హైదరాబాదులో సగం బిల్డింగులు నీట మునిగే అవకాశం 

ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా వరదలతో అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మహానగరం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో సగం పైగా బిల్డింగులు మునిగిపోయే అవకాశం ఉందని జిహెచ్ఎంసి వెల్లడించింది. అయితే జిహెచ్ఎంసి, వర్షాకాలంలో మహా నగరానికి పొంచి ఉన్న ముప్పు గురించి పరీక్షించగా, 2024 నాటికల్లా 1700 mm పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికే ప్రకృతి విపత్తుల ద్వారా అర్థమైన విషయమే. 2020 వ సంవత్సరం […]

Share:

ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా వరదలతో అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మహానగరం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో సగం పైగా బిల్డింగులు మునిగిపోయే అవకాశం ఉందని జిహెచ్ఎంసి వెల్లడించింది. అయితే జిహెచ్ఎంసి, వర్షాకాలంలో మహా నగరానికి పొంచి ఉన్న ముప్పు గురించి పరీక్షించగా, 2024 నాటికల్లా 1700 mm పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇప్పటికే ప్రకృతి విపత్తుల ద్వారా అర్థమైన విషయమే. 2020 వ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు, వాతావరణం లో చాలా మార్పు వచ్చిందని, అయితే ఇక ముందు కూడా వాతావరణం లో చాలా మార్పులు వస్తాయని దానివల్ల భూమి విస్తీర్ణం కూడా చాలా తగ్గుతుందని చెప్పారు వాతావరణ అధికారులు. అంతేకాకుండా 2024 నాటికి 240 mm మొదలుకొని 2040 నాటికి 1740 mm పైగా వర్షం నమోదు అవుతుందని చెప్పారు.

హైదరాబాద్ భవనాలు మునిగిపోయే ప్రమాదం: 

హైదరాబాదులో బిల్డింగ్స్ మరియు రోడ్లు తీవ్రంగా మునిగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ మాధురి రాంపల్లి మరియు ఇతర ప్రొఫెసర్లతో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కలసి దీనిపై రీసెర్చ్ చేసిన వారు చెప్పారు. అయితే జీవీఎంసీ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ మరియు నివాసాలు ఏవైతే మునిగి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాటన్నిటికీ వాటర్ ప్రూఫ్ చేయాలని లేదంటే చాలా ఇబ్బంది పడతారని తెలిపారు.

బిల్డింగ్స్ వాటర్ ప్రూఫ్ ఏకాక, మిగతా వాటర్ రిసోర్సెస్ నీ కూడా సరైన పద్ధతిలో మెయింటైన్ చేయాలని, ఎప్పటికప్పుడు వాటన్నింటినీ పరిగణించాలని మాధురి రాంపల్లి గారు చెప్పారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ని మరియు నివాసాలని వాటర్ ప్రూఫ్ చేయాలంటే దాదాపు 4,964 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు.

జిహెచ్ఎంసి తన రీసెర్చ్ కోసం, హైదరాబాదులో 16 జోన్లుగా డివైడ్ చేసి వివిధ ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అయితే వీరి రీసెర్చ్ లో మూసీ నది మరియు హుస్సేన్ సాగర్ కీలకమైన అంశాలని ఎక్కువ శాతం నీరు వీటి నుండే ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు. అయితే ఇవి ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా రిస్క్ అని చుట్టుపక్కల ఉండే నివాసాలు చాలా అప్రమత్తంగా ఉండాలని అవి నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని చెప్పారు.

జిహెచ్ఎంసి వారు జరిపిన పరిశోధన ప్రకారం ఫలక్నామా, కాచిగూడ మరియు బేగం బజార్ ప్రాంతాలకు చాలా ముప్పు ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాలు ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉందని ఇక్కడ ఉండే నివాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని మరియు విద్యుత్ తీగల వల్ల చాలా ఆటంకాలు కలగవచ్చు అని చెప్పారు.

అయితే వనస్థలిపురం, గచ్చిబౌలి లాంటి ఏరియాలో రిస్క్ తక్కువ ఉందని అవి కొంచెం ఎగువ ప్రాంతాలని వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పడాల్సిన అవసరం లేద,ని అయినా సరే ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ వర్షాకాలంలో ముప్పు ఎలాగైనా రావచ్చని ఇప్పటికే మహానగరం మొత్తం నీటిమట్టం అయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని దీనికి జిహెచ్ఎంసి వివిధ జోన్లు కింద సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ వర్షాకాలంలో మెయిన్ గా డ్రైనేజీ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. డ్రైనేజీ సిస్టం బాగుంటే మామూలు ప్రాంతాలు చెరువులను తలపించే అవకాశం ఉంటుంది.