హిమాచల్‌ ప్రదేశ్‌లో కొనసాగుతున్న వరద బీభత్సం..

హిమాచల్‌లో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. దీంతో కొండచరియలు విరిగిపడి పలు భవనాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. వాతావరణ శాఖ మరో రెండ్రోజులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది *హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వరదల దాటికి పలు ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లు తెగిపోతున్నాయి.. వంతెనలు కూలిపోతున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని […]

Share:

హిమాచల్‌లో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. దీంతో కొండచరియలు విరిగిపడి పలు భవనాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. వాతావరణ శాఖ మరో రెండ్రోజులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది

*హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. వరదల దాటికి పలు ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రోడ్లు తెగిపోతున్నాయి.. వంతెనలు కూలిపోతున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి.

తాజాగా రాష్ట్రంలోని కులు జిల్లాలో గురువారం ఉదయం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైన, వాటి కింద ఉన్న పలు ఇళ్లు, బిల్డింగులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ భయానక ఘటన అక్కడున్న కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జిల్లా కేంద్రం నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని మార్కెట్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసం జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అప్రమత్తమైన అధికారులు కొన్ని రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌లన్నీ ఖాళీ చేయించారు. అయితే, ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి విషయాలు చెప్పడం లేదు. రోడ్లు తెగిపోవడంతో కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో పలు వెహికల్స్‌ నిలిచిపోయాయి.

రెండ్రోజుల క్రితమే అందర్నీ ఖాళీ చేయించాం..

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌‌ సింగ్‌ సుఖు మాట్లాడుతూ, ప్రమాదాన్ని ముందుగా గుర్తించి, రెండ్రోజుల్లో ఆ బిల్డింగ్‌లన్నీ ఖాళీ చేయించామని చెప్పారు. పరిస్థితిని గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా, అన్నీ పట్టణాల్లోని బస్టాండ్‌ సమీపలో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది పెద్ద భవనాలు కూలిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. గురువారం నాటి కొండచరియలు విరిగిపడిన భవనాల్లో రెండు బిల్డింగ్‌లు నదీ ఓడ్డున ఉన్నాయి.

24 గంటల్లో 190 మిల్లీమీటర్ల వర్షం..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో గత 24 గంటలలొ 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందరి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రమంతటా రాబోయే రెండ్రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ చేసింది. ఇప్పటివరకు ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 2022  ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఈ ఏడాది వర్షాకాలంలో 113 కొండచరియలు విరిగిపడటంతో 9,615 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. సిమ్లాలో 100కి పైగా బిల్డింగ్‌లు కూలిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయం ఆ వరదలకు కొట్టుకుపోయింది. 

వరదలకు ఇప్పటివరకు 346 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రకృతి విప్తతు వల్ల రెండు నెలల్లో దాదాపు రూ.8,100 కోట్ల నష్టం జరిగినట్లు రాష్ట్ర సర్కార్‌‌ అంచనా వేసింది. వరదల వల్ల ఏర్పడిన నష్టానికి కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పడుతుందని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్‌‌ సింగ్‌ తెలిపారు. 

పలు రాష్ట్రాల ఆర్థిక సాయం..

హిమాచల్‌ప్రదేశ్‌కు ఆదుకోవడానికి పలు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. వరద సాయం కింద కర్నాటక, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఒక్కొక్కటి రూ.15 కోట్ల చొప్పున విరాళంగా ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.200 కోట్లు సాయం ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా ర.11  కోట్లు సాయం చేసింది.