ఆధార్ కార్డుతో తస్మాత్ జాగ్రత్త

ఆధార్ ఇది లేనిది మన దేశంలో ఎటువంటి పని కూడా జరిగే పరిస్థితి లేదు. అలా మారిపోయింది ఆధార్ కార్డు. అందుకోసమే ఆధార్ కార్డును ఏదో గుర్తింపు కార్డుగా కాకుండా ప్రతి ఒక్కరూ చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం మాత్రమే కాదు. మనం డబ్బులు చెల్లించి తీసుకునే వాటికి కూడా కొన్నింటికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలా ప్రతి దానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది కాబట్టే దేశంలో […]

Share:

ఆధార్ ఇది లేనిది మన దేశంలో ఎటువంటి పని కూడా జరిగే పరిస్థితి లేదు. అలా మారిపోయింది ఆధార్ కార్డు. అందుకోసమే ఆధార్ కార్డును ఏదో గుర్తింపు కార్డుగా కాకుండా ప్రతి ఒక్కరూ చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం మాత్రమే కాదు. మనం డబ్బులు చెల్లించి తీసుకునే వాటికి కూడా కొన్నింటికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలా ప్రతి దానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది కాబట్టే దేశంలో ఆధార్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ఆధార్ అడ్డుపెట్టుకుని చేసే మోసాల సంఖ్య కూడా పెరిగిపోయింది. కావున పౌరులు ఆధార్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పౌరులకు సూచించింది. ఈ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని కలవరం వ్యక్తం చేసింది. 

ఆ వివరాలు పంచుకోవద్దు..

ఆధార్ కార్డు అప్ డేట్ చేయాలంటూ ఎవరికైనా సరే.. మెస్సేజెస్ కానీ మెయిల్స్ కనీ వస్తే వాటిని నమ్మొద్దని UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించింది. సైబర్ కేటుగాళ్లు ఈ లింక్స్ ను పంపి మోసాలు చేస్తున్నారంటూ హెచ్చరించింది. ఇటువంటి లింక్స్ వస్తే వాటి మీద క్లిక్ చేయొద్దని సూచించింది. ఇటువంటి మెస్సేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలంది. ఆధార్ కార్డు అంటూ లింక్స్ వస్తే ఆ లింక్స్ మీద క్లిక్ చేయొద్దని తెలిపింది. 

పెరుగుతున్న మోసాలు

నేటి రోజుల్లో ఆధార్ కార్డు వినియోగం పెరగడంతో మోసాలు కూడా పెరిగిపోయాయి. ఆధార్ కార్డులను అంతా ఎప్పుడో దిగారు కాబట్టి వాటిలో ఫొటోలను అప్డేట్ చేసుకోవాలని అంతా అనుకుంటారు. ఇలా అనుకోవడంతో అంతా ఆధార్ కార్డును అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారు. ఇదే అనువుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసాలు నేటి రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతో మంది అమాయకులు ఆధార్ కార్డు మోసాలకు బలవుతున్నారు. ఇందుకోసం జాగ్రత్తగా ఉండాలని UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించింది. ఈ మోసాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వేళ ఈ లింక్స్ క్లిక్స్ చేస్తే బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు కూడా ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది. కావున అందరూ అలెర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. 

అక్కడే అప్ డేట్ చేసుకోండి…. 

ఆధార్ కార్డ్ అప్ డేట్ అంటూ విపరీతంగా లింక్స్ రావడంతో UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా)  అలెర్ట్ అయింది. ఇటువంటి లింక్స్ వస్తే నమ్మకూడదని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెలిపింది. కేవలం UIDAI అధికారిక పోర్టల్ ను మాత్రమే ఉపయోగించాలని ఏది పడితే ఆ పోర్టల్ ను వాడకూడదని UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా)  హెచ్చరించింది. మోసాలు బాగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్కామ్స్ పట్ల సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కానీ ఫలితం మాత్రం ఉండడం లేదు. 

క్యూఆర్ తో మోసాలకు చెక్…. 

క్యూఆర్ కోడ్ తో మోసాలకు చెక్ చెప్పేందుకు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని వల్ల మోసాలకు చెక్ పడుతుందని అథారిటీ భావిస్తోంది. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి సమాచారాన్ని దొంగిలించడం చాలా కష్టం అవుతుంది. కావున ఎవరూ కూడా అప్పుడు సమాచారాన్ని దొంగిలించేందుకు సాహసం చేయరు.