కాల్ బ్లాక్ చేసిందని, ఒంటిపై పోసుకున్న యువకుడు

ఒక యువకుడు తన ప్రియురాన్ని కలవటానికి కాన్పూర్ నుంచి బెరెల్లి వెళ్ళాడు. కానీ అక్కడ యువకుడికి ఆ అమ్మాయి మధ్య జరిగిన సంఘర్షణ తర్వాత ఆ అబ్బాయి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వస్తే, ఉత్తర ప్రదేశ్ లో నివసిస్తున్న ఒక యువకుడు తన ప్రియురాలిని కలవటానికి చాలా దూరం ప్రయాణించి కాన్పూర్ నుంచి బెరెల్లి చేరుకున్నాడు. కానీ వారి మధ్య ఎటువంటి సంఘర్షణ జరిగిందో తెలియదు గానీ ఆ అమ్మాయి గొడవ తర్వాత, […]

Share:

ఒక యువకుడు తన ప్రియురాన్ని కలవటానికి కాన్పూర్ నుంచి బెరెల్లి వెళ్ళాడు. కానీ అక్కడ యువకుడికి ఆ అమ్మాయి మధ్య జరిగిన సంఘర్షణ తర్వాత ఆ అబ్బాయి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వస్తే, ఉత్తర ప్రదేశ్ లో నివసిస్తున్న ఒక యువకుడు తన ప్రియురాలిని కలవటానికి చాలా దూరం ప్రయాణించి కాన్పూర్ నుంచి బెరెల్లి చేరుకున్నాడు. కానీ వారి మధ్య ఎటువంటి సంఘర్షణ జరిగిందో తెలియదు గానీ ఆ అమ్మాయి గొడవ తర్వాత, అబ్బాయి కాల్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి, కాలేజ్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ఎక్కి, అక్కడ తన మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. 

అసలు ఏం జరిగింది?: 

కాన్పూర్లో ఒకే లొకాలిటీలో నివసిస్తున్న ఆ అమ్మాయికి అబ్బాయికి తొమ్మిదో తరగతిలో ఉంటున్నప్పటినుంచి రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే యోగేష్ అనే యువకుడు ఇంటర్ పరీక్షలు అయిపోయిన తర్వాత చదువు మానేసి వాళ్ల కుటుంబంతోనే డైరీలో పనిచేయడం మొదలు పెడతాడు. వాళ్ల రిలేషన్ కొనసాగుతూ ఉండగా ఆ అమ్మాయికి, బెరెల్లిలోని ఫరీద్ పూర్ లో ఫార్మసీ కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది. అయితే మంగళవారం యోగేష్ కి తన ప్రియురాలికి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కారణంగా మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆ అబ్బాయి నుంచి ఎటువంటి కాల్స్ రాకుండా బ్లాక్ చేసింది. 

ఆ యువతితో మాట్లాడడానికి ప్రయత్నించిన యోగేష్ కు, ఆ యువతి తన కాల్స్ బ్లాక్ చేసినట్లు తెలిసింది. అందుకే కాన్పూర్ లో ఉన్న తన కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా కాన్పూర్ నుంచి ప్రయాణించి బెరెల్లిలో ఉన్న ఫరీద్ పూర్కి వెళ్ళాడు. మళ్లీ కాలేజీ దగ్గర ఏం జరిగిందో తెలీదు, ఆ అబ్బాయి, తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ తో , వెంటనే కాలేజ్ 4 అంతస్తుకు వెళ్లడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయిని బెదిరిస్తూ తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తర్వాత అతి కష్టం మీద కాలేజీ యాజమాన్యం అలాగే కొంతమంది స్టూడెంట్స్ సహాయంతో ఆ అబ్బాయిని మళ్లీ కిందకి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఆ అబ్బాయిని మందలించి కొట్టి పోలీసులకు అప్పగించారు. 

ఇలాంటివి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి: 

‘ప్రేమించడం తప్పు కాదు కానీ, ప్రేమించిన వారిని చంపడం, ప్రేమ దక్కలేదని చచ్చిపోవడం క్షమించరాని పెద్ద నేరం’ అంటూ ఒక పాటలో రాసిన మాటలు అక్షరాల నిజం. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ అంటూ పక్కదారి పట్టడం, తెలిసి తెలియని వయసులో ఇంకా ఊహరాని వయసులో ప్రేమించడం చాలా తప్పు. అంతే కాకుండా, చిన్న వయసులో ప్రేమ దక్కలేదు అంటూ వెర్రితనంతో ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళని కూడా చంపుతున్నారు. ఫలితంగా బాధపడేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ప్రస్తుతం ఉన్న యువత తమ కలల మీద దృష్టి పెట్టాలి. వారు అనుకున్నది సాధించాలి అనే పట్టుదల మీద దృష్టి పెట్టాలి. తమ తల్లిదండ్రులు తమ పిల్లలి కోసం ఎన్నో కలలు కంటూ ఉంటే,యువత ఇలాంటి తెలిసి తెలియని పొరపాట్లు చేస్తూ, ఆత్మహత్యలు చేసుకోవడం, చంపడాలు చేసి జైలుకెళ్లడం వల్ల, పూర్తి కుటుంబ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి యువత మేలుకోండి.