Byju’s పైన ప్రభుత్వం వేటు

ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ Byju’s అప్లికేషన్. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం చాలామంది పేరెంట్స్ మొదట ఎంపిక చేసుకున్నది Byju’s యాప్.  గవర్నమెంట్ ఆర్డర్:  ప్రస్తుతం అందిన నివేదికల ప్రకారం, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎడ్టెక్ స్టార్టప్ Byju’s అకౌంట్స్ ని ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఆరు వారాల్లో […]

Share:

ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ Byju’s అప్లికేషన్. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం చాలామంది పేరెంట్స్ మొదట ఎంపిక చేసుకున్నది Byju’s యాప్. 

గవర్నమెంట్ ఆర్డర్: 

ప్రస్తుతం అందిన నివేదికల ప్రకారం, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎడ్టెక్ స్టార్టప్ Byju’s అకౌంట్స్ ని ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఆరు వారాల్లో నివేదికను కోరిందని సమాచారం. తెలిసిన కొన్ని విషయాల ఆధారంగా, MCAలో భాగమైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO)కి ఈ వ్యవహారాన్ని అప్పగించాలా వద్దా అని మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని సమాచారం.

అయితే, Byju’s కు సలహా ఇస్తున్న ఒక న్యాయ సంస్థ, ప్రస్తుతానికి MCA నుండి కంపెనీకి ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ అందలేదని చెప్పారు. అయితే ఈ వార్త బయటకు వచ్చిన అనంతరం,Byju’s తప్పకుండా ప్రభుత్వం వారికి ఎటువంటి విషయంలోనైనా సహకరిస్తుందని, ఎలాంటి ఇన్స్పెక్షన్ అయినా ఇక్కడ జరగొచ్చు అని MZM లీగల్‌లో మేనేజింగ్ పార్ట్నర్ అయిన జుల్ఫికర్ మెమన్ రాయిటర్స్‌కి ఇమెయిల్లో తెలిపారు.

ఇన్స్పెక్షన్ ఎందుకు?: 

అయితే ఒకప్పుడు విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో ఆర్థిక నేరాల-పోరాట ఏజెన్సీ కూడా సంస్థపై రిపోర్ట్ చేసింది మరియు $1.2 బిలియన్ల టర్మ్ రుణాన్ని పునర్నిర్మించడంపై చట్టపరమైన వివాదంలో Byju’s చిక్కుకుంది.

Byju’s గురించి మరింత: 

ఈ అప్లికేషన్ 2015లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే 2017 నుంచి భారత దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం మరింత అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ అప్లికేషన్ ఉపయోగించే వినియోగదారులు ఎక్కువయ్యారు. ముఖ్యంగా 2020లో, బైజుస్ అప్లికేషన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థాపించుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉండి పాటలు నేర్చుకునేందుకు ఈ అప్లికేషన్ చాలా వరకు ఉపయోగపడింది. అంతే కాదు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న Byju’s అప్లికేషన్ వైపు విదేశీ పెట్టుబడిదారులు కూడా మక్కువ చూపించారు. 

ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉంటున్న వారికి Byju’s అప్లికేషన్ తన వంతు సహకారాన్ని అందించింది. 60 శాతం మంది గ్రామీణ విద్యార్థులు Byju’s ద్వారా చదువుకోగలుగుతున్నారు. అంతేకాకుండా Byju’s అప్లికేషన్లు అందుబాటులో ఉండే మరెన్నో ఎగ్జామ్ కోర్సులు, కాంపిటేషన్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండడం వల్ల, ఉపాధి కూడా సంపాదించగలుగుతున్నారు. ఇలా అనేకమైన తరహాల్లో, Byju’s అప్లికేషన్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

అకడమిక్ సబ్జెక్ట్‌లు మరియు కాన్సెప్ట్‌లు 12-20 నిమిషాల డిజిటల్ యానిమేషన్ వీడియోలతో ఈ అప్లికేషన్ లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రతి కాన్సెప్టు క్లుప్తంగా, స్వయంగా అర్థం చేసుకొని నేర్చుకుంటారు. Byju’s నివేదికల ప్రకారం, మొత్తం 40 మిలియన్ల వినియోగదారులు, 3 మిలియన్ల ప్రీమియం వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 2018లో, యాప్ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు విస్తరించింది.

ఫ్యూచర్ స్కూల్ కోడింగ్ మరియు స్టోరీ టెల్లింగ్ ద్వారా గణితం, సైన్స్, ఇంగ్లీష్, సంగీతం మరియు ఫైన్ ఆర్ట్స్ వంటి ఇతర సబ్జెక్టులతో కూడిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌తో పాసివ్ నుండి యాక్టివ్ లెర్నింగ్‌కు ఒక బ్రిడ్జిగా నిలవాలన్నదే ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. బైజూస్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా మరియు మెక్సికోలలో ఫ్యూచర్ స్కూల్‌ను ప్రారంభించనుంది.

భారతదేశంలోని 200 నగరాల్లో 500 ట్యూషన్ సెంటర్‌లను ప్రారంభించడం ద్వారా బోధన మరియు అభ్యాసం యొక్క హైబ్రిడ్ మోడల్‌ పద్ధతిలో ఉండేందుకు కంపెనీ దృష్టి సారించింది. ఫిబ్రవరి 2022 నాటికి, 80 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం.