చందమామకి మరింత దగ్గరలో చంద్రయాన్-3 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్యలోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం చంద్రయాన్-3 తన రెండో స్టెప్ తీసుకోబోతోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ రెండో కక్ష్యలోకి ప్రవేశించడానికి, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించబోతోంది.  రెండో అడుగు వేయబోతున్న చంద్రయాన్-3:  రెండవ మిషన్ పథంలో కీలకమైన దశ ఇది, […]

Share:

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్యలోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం చంద్రయాన్-3 తన రెండో స్టెప్ తీసుకోబోతోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ రెండో కక్ష్యలోకి ప్రవేశించడానికి, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించబోతోంది. 

రెండో అడుగు వేయబోతున్న చంద్రయాన్-3: 

రెండవ మిషన్ పథంలో కీలకమైన దశ ఇది, ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-3 మిషన్ కక్ష్యను మరింత తగ్గించడానికి ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం ఇందులో ఉంటుంది. దీని లక్ష్యం 170 కి.మీ x 4313 కి.మీ కక్ష్యను సాధించడం, చంద్రయాన్-3ని దాని చివరి గమ్యస్థానం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరువ చేయడం. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్యలోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం చంద్రయాన్-3 తన రెండో స్టెప్ తీసుకోబోతోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ రెండో కక్ష్యలోకి ప్రవేశించడానికి, ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించబోతోంది. 

చంద్రయాన్-3 గురించి మరిన్ని విషయాలు: 

సుమారు మూడు వారాలుగా ప్రయాణం చేస్తూ చంద్రయాన్-3 చంద్రుడికి అతి చేరువలోకి చేరింది. జూలై 5న శనివారం సాయంత్రం సరిగ్గా సాయంత్రం 7pm గంటలకు, చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టింది చంద్రయాన్-3. ఇదే చంద్రయాన్-3 మొదటి విజయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్యలో చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే అవకాశం ఉంది. 

అయితే భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పడుతుంది అంటున్నారు సైంటిస్టులు. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టబోతోంది అని అంటున్నారు. 

అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేస్తారు. అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద భూమిపైన కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. 

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి మరి చెప్తున్నారు. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.