మైన‌ర్‌పై మ్యూజిక్ టీచ‌ర్ లైంగిక దాడి

మైనర్‌  ఆరోపణలపై మ్యూజిక్ టీచ‌ర్ అరెస్ట్ చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ బాలికను ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం పంపించారు.  బాలికకు, సంగీత టీచర్కి సంబంధించిన బట్టలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఈ ఘటనపై విచారణకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని బెగుసరాయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ […]

Share:

మైనర్‌  ఆరోపణలపై మ్యూజిక్ టీచ‌ర్ అరెస్ట్ చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ బాలికను ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం పంపించారు. 

బాలికకు, సంగీత టీచర్కి సంబంధించిన బట్టలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఈ ఘటనపై విచారణకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని బెగుసరాయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) యోగేంద్ర కుమార్ తెలిపారు. నిందితులను రామ్‌ జతన్‌ పాశ్వాన్‌, దిలీప్‌ పండిట్‌, రవీంద్ర ఠాకూర్‌గా గుర్తించారు. వీరంతా బెగుసరాయ్‌ జిల్లా పత్‌కౌల్‌ గ్రామానికి చెందినవారు. నిందితులుగా పేర్కొన్న ముగ్గురిలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. 

బీహార్‌లో వేధింపులకు గురైన మరో చిన్నారి. ఫిర్యాదులో మైనర్ బాలికపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, ఈ సంఘటన గురువారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పాట్నాలోని బీహార్‌లో ఉన్న ఒక బాలికపై సంగీతం టీచర్ అప్పటికే అత్యాచార ప్రయత్నంలో ఉన్నాడు. అయితే స్టూడెంట్ అలాగే టీచర్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని పట్టుకుని, తర్వాత మూడో వ్యక్తి ఒక అమ్మాయి బట్టలు విప్పి కొట్టారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో ముగ్గురు వ్యక్తులు మైనర్ బాలిక బట్టలు విప్పి దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ ముగ్గురి కాకుండా వీడియో లో మరో వ్యక్తి సంగీత టీచర్గా గుర్తించారు. అంతేకాకుండా అతని వయస్సు 40 ఏళ్ళు ఉండచ్చని పోలీసులు తెలిపారు. 

సంఘటన వివరాలు: 

బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంగీత టీచర్ని అరెస్టు చేసామని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, సమాచార సాంకేతిక (ఐటి) సెక్షన్ 67 బి సెక్షన్ 67 బి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అంతేకాకుండా, (ఐటి) సెక్షన్ 37 కింద కేసు నమోదు అయినట్లు, పోలీసు యోగేంద్ర కుమార్ తెలిపారు. 16 ఏళ్ల బాలిక అలాగే సంగీతం టీచర్ ఒక రూమ్ లో ఉన్నారు. అంతేకాకుండా, ఆ సంగీతం టీచర్ బాలిక‌తో స‌న్నిహితంగా ఉన్నాడు.. ఇదే సందర్భంలో కొంతమంది స్థానికులు ఆ ఇద్దరు ఉన్న రూంలోకి చొరబడి,  ఇద్ద‌రి చేత దుస్తులు విప్పించి చిత‌క‌బాదారు. పైగా నేరం చేసిన నిందితులు మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ కూడా చేశారు. 

అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి: 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో అత్యాచారాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ చట్టాన్ని తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట ఒక అమ్మాయి బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. సహాయం చేస్తూ మరోపక్క వంచించాలనే దారుణానికి పాల్పడిన వ్యక్తికి ఎట్టకేలకు శిక్ష పడింది. కానీ ఇలా ఎన్నో చోట్ల చోటు చేసుకుంటుంది. కొన్ని సంఘటనలు బయటికి వస్తున్నాయి మరెన్నో సంఘటనలు కనుమరుగైపోతున్నాయి. అన్ని చూస్తుంటే అసలు భారతదేశం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి.