BRS: బీఆర్ఎస్ విజయం త‌థ్యం అంటున్న హరీష్ రావు

తెలంగాణ (Telangana) రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్ (BRS) ఇప్పటికే ఎన్నికల (Elections) సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు కృషి చేస్తూ, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తమ జెండాను ఎగరేయాలని తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana)లో నిర్వహించిన కొన్ని సర్వేల ప్రకారం, కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అంటూ హరీష్ రావు (T. Harish Rao) తన ధీమాని వ్యక్తం చేశాడు.  బీఆర్ఎస్ […]

Share:

తెలంగాణ (Telangana) రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్ (BRS) ఇప్పటికే ఎన్నికల (Elections) సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడమే కాకుండా, తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు కృషి చేస్తూ, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తమ జెండాను ఎగరేయాలని తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana)లో నిర్వహించిన కొన్ని సర్వేల ప్రకారం, కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అంటూ హరీష్ రావు (T. Harish Rao) తన ధీమాని వ్యక్తం చేశాడు. 

బీఆర్ఎస్ విజయం ఖచ్చితం అంటున్న హరీష్ రావు: 

వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో (Elections) బీఆర్‌ఎస్ (BRS) అఖండ మెజారిటీతో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని సర్వేలు సూచిస్తున్నాయని వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు శుక్రవారం అన్నారు. ప్రజలు తమ ఇంటి గడప వద్ద అభివృద్ధిని చూశారని, బీఆర్‌ఎస్ (BRS)‌ను ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్ (BRS) విశ్వాసానికి మారుపేరుగా ఉండగా, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు మోసం చేయడం ఒకటే తెలుసు అంటూ పార్టీ మీద దాడి కూడా చేశారు హరీష్ రావు (T. Harish Rao). బీఆర్‌ఎస్ (BRS)‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని సాధించుకున్నారని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ (Telangana)ను అతలాకుతలం చేయడానికి ఇప్పుడు ఎన్నికలలో (Elections) ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తున్న దుష్టపాలన ఉదాహరణ అని హరీష్ రావు (T. Harish Rao) అన్నారు. 

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతుందని విమర్శించారు. బీఆర్‌ఎస్ (BRS) మేనిఫెస్టో సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చిందని, కోటి మందికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు పగ తీర్చుకునే మనస్తత్వం ఉంటే సగం మంది కాంగ్రెస్ నేతలు కటకటాల వెనకే ఉండేవారని కూడా మరొకసారి గుర్తు చేశారు హరీష్ రావు (T. Harish Rao). 

ఎన్నికల జోరు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల (Elections) జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Elections) సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana) బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కెసిఆర్. 

BRS మేనిఫెస్టో, కెసిఆర్ ఇచ్చిన హామీలు:

సౌభాగ్యలక్ష్మి పథకం (scheme) ద్వారా అర్హులైన నిరుపేద మహిళలందరికీ నెలకు 3000 అందజేయడం.

1. అన్ని అర్హత కలిగిన BPL కుటుంబాలకు 400 గ్యాస్ సిలిండర్.

2. ఆసరా పింఛన్లను 5000లకు పెంచడంతోపాటు వార్షిక పెంపుదల 500.

3. ఆరోగ్యశ్రీ భీమా పథకం (scheme) కవరేజీని 15 లక్షలకు పెంచేందుకు కేసీఆర్ (KCR) ఆరోగ్య రక్ష పథకం (scheme).

4. రైతు బంధు పథకం (scheme) ప్రారంభ పెంపు 11000తో ఎకరానికి సంవత్సరానికి 16000 పెంచబడుతుంది.

5. ప్రభుత్వం 100% ప్రీమియం చెల్లించి బీపీఎల్ కార్డుదారులందరికీ, 5 లక్షల బీమా పథకాన్ని (scheme) అందజేస్తామని కేసీఆర్ (KCR) భీమా ప్రతి ఇంటికి ధీమా వ్యక్తం చేశారు.

6. గృహలక్ష్మి పథకం (scheme) కింద హైదరాబాద్‌లో 1లక్ష, 2బిహెచ్‌కె ఇళ్లను నిర్మిస్తున్నారు.

7. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు,

మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చాలి.

8. మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు.

9. వారిని రాష్ట్ర పిల్లలుగా అరిగినలోకి తీసుకుని తెలంగాణ (Telangana) ప్రభుత్వం అనాథ పిల్లల పథకాన్ని (scheme) అమలు చేయడం.

10. అసైన్డ్ భూములపై ఆంక్షల తొలగింపు.

11. సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్లపై ప్రత్యేక రీసెర్చ్.

12. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించేందుకు తెలంగాణ (Telangana) అన్నపూర్ణ పథకం (scheme) అమలు.