భారీ వర్షాలకు నీట మునిగిన కారు

తాజాగా గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అండర్పాస్ లో ఒక కార్ ఇరుక్కుపోయింది.  ఇక స్థానికులు , అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కార్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుజరాత్లో శుక్రవారం అనగా ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా అటుగా వెళుతున్న కార్ నీట మునిగిపోయింది. నవ్సారి మందిర్ గామ్ అండర్పాస్ లో కారు చిక్కుకోవడంతో కారు లోపల ఉన్న నలుగురు వ్యక్తులు భయభ్రాంతులకు గురి అయ్యారు. దీంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖ […]

Share:

తాజాగా గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అండర్పాస్ లో ఒక కార్ ఇరుక్కుపోయింది.  ఇక స్థానికులు , అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కార్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుజరాత్లో శుక్రవారం అనగా ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా అటుగా వెళుతున్న కార్ నీట మునిగిపోయింది. నవ్సారి మందిర్ గామ్ అండర్పాస్ లో కారు చిక్కుకోవడంతో కారు లోపల ఉన్న నలుగురు వ్యక్తులు భయభ్రాంతులకు గురి అయ్యారు. దీంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖ అలాగే అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో కార్లో ఉన్న నలుగురిని రక్షించడం జరిగింది. ఇకపోతే గుజరాత్ లో అకాల వర్షాల కారణంగా కారు నీటిలో మునిగిపోవడం ఒక వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను కొంతమంది నెట్టింట షేర్ చేయగా ఆ వీడియో కాస్త చాలా వైరల్ గా మారింది.. ఇక ఆ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే కారులో ఉన్నవారు తమ కారు నుండి తప్పించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ కారు మాత్రం నీటి ఉద్రిక్తతకు తట్టుకోలేక మునిగిపోతోంది. పూర్తిగా నీటిలో మునిగిపోయిన కారు పైకప్పు మాత్రమే మనకు వీడియోలో కనిపిస్తుంది. జూన్ 27వ తేదీన వచ్చిన రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటి నుంచి గుజరాత్ లో భారీ వర్షాలు వరదలు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ గురువారం స్పష్టం చేసింది.

 ఇకపోతే జూలై 1 నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గుజరాత్ లోని వల్సాద్ ,డాంగ్, సూరత్, తాపీ, దాద్రా నగర్ హవేలీ వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఇక సౌరాష్ట్ర ,ఉత్తర గుజరాత్లలో ఈరోజు కూడా ఇదే వాతావరణం కొనసాగానుంది అని సమాచారం. ముఖ్యంగా అహ్మదాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే అకాల వర్షాల కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాలను వరదలు ముంచోత్తడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో క్లిప్స్ కూడా ఇప్పుడు నెట్టింటే చాలా వైరల్ గా మారుతున్నాయి. జునాగడ్ లో కూడా వర్షం కారణంగా అక్కడి డాం పొంగిపొర్లడం మనం చూడవచ్చు. మంగళవారం అనగా జూన్ 27వ తేదీన ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో దక్షిణ గుజరాత్ జిల్లాలైన నవసారి మరియు వలసలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అకాల వర్షాల కారణంగా అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురి అవ్వడమే కాదు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు.

 ఇక వారికి అన్న పానీయాలు చాలా కష్టంగా మారిపోయాయి . ఇక ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడి ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడంతోపాటు వారి కడుపు నింపడానికి ఆహారాన్ని కూడా అందజేయబోతున్నట్లు ప్రకటించారు.  ఇకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలను వీడియోల రూపంలో బంధించి కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవ్వడమే కాదు అక్కడ ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది అని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఉన్నాయి. ఇక దీనిపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుతున్నారు.