ఢిల్లీ నుండి ముంబై వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పెరుగుతున్న రద్దీ కారణంగా విమాన ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం డబ్బున్న వారు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఎక్కువగా విమాన ప్రయాణం చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్న విషయం తెలిసిందే.  అంతే కాదు రోడ్డు ప్రయాణం , రైలు ప్రయాణం వల్ల ఎక్కువ సమయం వృధా అవుతున్న నేపథ్యంలో ఆ సమయాన్ని ఆదా చేయడానికి అలాగే విమానా ప్రయాణం అనే ఒక […]

Share:

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా పెరుగుతున్న రద్దీ కారణంగా విమాన ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం డబ్బున్న వారు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఎక్కువగా విమాన ప్రయాణం చేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్న విషయం తెలిసిందే.  అంతే కాదు రోడ్డు ప్రయాణం , రైలు ప్రయాణం వల్ల ఎక్కువ సమయం వృధా అవుతున్న నేపథ్యంలో ఆ సమయాన్ని ఆదా చేయడానికి అలాగే విమానా ప్రయాణం అనే ఒక గొప్ప అనుభూతిని పొందడానికి కూడా చాలామంది ఎంత ఖర్చైనా పర్లేదు అంటూ ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేస్తున్నారు. అలాంటి ప్రయాణికుల కోసం విమానయాన సంస్థలు శుభవార్త తెలిపాయి.

టికెట్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రయాణికుడికి ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు. మే మరియు జూన్ ప్రారంభంలో దేశీయ విమాన చార్జీలు తగ్గడం మరింత గమనార్హం ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు భారత హృదయ భూభాగాలను చుట్టి ముట్టాయి.. ముఖ్యంగా ఈ సీజన్ ఎయిర్ ట్రావెల్ సీజన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి అందులోనూ చాలామంది టూరు,  ట్రిప్పు అంటూ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాదు భారతదేశంలో రోజు వారి దేశీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దేశీయ చార్జీలు ఘననీయంగా తగ్గడం, డిమాండ్ సరఫరా సమీకరణలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.సగటు రోజుకి నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులు విమానయాన ప్రయాణం చేస్తున్నారని సర్వేలు వెల్లడించాయి.

ఇకపోతే ముఖ్యంగా ఢిల్లీ నుంచి ముంబై వెళ్లడానికి 24 గంటల ముందే టికెట్టు కొనుగోలు చేసిన వారికి విమాన చార్జీలలో భారీగా తగ్గింపును ప్రకటించడం గమనార్హం. మే చివరి వారంలో అలాగే జూన్ ప్రారంభంలో ఢిల్లీ నుండి ముంబైకి మరుసటి రోజు ప్రయాణానికి చౌకైన చార్జీలను అందించారు. ఫ్లైట్ కు దాదాపుగా రూ.  19000 నుండి టికెట్ చార్జీలు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో ఆ మార్గంలో చార్జీలు రూ .18 వేలకు దిగివచ్చాయి. ఇక వారం తర్వాత రూ .14 వేలకు పడిపోయాయి. కానీ గురువారం రోజున ఢిల్లీ ముంబై టికెట్ ధర మరుసటి రోజు ప్రయాణానికి రూ.4,500 ప్రకటించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇతర మార్గాలలో కూడా చివరి నిమిషంలో చార్జీలు తగ్గించడం గొప్ప ప్రయోజనకరమని చెప్పవచ్చు. 

ముఖ్యంగా ముంబై నుండి కొచ్చికి వన్ వే  కి 24 గంటల అడ్వాన్స్ బుకింగ్ చేసినవారికి 4000 రూపాయలకే టికెట్ను అందిస్తున్నారు. గత నెలలో ఈ మార్గంలో టికెట్ల ధరలు రూ .20వేల నుండి ప్రారంభం అయ్యాయి. ఇకపోతే మే మొదటి వారంలో గో ఫస్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత వారానికి 1538 విమానాలను నడపడానికి విమానయాన సంస్థ క్లియర్ చేయబడగా కొన్ని దేశీయ మార్గాలలో విమాన చార్జీలు మే చివరి వారంలో అలాగే జూన్ ప్రారంభంలో అపూర్వమైన స్థాయికి చేరుకొని పెరగడం ప్రారంభించాయి.  కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ధరలు తగ్గడం నిజంగా విమాన ప్రయాణికులకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.  సాధారణంగా గమ్యస్థానాలకు వెళ్లే పర్యాటకులకు గో ఫస్ట్ విమానయాన సంస్థ ప్రముఖ ఎంపికగా ఉండేది. అందులో భాగంగానే మరియు శ్రీనగర్లకు వెళ్లే విమానాలలో విమాన చార్జీలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి లేహ్ వన్ వే టికెట్ ధర ప్రస్తుతం రూ.15,000 గా పలుకుతోంది. ఏది ఏమైనా జూలై మొదటి వారం కల్లా ధరలు తగ్గడం నిజంగా హర్షదాయకమని చెప్పవచ్చు.