Supreme Court: గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదనే విషయం గుర్తుంచుకోవాలి..

Supreme Court: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం(Approval) తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohit) తీరుపై అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌(Petition)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.   బిల్లులకు సంబంధించిన విషయం కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కూడా […]

Share:

Supreme Court: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం(Approval) తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohit) తీరుపై అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌(Petition)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. 

 బిల్లులకు సంబంధించిన విషయం కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అంతే కాదు ఎన్నికయిన ప్రజా ప్రతినిధులం కాదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పేర్కొంది. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్న అంశంపై పంజాబ్ ప్రభుత్వం(Punjab Govt) దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.

ఈ అంశం కోర్టుకు రాక ముందే నిర్ణయం గవర్నర్లు తీసుకోవాలి. విషయం కోర్టుకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే సంస్కృతికి ముగింపు పలకాలి. గవర్నర్లకు ఆత్మ పరిశీలన(Self-Examination) కూడా అవసరం. వారు ప్రజా ప్రతినిధులు కాదనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. కాగా పంజాబ్ గవర్నర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Tushar Mehta).. బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అనవసరమైందని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసెంబ్లీ(Assembly) ఆమోదించిన బిల్లులకు సంబంధించి పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohit) తీసుకున్న చర్యలపై తాజా నివేదికను అందించాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ పురోహిత్ ఆమోదం తెలిపారు.

చాలా రాష్ట్రాల్లో సిఎంకు, గవర్నర్లకు ఉన్న వైరంలాగే పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్(Bhagwant Singh Man) ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం నెలకొంది. ఇటీవలే పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ తాత్సారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత్ ముఖ్యమంత్రి మాన్‌కు లేఖ రాసిన కొద్ది రోజలు తర్వాత నవంబర్ 1న మూడు ద్రవ్య బిల్లుల్లో రెండింటికి ఆమోదం తెలిపారు. సభలో ద్రవ్య బిల్లులను ప్రవేశ పెట్టాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. 

అయితే అంతకు ముందు అక్టోబర్ 19న మాన్‌కు రాసిన లేఖలో గవర్నర్ మూడు ద్రవ్య బిల్లుల ఆమోదాన్ని నిలిపివేశారు. వాటిలో పంజాబ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్(సవరణ) బిల్లు, పంజాబ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్( సవరణ) బిల్లు), ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు2023 ఉన్నాయి. బడ్జెట్ సెషన్‌కు పొడిగింపుగా అక్టోబర్ 20 21నిర్వహించిన అసెంబ్లీ సమావేశం చట్ట విరుద్ధమని గవర్నర్ గతంలో వ్యాఖ్యానించారు.

తాజా తీర్పు అనంతరం పరిణామాలను కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు(Supreme Court) ముందుంచుతామని సొలిసిటర్ జనరల్ తెలిపారు. దీంతో గవర్నర్ తీసుకున్న చర్యలను కోర్టు ముందుంచాలని న్యాయమూర్తులు జెబి పర్దీవాలా(JB Pardiwala), మనోజ్ మిశ్రాలు(Manoj Mishra) కూడా ఉన్న బెంచ్ ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల కూడా ఇలాంటి పిటిషన్లను దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల సంక్షేమం కోసం ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు చర్యలు తీసుకోవడం లేదన్నారు.