“ఇది ఇండియా కాదు… పంజాబ్” అన్న గోల్డెన్ టెంపుల్ సిబ్బంది!

మహిళలకు ఎక్కడా తగిన గౌరవం దక్కడం లేదు. బయట మాత్రమే కాదు. అటు పవిత్ర స్థలాలైన దేవాలయాల్లో కూడా మహిళలను అవమానిస్తున్నారు. తాజాగా ఓ మహిళను ప్రముఖ దేవాలయంలో దారుణంగా అవమానించాడు.ఈ ఘటన ఎక్కడో జరగలేదు. మనదేశంలోనే జరిగింది.పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో జరిగింది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో దళితులపై ఇలానే చేశారు. ఇప్పుడు మహిళ అని కూడా చూడకుండా ఇలా చెయ్యడం పై కొందరు మండి పడుతున్నారు. ఘటనకు […]

Share:

మహిళలకు ఎక్కడా తగిన గౌరవం దక్కడం లేదు. బయట మాత్రమే కాదు. అటు పవిత్ర స్థలాలైన దేవాలయాల్లో కూడా మహిళలను అవమానిస్తున్నారు. తాజాగా ఓ మహిళను ప్రముఖ దేవాలయంలో దారుణంగా అవమానించాడు.ఈ ఘటన ఎక్కడో జరగలేదు. మనదేశంలోనే జరిగింది.పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో జరిగింది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో దళితులపై ఇలానే చేశారు. ఇప్పుడు మహిళ అని కూడా చూడకుండా ఇలా చెయ్యడం పై కొందరు మండి పడుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్ర సిక్కు మందిరం వద్ద ఉన్న ఒక గార్డుని “ఇది ఇండియా కాదా?” అని అడిగిన స్త్రీతో గోల్డెన్ టెంపుల్‌లో ఉన్న మరొక వ్యక్తి వచ్చి “ఇది ఇండియా కాదు, పంజాబ్” అని చెప్పడం చూడవచ్చు. మహిళ ఫోన్‌లో చిత్రీకరించిన క్లిప్‌లో ఇందుకు సంబంధించిన వీడియో ఉంది. “ఇది ఇండియా కాదా?” అని వారు పదేపదే గార్డును అడుగుతున్నట్లు. దానికి గార్డు అంగీకరించకుండా దూకుడుగా తల ఊపినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. గార్డు వింతగా మాట్లాడుతున్నాడని అంటున్న ఆ మహిళ ఫోన్‌ను ఆ గార్డు లాక్కోవడానికి ప్రయత్నించడంతో క్లిప్ ముగుస్తుంది. క్లిప్ ప్రారంభంలో ఆ స్త్రీ ఒక క్షణం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆడియోను వినవచ్చు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి ప్రవేశం నిరాకరించిన మహిళ ముఖంపై త్రివర్ణ పతాకాన్ని చిత్రీకరించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు యూజర్లు ఆగ్రహానికి గురయ్యారు.

ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రసారం అవుతున్న ఈ క్లిప్‌లో, ప్రసిద్ధ సిక్కు మందిరంలోకి ప్రవేశించడానికి అనుమతించని వ్యక్తిని, ఒక మహిళ మరియు ఒక పురుషుడు ఎదుర్కోవడం చూడవచ్చు. మహిళను గురుద్వారాలోకి ఎందుకు అనుమతించలేదని అడిగినప్పుడు, ఆ వ్యక్తి, “ఆమె ముఖంపై జెండా ఉంది” అని చెప్పాడు. అది ఇండియా జెండా అని ఆ మహిళ చెప్పినప్పుడు, ఆ గార్డు “ఇది పంజాబ్, ఇండియా కాదు” అని అన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారుల నుండి తీవ్ర ప్రతిస్పందనలను రేకెత్తించడంతో, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సిక్కుల పుణ్యక్షేత్రం. ప్రతి మత స్థలానికి ఒక ప్రత్యేక వస్త్రాలంకరణ ఉంటాయి. అందరికీ స్వాగతం పలుకుతాము. అధికారి తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణలు కోరుతున్నాము. ఆమె ముఖం మీద ఉన్న జెండాలో అశోకచక్రం లేదు. అందుకే అది మన జాతీయ జెండా కాదు. ఇది రాజకీయ జెండా అయి ఉండవచ్చు. వైరల్ వీడియో గురించి అడిగినప్పుడు SGPC ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ఈ విషయంపై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.