ప్రమాదంలో గోదావరి ప్రజలు

గోదావరి ఎంతో అందంగా ఉండే పరివాహక ప్రాంతం ఎంత అందంగా ఉంటుందంటే అక్కడి వ్యూ ని చూస్తే మనకు ఆకలి వేయదు నీరు తాగబుద్ది కాదు. ఇలా చెబితే కొంచెం ఓవర్ గా అనిపించినా కానీ అక్కడి వ్యూ ఇంచు మించు ఇలానే ఉంటుంది. ఇక అక్కడి భూములు మూడు పంటలు పండేందుకు ప్రసిద్ధిగాంచాయి. దీంతోనే అనేక మంది ప్రజలు గోదారోళ్లకేంటి వారు సంపన్నులు అని అంటారు. గోదారోళ్లలా పుట్టేందుకు పూర్వ జన్మల సుకృతం కూడా ఉండాలని […]

Share:

గోదావరి ఎంతో అందంగా ఉండే పరివాహక ప్రాంతం ఎంత అందంగా ఉంటుందంటే అక్కడి వ్యూ ని చూస్తే మనకు ఆకలి వేయదు నీరు తాగబుద్ది కాదు. ఇలా చెబితే కొంచెం ఓవర్ గా అనిపించినా కానీ అక్కడి వ్యూ ఇంచు మించు ఇలానే ఉంటుంది. ఇక అక్కడి భూములు మూడు పంటలు పండేందుకు ప్రసిద్ధిగాంచాయి. దీంతోనే అనేక మంది ప్రజలు గోదారోళ్లకేంటి వారు సంపన్నులు అని అంటారు. గోదారోళ్లలా పుట్టేందుకు పూర్వ జన్మల సుకృతం కూడా ఉండాలని చెబుతారు. ఇక గోదారోళ్ల మర్యాదలు చూస్తే వామ్మో అని అనిపించక మానదు. మనకంటే వ్యక్తి ఎంత చిన్న అని తెలిసినా కానీ వారు ఇచ్చే మర్యాదలు వేరే లెవెల్లో ఉంటాయి. ఇక బంధువులకు ఇచ్చే మర్యాదైతే మరో కోణంలో ఉంటుంది. అటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రమాదంలో ఉన్నారని ఒక నివేదిక బట్టబయలైంది. ఈ షాకింగ్ నివేదికను చూసి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అందరూ వామ్మో అని గుండెల మీద చేతులు వేసుకుంటున్నారు. 

షాకింగ్ నిజాలు

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ జియోఫిజిల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) మరియు అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఘజియా బాద్ లు నిర్వహించిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. ఈ విషయాలు ఆ రీసెర్చ్ సంస్థలు నివేదిక రూపంలో బయటకు తీసుకొచ్చాయి. ఈ జిల్లాల్లో ఉన్న నేలల్లో  భారీ లోహాలు విషపూరితంగా ఉన్నాయని ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఇక్కడ నివసించే ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ఆందోళనలను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తూర్పు గోదావరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న చమురు మరియు గ్యాస్ డ్రిల్లింగ్ సైట్ల వల్లే ఈ ప్రమాదం జరుగుతోందని ఆ నివేదిక బట్ట బయలు చేసింది. 

ఆ సైట్ ల చుట్టూ ఉన్నవారు భారీ ప్రమాదాన్ని పక్కనే ఉంచుకుని జీవిస్తున్నారని తెలియజేసింది. భూమిలో ఉన్న లోహాల వల్లే ఈ విధమైన ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. 

క్యాన్సర్ కు కారకాలు… 

ఈ లోహాల వల్ల భవిష్యత్ లో క్యాన్సర్ బారిన కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మట్టి మరియు డ్రిల్లింగ్ సమయంలో ఉత్పన్నం అయ్యే బ్యాక్ వాటర్ వల్ల అనేక ప్రమాదాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంత ప్రజలు ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వ్యవసాయానికి కూడా హానికారకాలుగా మారుతాయని ఆ నివేదిక వెల్లడించింది. 

పాపం అమాయక ప్రజలు

ఈ నివేదికతో ఒక్కసారిగా గోదావరి గ్రామాల ప్రజలు షాక్ కు లోనయ్యారు. కేవలం గోదావరి గ్రామాల ప్రజలు అనే కాకుండా ఆ గ్రామాలతో విడదీయరాని అనుబంధం ఉన్న వారు కూడా షాక్ కు లోనయ్యారు. ఇదేంటి చమురు వల్ల ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదో అప్పుడుప్పుడు గ్యాస్ లీక్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అనుకుంటే ఇంత పెద్ద ప్రమాదమా? అని ప్రశ్నిస్తున్నారు. తమను ఈ ప్రమాదం నుంచి రక్షించాలంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. 

మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు… 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నివేదికను లైట్ గా తీసుకుంటున్నట్లు పలువురు పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉంటే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. రెండు జిల్లాల ప్రజలు అంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు.