తెలంగాణలో దగ్ధమైన బస్సు

ఈమధ్య రైలు ప్రమాదాలు,బస్సు ప్రమాదాలు బాగా పెరిగాయి. తెలంగాణ రాజధాని బస్సు నగర శివారులో కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ఏం కాలేదు. పెద్ద అంబర్ పైట్ దగ్గర ఘటన పెద్ద అంబర్ పేట్ లో గురువారం రాత్రి 11:15కి ఆర్టీసీ బస్సు కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా అందర్నీ ప్రమాదం నుంచి బయటపడేశాడు.  టిఎస్ఆర్టిసి అధికారులు చెప్పే దాని ప్రకారం బీహెచ్ఈఎల్ నుండి గుంటూరు కు వెళ్లే బస్సు ని బృందావన్ […]

Share:

ఈమధ్య రైలు ప్రమాదాలు,బస్సు ప్రమాదాలు బాగా పెరిగాయి. తెలంగాణ రాజధాని బస్సు నగర శివారులో కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ఏం కాలేదు.

పెద్ద అంబర్ పైట్ దగ్గర ఘటన

పెద్ద అంబర్ పేట్ లో గురువారం రాత్రి 11:15కి ఆర్టీసీ బస్సు కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా అందర్నీ ప్రమాదం నుంచి బయటపడేశాడు.  టిఎస్ఆర్టిసి అధికారులు చెప్పే దాని ప్రకారం బీహెచ్ఈఎల్ నుండి గుంటూరు కు వెళ్లే బస్సు ని బృందావన్ హోటల్ దగ్గర క్లీన్ చేయడానికి ఆపినప్పుడు అది తగలబడుతుందనే విషయం డ్రైవర్ కి అర్థమైంది. వెంటనే తను ప్యాసింజర్స్ అందర్నీ బయటకు రమ్మని చెప్పాడు. అదృష్టవశాత్తు బస్సులో 11 మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. ఈ మంట రావడానికి షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు. పోలీసులు ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. 

పెరుగుతున్న ప్రమాదాలు ,

జాగ్రత్త పడేదెలా? 

ఈ మధ్యకాలంలో ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు పెరిగిపోయాయి. మొన్న రీసెంట్ గా ఒడిస్సా దగ్గర జరిగిన బాలాసోర్ ఘటనలో వందల మంది చనిపోయారు. వేల మంది గాయాల పాలయ్యారు. ఆ ఘటనలో రైల్వే వాళ్ళ నిర్లక్ష్యం కొన్ని వందల ప్రాణాలు తీసింది. 

ఈ ఘటన జరిగాక చాలామంది రైలులో వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇంతకుముందు చాలామంది ఫ్లైట్స్ అంటే భయపడేవారు. ఈ ఘటన జరిగాక రైల్లో వెళ్లే వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. నిన్న పగిడిపల్లి దగ్గర ఫలక్ నామా రైలు రెండు బోగీలు తగలబడ్డాయి. అదృష్టవశాత్తు ఘటన పొద్దున జరగడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద జరిగింది. ఒక ప్రయాణికుడు ట్రైన్ బోగిలు తగలబడడం చూసి వెంటనే చైన్ లాగాడు దానివల్ల వందల మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. తర్వాత వీళ్ళందర్నీ రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ తరలించారు. ఇలా రైలు ప్రమాదాలే అనుకుంటే నిన్న రాత్రి అంబర్పేట్ దగ్గర జరిగిన ఈ ఘటన ప్రయాణికులని బస్సులను చూసి కూడా భయపడేలా చేసింది. 

రైల్వే అధికారులు, ఆర్టీసీ వాళ్లు జాగ్రత్తలు తీసుకోకుంటే మరిన్ని ప్రమాదాల జరగొచ్చు. అందుకే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆర్టీసీ మీద నమ్మకం పెరుగుతుంది. ఇప్పటికే చాలామంది సొంత వెహికల్స్ కొనుక్కొని ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా ప్రమాదాలు చూసి మరి కొంతమంది కూడా దారిమళ్లే అవకాశం ఉంది . ఇలా జరిగే లోపే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని లోపాలు సరిదిద్దుకుంటే ప్రయాణికులకు మళ్లీ ఆర్టీసి మీద నమ్మకం పెరుగుతుంది. అంబర్పేట్ నటనలో ప్రాణనష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదని కోరుకుందాం. వెంటనే అధికారులు స్పందించి తమ లోపాలు సరిదిద్దుకొని మళ్లీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాం.  అంబర్పేట్ ఘటనలో 11 మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎక్కువమంది ఉంటే వాళ్లను బయటకు తీయడం కూడా కష్టమయ్యేది. ఇకపైనైనా ఆర్టీసీ జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.