హైదరాబాద్ లో మూడు రోజులపాటు  అత్యంత భారీ వర్షాలు

హైదరాబాద్ లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.  తాజాగా వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తెలంగాణలో మంగళవారంతో పాటు బుధ, గురువారాల్లోనూ వర్షాలు దంచికొడతాయని తెలిపింది.రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా […]

Share:

హైదరాబాద్ లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.  తాజాగా వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తెలంగాణలో మంగళవారంతో పాటు బుధ, గురువారాల్లోనూ వర్షాలు దంచికొడతాయని తెలిపింది.రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..దీని ప్రభావం వల్ల మూడు రోజులపాటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారి నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో జల కళ కనిపిస్తుంది. జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలవైపు కదిలే అవకాశాలున్నాయ…..

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత తీవ్రమై బుధవారానికి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలవైపు కదిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా.. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు తప్పని సరి అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో మంగళవారం ఆరెంజ్ అలర్ట్, బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరంలోని మొత్తం ఆరు జోన్లు – చార్మినార్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్‌బి నగర్ మరియు శేరిలింగంపల్లి – నగరంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది.ఉరుములు, మెరుపులతో వరుణుడు విరుచుకుపడటంతో నగరంలోని రహదారులన్నీ జలమయం అయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

స్కూల్ టైమింగ్స్ లో మార్పులు…

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తాయని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్‌ఈ) సోమవారం నోటీసు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలలు సాయంత్రం 4:45 వరకు కొనసాగనుండగా, ప్రాథమిక పాఠశాలలు సాయంత్రం 4:15 గంటలకు ముగుస్తాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల విషయానికొస్తే, పాఠశాలల వేళల్లో ఎలాంటి మార్పు లేదని, అందువల్ల అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న సమయాలను అనుసరిస్తామని ప్రకటన పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో   ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.