చంద్రయాన్‌–3 విజయంలో కీలక శాస్త్రవేత్తలు వీరే!

భారతదేశ అంతరిక్ష చరిత్రలో అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. అందడనుకున్న చందమామ.. సాదరంగా ఆహ్వానించాడు. రష్యా ‘లూనా’ కూలిన చోట.. మన చంద్రయాన్‌–3ను విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టింది. తద్వారా దక్షణి ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు.. ఎన్నో ఏళ్ల శ్రమ.. చంద్రయాన్–2 నుంచి ఎదురైన వైఫల్యం.. అన్నింటినీ దాటుకుని విజయాన్ని అందుకుంది ఇస్రో. ఇందులో ఎందరో భాగమయ్యారు. దాదాపు వెయ్యి మందికి […]

Share:

భారతదేశ అంతరిక్ష చరిత్రలో అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. అందడనుకున్న చందమామ.. సాదరంగా ఆహ్వానించాడు. రష్యా ‘లూనా’ కూలిన చోట.. మన చంద్రయాన్‌–3ను విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టింది. తద్వారా దక్షణి ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు.. ఎన్నో ఏళ్ల శ్రమ.. చంద్రయాన్–2 నుంచి ఎదురైన వైఫల్యం.. అన్నింటినీ దాటుకుని విజయాన్ని అందుకుంది ఇస్రో. ఇందులో ఎందరో భాగమయ్యారు. దాదాపు వెయ్యి మందికి పైగా ఇంజినీర్లు, సైంటిస్టులు పాలుపంచుకున్నారు. మరికొందరు మాత్రం అత్యంత కీలక పాత్రలు పోషించారు. వారు ఎవరంటే.. 

సారథి.. ఇస్రో చైర్మన్ సోమనాథ్

చంద్రయాన్–3 సారథి ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఈయనే. ఇది మాత్రమే కాదు.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్, ఆదిత్య ఎల్‌–1 వంటి వాటినీ ఈయనే నడిపిస్తున్నారు. గతంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌‌గా పని చేశారు. ఇస్రోలోకి రాకముందు.. ఇస్రో ఉపయోగించే రాకెట్ల టెక్నాలజీని అభివృద్ధి చేసే లిక్విడ్‌ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ సెంటర్‌‌లో కూడా డైరెక్టర్‌‌గా పని చేశారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇంతకీ సోమనాథ్ అంటే సంస్కృతంలో అర్థం ఏంటో తెలుసా.. ‘చంద్రుడి దైవం’ అని.

వీరముత్తుల్..

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో 2019లో చేరారు. ప్రాజెక్టు డైరెక్టర్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిషన్ ప్రారంభం కాకముందు ఆయన అంతరిక్ష మౌలిక వసతుల కార్యక్రమం కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌‌గా పని చేశారు. మద్రాస్ ఐఐటీలో మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. చంద్రయాన్–2, మంగళయాన్‌ మిషన్లలో పాల్గొన్నారు. చంద్రయాన్‌–2 ల్యాండర్ విక్రమ్ రూపకల్పనలో ఆయన పాత్ర ఎంతో కీలకం. నాడు విఫలమైనా.. దాని నుంచి  నేర్చుకున్న పాఠాలతో తాజా ల్యాండర్‌‌ను రూపొందించి విజయం సాధించారు.

 కె.కల్పన

కె.కల్పన.. ఈ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌‌గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో అనేక సమస్యలు ఎదురైనా ఆమె చంద్రయాన్ ప్రాజెక్టు కోసం పని చేస్తూనే ఉన్నారు. ఓ ఇంజినీర్‌‌గా శాటిలైట్ల నిర్మాణంలో తన సర్వీసు మొత్తం వెచ్చించారు. శాటిలైట్ల నిర్మాణంలో ఆమెకున్న నైపుణ్యం ఇస్రోకు అదనపు బలం. చంద్రయాన్–2, మంగళయాన్ మిషన్లలోనూ ఆమె పని చేశారు.

ఎం.శంకరన్

యూఆర్‌‌రావు స్పేస్ సెంటర్‌‌ డైరెక్టర్‌‌గా ఎం.శంకరన్ పని చేస్తున్నారు. ఈయన ఇస్రోకు పవర్‌‌హౌస్‌ లాంటి వారు. చంద్రయాన్‌3కి ఉపయోగించిన స్పేస్ క్రాఫ్ట్‌ను యూఆర్‌‌ రావు స్పేస్ సెంటర్‌‌ తయారు చేసింది. 2021 జూన్‌లో శంకరన్ ఈ సంస్థ డైరెక్టర్‌‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఇదే సంస్థలో కమ్యూనికేషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్‌కు డిప్యూటీ డైరెక్టర్‌‌గా పని చేశారు. సోలార్ పవన్ సిస్టమ్స్, సమాచార వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఈయనది కీలక పాత్ర. 

వి.నారాయణన్

తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌ సెంటర్‌‌ డైరెక్టర్‌‌గా వి.నారాయణన్ పని చేస్తున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇంజిన్స్ రూపలకల్పన, అనాలసిస్‌లో నిపుణుడు. క్రయోజనిక్‌ ఇంజన్ల రూపకల్పన, చంద్రయాన్‌3 లాంటి భారీ ప్రాజెక్టుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్స్ అమర్చడంలో నారయణన్ కీలకది కీలక పాత్ర. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో చదువుకున్నారు.

బీఎన్ రామకృష్ణ

ఐఎస్‌టీఆర్‌‌ఏసీ డైరెక్టర్‌‌గా బీఎన్‌ రామకృష్ణ పని చేస్తున్నారు. ఇస్రో ప్రయోగాల పర్యవేక్షణ కోసం బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఐఎస్‌టీఆర్‌‌ఏసీ. డీప్ స్పేస్ మిషన్ల పని తీరు, అవి పంపించే డేటీను ఈ సెంటర్ విశ్లేషిస్తుంది. ఉపగ్రహాల ప్రయాణం, వ్యోమనౌకలను కక్ష్యలోకి తీసుకువెళ్లడంతో రామకృష్ణ నిపుణులు. ఆయన బెంగళూరులో సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 

ఎం.వనిత

యూఆర్‌‌ రావు శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం.వనిత పని చేస్తున్నారు. చంద్రయాన్‌–2 మిషన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌‌గా పని చేశారు. ఈమె ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ ఇంజనీర్. లూనార్‌‌ మిషన్‌ను లీడ్ చేసిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కారు. చంద్రయాన్‌–2 విషయంలో ఆమెకున్న జ్ఞానాన్ని.. చంద్రయాన్–3 రూపొందించిన బృందం సమర్థంగా ఉపయోగించుకుంది.