్ తరహా మార్కెట్ నిర్మించనున్నారు. ఈ హెరిటేజ్ సిటీకి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పటికే తయారైంది. ఈ రిపోర్టును అధికారులు ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీకి పంపారు. […]

Share:

ఢిల్లీ యమున ఎక్స్ప్రెస్ హైవే మధుర బృందావన్ సమీపంలో అద్భుతమైన ఓ హెరిటేజ్ సిటీని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్షరధామ్ ఆలయం తరహాలో ఈ హెరిటేజ్ సిటీలో ఒక కృష్ణ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ హెరిటేజ్ సిటీలో ఉదయపూర్ లోని శిల్పాగ్రామ్ తరహా ఓ గ్రామాన్ని ఢిల్లీలోని హై స్ట్రీట్ మార్కెట్ తరహా మార్కెట్ నిర్మించనున్నారు. ఈ హెరిటేజ్ సిటీకి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పటికే తయారైంది. ఈ రిపోర్టును అధికారులు ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీకి పంపారు. ఇక ఈ నగరాన్ని 2034 నాటికి మూడు దశల్లో నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  మొత్తం 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీ ఉండనుంది. అంతేకాదు, ఆలయ ప్రాంగణంలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

హెరిటేజ్ సిటీలో కృష్ణ ధామ్ ఆలయంతో పాటు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆలయంలో 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. 100 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని హై స్ట్రీట్ మార్కెట్, ఉదయపూర్‌లోని శిల్ప గ్రామం వంటి గ్రామం ఈ వారసత్వ నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను తెలియజేసే విధంగా ఈ ఆలయాన్ని డిజైన్ చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ ప్రతిపాదిత వారసత్వ నగరానికి సంబంధించిన డీటెయిల్స్ రిపోర్ట్ సిద్ధంగా ఉంది. త్వరలో ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీకి పంపబడుతుంది. 2034 నాటికి మూడు దశలో 75 ఎకరాల్లో ఈ సిటీని నిర్మిస్తామని అధికారులు తెలిపారు కృష్ణ దేవాలయం వంద అడుగుల ఎత్తైన కన్నయ్య విగ్రహం, మార్కెట్ హెరిటేజ్ సిటీలో నిర్మిస్తామని తెలిపారు. హెరిటేజ్ సిటీలో సాంస్కృతిక ప్రాంతం ఈ వారసత్వ నగరంలో గురుగ్రామ్, లండన్ లోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ తరహాలో O2 ఎరినామా రూపొందించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా హెరిటేజ్ సిటీలో ఇంటర్ ఆక్టివ్ కల్చరల్ ఏరియాను ఏర్పాటు చేయటానికి ప్రతిపాదన చేశారు ఇది ఆధ్యాత్మిక సాంస్కృత సముదాయం అవుతుంది. ఇందులో శ్రీకృష్ణుని జననానికి సంబంధించిన బోలెడు అంశాలను హైలైట్ చేయనున్నారు. 
హెరిటేజ్ సిటీ గురించి యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో అరుణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ఇందులో ఓ ఆధ్యాత్మిక క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నాము. అక్కడ కృష్ణుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రదర్శితమవుతాయి. ఈ నగరంలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను, కృష్ణుడి బోధనలు తెలిపే ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు, అక్షరధామ్ దేవాలయం తరహాలో స్లైడ్ షోలు ఉంటాయని ఆయన తెలిపారు. హెరిటేజ్ సిటీ నిర్మాణం మొత్తం మూడు దశల్లో జరగనుంది. మొదటి దశలో భాగంగా 2024- 27 మధ్యకాలంలో దేవాలయ సాంస్కృతిక గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో భాగంగా 2028- 31 మధ్యకాలంలో నగరంలోని ప్రజా సౌకర్యాలపై దృష్టి సారించినన్నారు. మూడో దశలో భాగంగా 2032- 34 మధ్యకాలంలో వేద శాస్త్రం, యోగ, ఆయుర్వేదం లాంటి కోర్సులు అందించే సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ నుండి జైపూర్‌కు ప్రయాణించే సమయాన్ని 5 గంటల నుండి దాదాపు 3.5 గంటలకు తగ్గిస్తుంది. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే 1,386 కి.మీ పొడవు ఉంటుంది. భారతదేశపు అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. ఈ మార్గం ప్రయాణికులకు ఎంతో సౌకర్యాన్ని కలుగజేస్తుంది.