త‌ల్లి ఎగ్జామ్ రాస్తుంటే.. బిడ్డ‌ను చూసుకున్న కానిస్టేబుల్

ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసే ఉంటాము. ప్రస్తుతం ట్విట్టర్లో ఒక కానిస్టేబుల్ మరొకరి బిడ్డని ఎత్తుకొని ముద్దాడడం వైరల్ గా మారింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి: పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దయ బెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఆరు నెలల పసిబిడ్డ నీ ఎత్తుకొని ముద్దాడే ఫోటో ట్విట్టర్ లోని వైరల్ గా మారింది. అయితే గుజరాత్ లోని హైకోర్టుకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే […]

Share:

ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసే ఉంటాము. ప్రస్తుతం ట్విట్టర్లో ఒక కానిస్టేబుల్ మరొకరి బిడ్డని ఎత్తుకొని ముద్దాడడం వైరల్ గా మారింది.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దయ బెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఆరు నెలల పసిబిడ్డ నీ ఎత్తుకొని ముద్దాడే ఫోటో ట్విట్టర్ లోని వైరల్ గా మారింది.

అయితే గుజరాత్ లోని హైకోర్టుకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక మహిళ తన బిడ్డను తీసుకొని ఎగ్జామ్ రాసేందుకు వస్తోంది. కాకపోతే బిడ్డను చూసుకునేందుకు తనతో పాటు ఎవరూ రాకపోవడం గమనార్హం.

అయితే తన తల్లి ఎగ్జామినేషన్ కి వెళ్తున్న సమయంలో, బిడ్డ గుక్కపెట్టి ఏడవడం ఒక కానిస్టేబుల్ చూస్తుంది. ఆ మహిళ బిడ్డను పరీక్ష అయ్యేంతవరకు చూసుకోవడానికి ఒప్పుకుంటుంది.

అదే సమయంలో తన తల్లి బిడ్డను వదిలి వెళ్ళటానికి కానిస్టేబుల్ ఎంతగానో సహాయపడింది. ఎగ్జామ్ రాసేందుకు ఇబ్బంది పడకుండా ఆ కానిస్టేబుల్ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒప్పుకుంది.

అయితే ఇది ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అనంతరం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానిస్టేబుల్ బిడ్డను తీసుకొని తల్లికి సహాయ పడడం చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభిమానులు మాటల్లో:

ట్విట్టర్లో బిడ్డని ఎత్తుకొని కానిస్టేబుల్ ముద్దాడుతున్న ఫొటోస్ వీడియోస్ చెక్కర్లు కొడుతున్నాయి. ఇదే క్రమంలో చాలామంది కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు. కానిస్టేబుల్ అంటే అర్థం చెప్పిన ఆ మహిళను చాలామంది గౌరవంగా సెల్యూట్ చేస్తున్నారు.

అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఆ కానిస్టేబుల్ కి అభిమానులు కూడా ఎక్కువయ్యారు. ఒక అభిమాని కామెంట్ పెడుతూ, ఇలాంటి కానిస్టేబుల్ లో ఉండడం దేశానికి గర్వకారణం అంటూ వ్రాసుకొచ్చారు. మరొకరు పోలీస్ అంటే అర్థం చెప్పారని అంతేకాకుండా ఒక తల్లికి సహాయపడి నిజమైన పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు పొందారని కామెంట్ ద్వారా పొగిడారు.

‘అల్లరి చేస్తే పోలీసులకు ఇచ్చేస్తాను’ అనే మాటను నిజం చేశారు అంటూ మరొక కామెంటర్  చిలిపిగా కామెంట్ పెట్టారు. మరొకరు అహ్మదాబాద్ పోలీసులంటే నిరూపించారు అంటూ, ప్రజలకు సహకారంగా ఉండటమే పోలీసుల కర్తవ్యం అంటూ, పోలీసును ఇప్పుడు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి సెల్యూట్ చేస్తున్నారు.

తల్లి ఆనందం:

ఎగ్జామినేషన్ కి వచ్చినప్పుడు బిడ్డని ఎవరు చూసుకుంటారు!. తన బిడ్డ ఏడుస్తుంటే ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లి ఎగ్జామ్ సాఫీగా ఎలా రాయాలో! అంటూ, కలవర పడిన తల్లి మనసును ఒక కానిస్టేబుల్ శాంతింప చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయం.

బిడ్డ కోసం ఎగ్జామ్ కూడా వద్దు అనుకునే తల్లులు చాలా మంది ఉన్నారు. కాకపోతే తమకి భరోసాగా మేమున్నామంటూ కానిస్టేబుల్ తన సహకారాన్ని అందించి తన బిడ్డను ఎగ్జామ్ అయ్యేంతవరకు కంటికి రెప్పలా చూసుకోవడం నిజంగా గొప్ప విషయం. అందుకే లేడీ కానిస్టేబుల్ చేసిన గర్వకారణమైన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఎక్సమ్ సాఫీగా పూర్తి చేసుకున్న బిడ్డ తల్లి సంతోషపడింది. విచిత్రం ఏంటంటే, ఎగ్జామినేషన్ అయ్యేంతవరకు కూడా కానిస్టేబుల్ దగ్గర, చాలా చక్కగా అల్లరి చేయకుండా ఏడవకుండా, ఆ చిన్న బిడ్డ తన తల్లి కోసం వేచి చూసింది.