ఇకపై స్టూడెంట్స్‌కు మరింత భారం కానున్న పీజీ స్టే 

మన కుటుంబం ఉండే ఊర్లో కాకుండా వేరే ఏదైనా సిటీలో కానీ పట్టణంలో కానీ ఉండి చదువుకోవాల్సి వచ్చినా లేదా ఉద్యోగం చేయాల్సి వచ్చినా విద్యార్థులు ముందుగా ఎంచుకునేది పేయింగ్ గెస్ట్ సదుపాయం లేదా హాస్టల్స్. కానీ ఇప్పుడు వాటి ఖర్చు మరింత ప్రియం కాబోతుంది. మధ్య తరగతి కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబానికి దూరంగా పట్టణంలో ఉద్యోగం చేయాల్సి వస్తే వారు కూడా పీజీ లనే ఎంచుకుంటున్నారు, దానికి కారణం ఏంటంటే తక్కువ ఖర్చులో […]

Share:

మన కుటుంబం ఉండే ఊర్లో కాకుండా వేరే ఏదైనా సిటీలో కానీ పట్టణంలో కానీ ఉండి చదువుకోవాల్సి వచ్చినా లేదా ఉద్యోగం చేయాల్సి వచ్చినా విద్యార్థులు ముందుగా ఎంచుకునేది పేయింగ్ గెస్ట్ సదుపాయం లేదా హాస్టల్స్. కానీ ఇప్పుడు వాటి ఖర్చు మరింత ప్రియం కాబోతుంది. మధ్య తరగతి కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబానికి దూరంగా పట్టణంలో ఉద్యోగం చేయాల్సి వస్తే వారు కూడా పీజీ లనే ఎంచుకుంటున్నారు, దానికి కారణం ఏంటంటే తక్కువ ఖర్చులో అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి అని. 

హైదరాబాద్ లేదా బెంగుళూరు లాంటి మెట్రో సిటీలలో కుటుంబానికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే యువత చాలా ఎక్కువ మంది ఉంటారు. వారు అందరూ ఆ సిటీలలో ఇల్లు అద్దెకు తీసుకోవాలి అంటే ఇంటి అద్దెలు వేలల్లో ఉంటాయి పైగా ఒకొక్కరే అంత అద్దె భరించాలి అంటే చాలా కష్టం కూడా. అలాంటి సమయంలో వారికి దొరికిన ప్రత్నామ్యాయం పేయింగ్ గెస్ట్ లేదా హాస్టల్స్. వీటిలో మధ్య తరగతి వారికి సరిపోయే వసతులతో పాటు ధర కూడా అందుబాటులో ఉంటుంది. 

పీజీలు / హాస్టల్స్ నివాస గృహాలు కాదు కాబట్టి వీటి మీద GST వర్తిస్తుంది. 

పీజీ లేదా హాస్టల్ యజమానులు వాటిని అద్దెకు ఇవ్వడం లేదు కాబట్టి నివాసులు చెల్లించే రుసుము అద్దె కిందకు రాదు. నివాసం లేదా శాశ్వత వసతి కోసం నిర్మించిన వాటిలో గెస్ట్ హౌస్ లేదా లాడ్జింగ్ సేవలు అందించకూడదు, పేయింగ్ గెస్ట్ స్టే లేదా హాస్టల్ కూడా గెస్ట్ హౌస్, లాడ్జింగ్ సేవలను పోలి ఉంటుంది. కాబట్టి వీటికి GST మినహాయింపు లేదు అని అధారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ బెంగుళూరు బెంచ్ పేర్కొన్నది. వీటిపై 12% GST వర్తిస్తుంది అని వెల్లడించింది. జూలై 18, 2022 నుండే GST అమలు కావాల్సి ఉంది అని లక్నో AAR బెంచ్ తెలిపింది. 

పెరగనున్న పీజీ / హాస్టల్ ధరలు 

పీజీ నివాసం పై GST అమలుకు ఆదేశాలు వచ్చాయి, దీంతో ఈ భారం ఇప్పుడు పీజీ లో నివసించే వారి మీద పడనున్నది. ఒక వ్యక్తి నెలకు ముప్పై వేల రూపాయలు చెల్లించి పీజీ లో ఉంటున్నట్లు అయితే ఇప్పుడు ఆ ధర 12 శాతం GST తో కలుపుకుని 33600 రూపాయలు కానున్నది. సామాన్య ప్రజలకు ఇది భారమే అవుతుంది. AMRG & అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మాట్లాడుతూ హాస్టల్స్ మరియు డార్మిటరీ లపై 12 శాతం GST విధించడం భారతీయ కుటుంబాలపై అధిక భారాన్ని మోపుతోంది అని అన్నారు. 

బెంగుళూరు AAR బెంచ్, లక్నో AAR బెంచ్ రెండు వేర్వేరు తీర్పులలో ఈ విషయాన్నీ వెల్లడించడంతో పీజీ మరియు హాస్టల్స్ లో ఉండేవారు ప్రత్నామ్యాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. అయితే రోజుకి 1000 రూపాయల కంటే తక్కువ అద్దె కలిగిన హోటల్స్ లేదా లాడ్జిలలో GST వసూలు చేయడానికి వీలు లేదు. ఈ విషయం కాస్త ఊరట కలిగించేలా ఉన్నా కూడా తక్కువ రోజులు ఉండేవారి కోసం చాలా వరకూ హాస్టల్స్, పీజీలు రోజుకు 1000 రూపాయల పైననే రుసుము వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వీటిపై GST కూడా కలిస్తే సామాన్యులకు భారం అవుతుంది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.