రెండో రోజుకు చేరిన‌ జ్ఞానవాపి మసీదు సర్వే.. !

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే… అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించింది…భారీ  పోలీస్ బందోబస్తు మధ్య శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించింది. గతంలో హిందూ దేవాలయంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చి, అక్కడ మసీదును నిర్మించారన్న వాదన నేపథ్యంలో ఈ సర్వే జరుగుతోంది. అయితే జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే కొనసాగుతోంది. […]

Share:

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే… అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించింది…భారీ  పోలీస్ బందోబస్తు మధ్య శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించింది. గతంలో హిందూ దేవాలయంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చి, అక్కడ మసీదును నిర్మించారన్న వాదన నేపథ్యంలో ఈ సర్వే జరుగుతోంది. అయితే జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టి సాయంత్రం 5 గంటల వరకూ షిఫ్ట్‌ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. మొఘలుల కాలంలో నిర్మించిన ఈ మసీదు స్థలంలో అంతకు పూర్వం హిందూ దేవాలయం ఉండేదని, అక్కడున్న ఆలయాన్ని కూల్చివేశారంటూ కొందరు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలుు చేశారు. జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే జరిపితే అసలు నిజాలు బయటపడతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన వారణాసి హైకోర్టు మసీదులో సర్వే జరిపేందుకు పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వేపై స్టే విధించింది ధర్మాసనం. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ పిటిషనర్లకు సూచించింది. దాంతో పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై విచారణ జరిపింది ధర్మాసనం. మసీదులో సర్వే చేయాల్సిందిగా పురావస్తుశాఖను ఆదేశించింది కోర్టు.

ఇప్పటి వరకూ అక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని సంకేతాలను గుర్తించారు అధికారులు. రెండ్రోజుల పాటు జరిగిన సర్వేలో వీటిని సేకరించిన అధికారులు వాటిని భద్రపరిచారు.

ఇదిలా ఉంటే.. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సైంటిఫిక్ సర్వే నిర్వహించేందుకు ఏఎస్‌ఐకి అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ జరుపనుందని ఈ కేసులో తరఫు న్యాయవాదులు తెలిపారు.

జ్ఞానవాపి మసీదు లో శనివారం కూడా సర్వే కొనసాగింది. మధ్యాహ్నం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా కొద్ది సేపు సర్వేను నిలిపివేశారు. మసీదు నిర్మాణానికి ఎలాంటి హాని కలగకుండా, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వే జరపాలని ఏఎస్ఐ ని అలహాబాద్ హై కోర్టు ఆదేశించింది. 

మసీదులో నిర్వహిస్తున్న సర్వే లో ప్రధానంగా మసీదు ప్రాంగణం, ప్రార్థన జరిగే ప్రదేశం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ సర్వేలో ఇప్పటివరకు ఎలాంటి హిందూ విగ్రహాలు లభించలేదని, కానీ, కొన్ని విగ్రహ శిధిలాలను ఏఎస్ఐ అధికారులు గుర్తించారని హిందూ వర్గం తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

విష్ణు శంకర్ జైన్, అడ్వకేట్ మాట్లాడుతూ… 

మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాం. అక్కడ ఉన్న గడ్డిని పూర్తిగా తొలగించాం. మధ్యలో ఉన్న మినార్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. అవేంటని సర్వే చేస్తున్నాం. ఆ ప్రాంతాన్ని ఎవరో కావాలనే దాచి ఉంచినట్టు గుర్తించాం. అందుకే సర్వేకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కోర్టు మాకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. పని వేగంగానే జరుగుతోంది. రేడార్ మెషీన్ వినియోగించి సర్వే చేస్తున్నాం. ఫలితాలు వచ్చేంత వరకూ దయచేసి అంతా ఓపికగా ఉండండి అని ఆయన అన్నారు 

న్యాయవాది సుధీర్ త్రిపాఠీ మాట్లాడుతూ.. సర్వే పూర్తయ్యే సమయానికి స్పష్టమైన విగ్రహాలను కచ్చితంగా గుర్తిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శివలింగం ఉందని భావిస్తున్న వజుఖానాలో విగ్రహాలు లభిస్తాయని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు. 17వ శతాబ్దంలో అప్పటికే నిర్మించి ఉన్న దేవాలయాన్ని కూల్చి మసీదు ను నిర్మించారనడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని ఆయన అన్నారు