LCA తేజస్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ అందుకున్న IAF

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎల్‌సీఏ తేజస్‌కు సంబంధించిన తొలి ట్రైనర్ వెర్షన్‌ను బెంగుళూరులో ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరికి అందజేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బుధవారం తెలిపింది. IAF ఇన్వెంటరీలో మరో 83 అదనపు LCAల కోసం ఒప్పందంపై సంతకం చేసి, మరో 97 కొనుగోలుకు ముందుకు వెళుతున్నట్లు చౌదరి చెప్పారు. HALతో ఒప్పందం:  భారత వైమానిక దళంలో ఇప్పటికే రెండు LCA స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని చౌదరి […]

Share:

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎల్‌సీఏ తేజస్‌కు సంబంధించిన తొలి ట్రైనర్ వెర్షన్‌ను బెంగుళూరులో ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరికి అందజేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బుధవారం తెలిపింది. IAF ఇన్వెంటరీలో మరో 83 అదనపు LCAల కోసం ఒప్పందంపై సంతకం చేసి, మరో 97 కొనుగోలుకు ముందుకు వెళుతున్నట్లు చౌదరి చెప్పారు.

HALతో ఒప్పందం: 

భారత వైమానిక దళంలో ఇప్పటికే రెండు LCA స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని చౌదరి చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు 83 అదనపు LCA లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు అంతేకాకుండా మరో 97 LCAలను కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు IAF చీఫ్. అంతేకాకుండా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు చీఫ్.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర రక్షణ శాఖ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మకమైన రోజని.. హెచ్‌ఏఎల్‌లో భాగమైనందుకు.. అంతేకాకుండా ఇక్కడ జరిగిన అన్ని ఒప్పందాలను చూసినందుకు చాలా గర్వపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల క్రితం మనం యుద్ధ విమానాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డామని.. భారతదేశం అన్ని రంగాల్లో మెరుగ్గా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని.. తాము కూడా ఇదే కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

18, 2-సీటర్స్ HALకు IAF నుండి ఆర్డర్‌ వచ్చింది. FY 2023-24లో ఎనిమిది 2-సీటర్స్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇంకా, 2026-27 నాటికి 10 2-సీటర్స్ క్రమంగా డెలివరీ చేయడం జరుగుతుంది. IAF మరిన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందని HAL ఇప్పటికే భావిస్తుంది. 

ఇటీవల HALతో టై అప్ అయిన GE ఏరోస్పేస్: 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్స్ ప్రొడక్షన్ కలిసికట్టుగా హాల్ మరియు GE ఎరోస్పేస్ మొదలుపెట్టనున్నాయని అనౌన్స్మెంట్ జరిగింది. దీనికి సంబంధించి యుఎస్ సంబంధిత సంస్థ ఏమన్నారంటే,” ఒప్పందం ప్రకారం, GE ఎరోస్పేస్ F414 ఇంజన్స్ తయారీ విషయంలో GE ఏరోస్పేస్ యూఎస్ గవర్నమెంట్తో పనిచేయడం కొనసాగుతూనే ఉంటుంది, దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది” అని వెల్లడించారు.

అంతేకాకుండా, భారత్ మరియు అమెరికా మధ్య డిఫెన్స్ పరంగా ఉన్న సంబంధం HAL రాకతో మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అగ్రిమెంట్ ప్రకారం HAL తో సంబంధం చిరకాలం కూడా ఉంటుంది అనే ఉద్దేశం, GE ఎయిరో స్పేస్ సీఈఓ అలాగే చైర్మన్ లారెన్స్ బయటపెట్టారు.

ప్రస్తుతం HAL, 83 లైట్ కం బ్యాట్ ఎయిరో క్రాఫ్ట్  తయారీ విషయంలో GE 404 వాడుతున్నారు. అంతేకాకుండా భారత దేశంలో GE ఎయిరో స్పేస్ అనేది నాలుగు దశాబ్దాలుగా ఎంతో విస్తరించింది. ఇంజన్స్ తయారీ విషయంలోనే కాకుండా, సర్వీసెస్, అవాయినిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లోకల్ సోర్సింగ్ విషయాలలో కూడా ఎంతో సహాయపడింది.

LCA MK1 మరియు LCA MK2 ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్లో, GE ఏరోస్పేస్ ద్వారా F404 మరియు F414 కూడా పాలుపంచుకున్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే, 75 F404 ఇంజన్స్ ప్రస్తుతానికి డెలివరీ కాగా, మరో 99 LCA MK1A ద్వారా ఆర్డర్ చేయబడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న LCA MK2 ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతానికి F414 డెలివరీ చేయడం జరిగింది. చూడ‌బోతే మోదీ ప‌ర్య‌ట‌న భార‌త్‌కు బాగా క‌లిసి వ‌చ్చేలా ఉంది. అప్ప‌టివ‌ర‌కు రాని ఆలోచ‌న‌లు మోదీ చూసాక ఒక్కొక్క‌టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అమెరికా, భార‌త్ ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డే విధంగా ఉన్నాయ‌న్న విష‌యం క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ఇదంతా మోదీ నాయ‌క‌త్వంలోనే జ‌రుగుతోంద‌ని బీజేపీ కూడా అంటోంది.