G20 సమ్మిట్ కోసం పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ భ‌ద్ర‌త‌

భారతదేశంలో G20 సమ్మిట్ ఆసన్నమైన సందర్భంలో ముందుగానే పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సమ్మిట్ సందర్భంలో ఎటువంటి అవాంఛిత సందర్భాలు ఎదురవకుండా ఉండేందుకు పట్టిష్టమైన సెక్యూరిటీ అందించేందుకు CERT-IN డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. ఎటువంటి సైబర్ అటాక్ జరిగేందుకు వీలు లేనటువంటి ప్రతిష్టమైన సెక్యూరిటీ అందించడమే కాకుండా, సమ్మిట్ కోసం వచ్చే బస చేసే హోటల్స్ లో కూడా ఎటువంటి వాల్నరబిలిటీ లేకుండా చెక్ చేయడం జరిగింది. ఎక్కడైతే […]

Share:

భారతదేశంలో G20 సమ్మిట్ ఆసన్నమైన సందర్భంలో ముందుగానే పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సమ్మిట్ సందర్భంలో ఎటువంటి అవాంఛిత సందర్భాలు ఎదురవకుండా ఉండేందుకు పట్టిష్టమైన సెక్యూరిటీ అందించేందుకు CERT-IN డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. ఎటువంటి సైబర్ అటాక్ జరిగేందుకు వీలు లేనటువంటి ప్రతిష్టమైన సెక్యూరిటీ అందించడమే కాకుండా, సమ్మిట్ కోసం వచ్చే బస చేసే హోటల్స్ లో కూడా ఎటువంటి వాల్నరబిలిటీ లేకుండా చెక్ చేయడం జరిగింది. ఎక్కడైతే సమ్మిట్ జరగబోతుందో అక్కడ ముందుగానే ఏజెన్సీస్ అన్నీ కూడా ఆడిట్ నిర్వహించి ఇంటర్నెట్ విషయంలో కట్టుదిట్టం చేశారు. మరోపక్క ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ భారతదేశానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన భార్యకు కరోనా సోకడంతో,  జో బిడెన్ కు కూడా ప్రత్యేకమైన పరీక్షలు నిరంతరం జరుగుతున్నాయి.

తీసుకున్న పటిష్టమైన ప్రణాళికలు: 

సమ్మిట్ కి వచ్చిన ఎవరైనా సరే ఇంటర్నెట్ యాక్సెస్ పొందేందుకు అనుమతి ఉండదు. అంతే కాకుండా, ఎటువంటి డివైస్ కనెక్ట్ అయినప్పటికీ, ఆ డివైస్ కి ప్రత్యేకమైన స్ట్రాంగ్ అతంటికేషన్ అలాగే ఆథరైజేషన్ జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అనేది కచ్చితంగా ప్రైవేట్ నెట్వర్క్ లోనే జరుగుతుంది. అయితే సమ్మిట్ కు వచ్చిన ఎవరైనా సరే, వారి డివైస్ ని కనెక్ట్ చేసుకునేందుకు, ఖచ్చితంగా వాటిని వెరిఫై అయిన తరువాతే ఇంటర్నెట్ యాక్సిస్ ఉంటుందని పేర్కొంది ఏజెన్సీ, ఇది జీరో ట్రస్ట్ మోడల్. 

ముఖ్యంగా ఇంటర్నెట్ యాక్సిస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు. ప్రత్యేకించి ఎడ్మిన్ ద్వారా ఆమోదించబడిన డివైసెస్ మాత్రమే ఇంటర్నెట్ యాక్సిస్ పొందగలుగుతాయి. ఇక బయట నుంచి వచ్చిన ఇతరులకు ఎటువంటి ఆక్సిస్ ఉండదని కచ్చితంగా చెప్పింది సెక్యూరిటీ సర్వీస్. అంతే కాకుండా ప్రత్యేకించి హోటల్స్ లో వైఫై సేఫ్టీ పాటించాలని సెక్యూరిటీ ఏజెన్సీలు ముందుగానే సూచించాయి. వైఫై కనెక్షన్.. నెంబర్ ఆఫ్ డివైసెస్ కనెక్టివిటీ కూడా తగ్గించేందుకు హోటల్స్ ని ఆదేశించాయి ముఖ్యంగా ఏది డివైసెస్ నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నాయో మౌనిత చేయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. హోటల్స్ లో అక్కడక్కడ ముందు నుంచి ఉన్న రోటర్స్ అలాగే స్విచ్ పోర్ట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా కోరింది సెక్యూరిటీ ఏజెన్సీ. దీని ద్వారా, బయట వ్యక్తులు ఎవరు కూడా నెట్వర్క్ ఉపయోగించే అవకాశం ఉండదు. ఇలాంటి పద్ధతులు ప్రణాళికలు ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం ద్వారా సైబర్ అటాక్స్ అనేవి, G20 సమ్మిట్ వేళ పూర్తిగా నిర్మూలించవచ్చని సూచించింది, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. 

కొన్ని సర్వీసులకు మాత్రమే అర్హత: 

G20 సమ్మిట్ సమయంలో అంటే సెప్టెంబర్ 8-10 తేదీలలో, జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని కమర్షియల్ డెలివరీ సర్వీసులు కూడా మూడు రోజులు పాటు ఢిల్లీలో పూర్తిగా నిషేధం అని పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సర్వీసులు కూడా మూడు రోజులపాటు సర్వీసులో ఉండవని, మరికొన్ని ఆన్లైన్ సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్లు స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఎస్ఎస్ యాదవ్, ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. 

అయితే మెడికల్ సర్వీసులకు, ల్యాబ్ రిపోర్ట్స్, శాంపుల్ కలెక్షన్స్, అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన హోటల్స్ కి, హాస్పిటల్స్ కి వెహికల్ సర్వీస్లు, హౌస్ కీపింగ్, క్యాటరింగ్, పారిశుద్ధ్య కార్యకలాపాలకి పర్మిషన్ ఉంటుందని, అది కూడా కొన్ని వెరిఫికేషన్ జరిగిన తర్వాతే సర్వీసులు నడిపేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు.