మరో దావూద్‌ మాదిరిగానే బిష్ణోయ్‌ ముఠా

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది, వాంటెడ్ టెర్రరిస్ట్ మరియు డ్రగ్ కింగ్‌పిన్ దావూద్ ఇబ్రహీం 1990 లలో వ్యాప్తి చెందిన విధంగానే బిష్ణోయ్ గ్యాంగ్ కూడా విస్తరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 1990లలో దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించుకున్నాడో అదే విధంగానే, తన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టెర్రర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వ్యూహం ఉందని జాతీయ దర్యాప్తు […]

Share:

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది, వాంటెడ్ టెర్రరిస్ట్ మరియు డ్రగ్ కింగ్‌పిన్ దావూద్ ఇబ్రహీం 1990 లలో వ్యాప్తి చెందిన విధంగానే బిష్ణోయ్ గ్యాంగ్ కూడా విస్తరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1990లలో దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించుకున్నాడో అదే విధంగానే, తన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టెర్రర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వ్యూహం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ కుట్ర కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

NIA ఏమంటుంది:

లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని టెర్రర్ సిండికేట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మరియు డ్రగ్ కింగ్‌పిన్ దావూద్ ఇబ్రహీం వలె పక్కాగా ఒక రీతిలో విస్తరించిందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. “లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని టెర్రర్ సిండికేట్ యొక్క విస్తరణ గమనించినట్లయితే, వాంటెడ్ టెర్రరిస్ట్, గ్యాంగ్‌స్టర్ మరియు డ్రగ్స్ కింగ్‌పిన్, పేరుమోసిన వ్యవస్థీకృత టెర్రర్ సిండికేట్ డి-కంపెనీకి నాయకత్వం వహిస్తున్న దావూద్ ఇబ్రహీం ఏ విధంగా అయితే చాప కింద నీరుల వ్యాప్తి చెందిందో అదే వ్యూహాత్మక విధంగా ఉంది” అని NIA తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

మొదట చిన్న చిన్న నేరాలకు పాల్పడిన లారెన్స్ బిష్ణోయ్, తరువాత తన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు మరియు ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ఉత్తర భారతదేశంలో 700 మందికి పైగా షూటర్లను రెడీ చేసినట్లు తెలుస్తోంది, వారిలో 300 మంది పంజాబ్‌కు చెందినవారు.

లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్ సహాయంతో ఇది పంజాబ్ నుండి ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ మరియు జార్ఖండ్‌లకు విస్తరించినట్లు ఇన్వెస్టిగేషన్ సంస్థ తెలిపింది. NIA ప్రకారం, యువకులు సోషల్ మీడియా ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్‌లోకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది మరియు అంతేకాకుండా వారికి కెనడాలో మంచి జీవితం ఉంటుందని హామీ కూడా ఇస్తున్నారట.

NIA ఛార్జిషీట్ ప్రకారం, పాకిస్తాన్‌లో కూర్చున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా, పంజాబ్‌లో లక్ష్య హత్యలు మరియు నేర కార్యకలాపాలను అమలు చేసుకోవడానికి బిష్ణోయ్ గ్యాంగ్ నుండి షూటర్లను తీసుకున్నట్లు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో సహా 16 మంది గ్యాంగ్‌స్టర్లపై ఎన్‌ఐఏ కొన్ని రోజుల క్రితం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం కింద కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. 

అసలు ఇటువంటి ముఠాలు ఎలా ఏర్పడతాయి: 

ప్రస్తుత కాలంలో చాలా మంది హీరోగా కాకుండా విలన్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం చాలా రకాలుగా వారికి మైండ్ వాష్ కారణంగా అయ్యుండొచ్చు, స్నేహితుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అంతేకాకుండా వారు చెడు వ్యసనాలకు అలవాటు పడి, డబ్బులు సంపాదించడం కోసం కూడా ముఠాలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, యువత ఎటువంటి చెడు వైపుకి ప్రభావితం అవ్వకుండా ఉండటానికి ఎక్కువగా చూసుకోవాలి. మొదట్లో చెడు అనేది చిన్నగా మొదలైన సరే తర్వాత అది పెద్దగా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా యువత ఎలాంటి కార్యకలాపాలలో పాలుపంచుకుంటుందో తమ తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. లేదంటే ఇటువంటి ముఠాలలో తమ పిల్లలు కూడా పాలుపంచుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు.