ఈ వారం గుజరాత్‌లో అకాల వర్షాలు పడే అవకాశం: IMD

ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ మధ్య, అదే విధంగా 9వ తేదీ తర్వాత గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో  మళ్లీ  అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా IMD బులెటిన్ ప్రకారం, ఏప్రిల్ 5వ తేదీన పంచమహల్ మరియు దాహోద్ సహా ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం […]

Share:

ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ మధ్య, అదే విధంగా 9వ తేదీ తర్వాత గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో  మళ్లీ  అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరించింది.

తాజా IMD బులెటిన్ ప్రకారం, ఏప్రిల్ 5వ తేదీన పంచమహల్ మరియు దాహోద్ సహా ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏప్రిల్ 6వ తేదీన, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన మరియు 40 కి.మీ కంటే తక్కువ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఇక బనస్కాంత మరియు సబర్‌కాంత సహా ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 7వ తేదీన కూడా ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖా…గంటకు 40 కిమీ కంటే తక్కువ వేగంతో  గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకా ఉరుములతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదనంగా, ఉత్తర గుజరాత్ ప్రాంతంలోని పటాన్, మెహసానా సబర్‌కాంత జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సౌరాష్ట్ర కచ్ జిల్లాలైన రాజ్‌కోట్, పోర్‌బందర్ మరియు కచ్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక గుజరాత్‌లోని అన్ని జిల్లాలు, సౌరాష్ట్ర కచ్ మరియు డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీలలో ఏప్రిల్ 8వ తేదీన మాత్రం వర్షం పడే అవకాశం లేదని,  డ్రై డేగా ఉండే అవకాశం ఉందని వాతావరం శాఖ తెలిపింది.

ఏప్రిల్ 9వ తేదీన, దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని ఛోటా ఉదేపూర్, నర్మదా, డాంగ్ మరియు తాపీ జిల్లాల్లో మరియు కచ్ లోని కొన్ని జిల్లాలో తేలికపాటి చిరు జల్లులు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయంది IMD.

ఏప్రిల్ 9వ తేదీ తర్వాత, వచ్చే రెండు రోజులలో అంటే ఏప్రిల్ 10 11 తేదీల వరకు వాతావరణ సూచనలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.