పీఎం విశ్వకర్మ: శిక్షణతో పాటు వేతనం..

77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా విశ్వకర్మ యోజన అనే మెగా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏటా రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల దాకా ఈ పథకం కోసం ఖర్చు చేస్తామని ఎర్రకోటపై నుంచి ఆయన వెల్లడించారు. ఈ స్కీమ్‌ను విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పీఎం విశ్వకర్మ యోజన పథకానికి.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన […]

Share:

77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా విశ్వకర్మ యోజన అనే మెగా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏటా రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల దాకా ఈ పథకం కోసం ఖర్చు చేస్తామని ఎర్రకోటపై నుంచి ఆయన వెల్లడించారు. ఈ స్కీమ్‌ను విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పీఎం విశ్వకర్మ యోజన పథకానికి.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల్లో విశ్వకర్మ యోజన పథకం దేశవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభం కానుంది.

18 రకాల వృత్తుల్లోని 30 లక్షల కుటుంబాలకు లబ్ధి!  

‘పీఎం విశ్వకర్మ’ యోజన పథకం కింద సంప్రదాయ చేతివృత్తుల వారికి స్వల్ప వడ్డీతో రుణాలు అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతలో 5 శాతం వడ్డీతో రూ.లక్ష, రెండో విడతలో రూ. 2 లక్షల రుణం ఇస్తారు. నైపుణ్యాల మెరుగుదల శిక్షణ, వస్తువుల కొనుగోలు, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌లో సహకారం కూడా అందిస్తారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో ఐదేళ్లపాటు చేపట్టే ఈ కార్యక్రమం సాయంతో దేశవ్యాప్తంగా 30 లక్షల చేతివృత్తుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా. ఓబీసీలోని నేతకారులు, స్వర్ణకారులు, రజకులు, వడ్రంగులు, కుమ్మర్లు, పూలదండల తయారీదారులు, క్షరకులు, జాలర్లు తదితర 18 సంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం కింద సాయం అందజేస్తారు. 

శిక్షణ సమయంలో వేతనం

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ తదితరులు వెల్లడించారు. విశ్వకర్మ పథకం కింద నైపుణ్యాలను పెంచుకునేందుకు శిక్షణ ఇస్తామని, శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్లైఫండ్ లభిస్తుందని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఆధునిక యంత్రాలు, పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందుతుందని ఆయన చెప్పారు. తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.

సర్టిఫికెట్లు ఇవ్వనున్న కేంద్రం

ఓబీసీల్లోని సంప్రదాయ చేతివృత్తుల వారికి పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులను ఇవ్వనుంది. వాటి ద్వారానే రుణ సాయాన్ని అందజేయనున్నారు. అవి ఉన్న వారినే ఈ స్కీమ్‌కు లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. నైపుణ్యాల పెంపు, టూల్ కిట్లు, డిజిటల్ లావాదేవీలు జరిపితే ఇన్సెంటివ్స్, మార్కెటింగ్ సపోర్టు కూడా అందజేస్తారు. 

పీఎం ఈబస్ సేవ కింద.. 10 వేల బస్‌లు

మరోవైపు ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ‘పీఎం ఈబస్ సేవ’ పేరుతో మరో భారీ పథకాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఈ బస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న 169 నగరాల్లో 10 వేల ఈబస్‌లను తీసుకొస్తాం. 181 నగరాల్లో గ్రీన్ అర్బన్ మొబిలిటీ చర్యల్లో భాగంగా మౌలక వసతులను కల్పిస్తాం” అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ బస్సులను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో తీసుకొస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.57,613 కోట్లు ఖర్చు అవుతాయని, ఇందులో రూ.20 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని వివరించారు. ఈ స్కీమ్‌ వల్ల దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 45 వేల న ఉంచి 55 వేల మందికి  ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన వెల్లడించారు.