జోద్పూర్ లో మైనర్ బాలిక అత్యాచారం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం నాడు మైనర్ దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు ఆమె బాయ్ ఫ్రెండ్ ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు ఆమె బాయ్ ఫ్రెండ్పై దాడి చేసిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు.  జరిగిన కథ:  బాలిక మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ శనివారం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, రాత్రి 10:30 గంటలకు బస్సులో జోధ్‌పూర్ చేరుకున్నారు. రూమ్ తీసుకోవడానికి వారు గెస్ట్ హౌస్‌కు వెళ్లారని, […]

Share:

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం నాడు మైనర్ దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు ఆమె బాయ్ ఫ్రెండ్ ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేయడానికి ముందు ఆమె బాయ్ ఫ్రెండ్పై దాడి చేసిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. 

జరిగిన కథ: 

బాలిక మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ శనివారం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, రాత్రి 10:30 గంటలకు బస్సులో జోధ్‌పూర్ చేరుకున్నారు. రూమ్ తీసుకోవడానికి వారు గెస్ట్ హౌస్‌కు వెళ్లారని, అయితే కేర్‌టేకర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు వెళ్లిపోయారని సీనియర్ పోలీసు అధికారి అమృత దుహాన్ తెలిపారు.

అయితే బాలిక ఇంకా తన బాయ్ ఫ్రెండ్ గెస్ట్ హౌస్ బయటే ఏం చేయాలో అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా, ముగ్గురు నిందితులు, సమందర్ సింగ్, ధరంపాల్ సింగ్ మరియు భాతమ్ సింగ్, వారి దగ్గరకు వచ్చి, వాళ్లని ఏదో విధంగా మచ్చిక చేసుకోవడానికి, వాళ్లకి తినడానికి కాస్త ఆహారాన్ని ఇచ్చి, అంతే కాకుండా గది తప్పకుండా దొరుకుతుంది అని వాళ్ళని నమ్మాలి అని చెప్పి, నమ్మించినట్లు విచారణలో తేలింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జేఎన్‌వీయూ పాత క్యాంపస్‌లోని హాకీ గ్రౌండ్‌ దగ్గరలో రైల్వే స్టేషన్‌కు తీసుకువెళతామని చెప్పి ఇద్దరినీ మోసగించారు నిందితులు.

గ్రౌండ్ కి చేరుకున్న తర్వాత, ముగ్గురు విద్యార్థులు, బాలిక బాయ్ ఫ్రెండ్పై దాడి చేసి, మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అక్కడి నుండి పారిపోయారని పోలీసులు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ క్యాంపస్‌లోకి రావడంతో ముగ్గురు హడావిడిగా అక్కడి నుంచి పారిపోతున్నట్లు కనిపించారు. అయితే బాలిక బాయ్ ఫ్రెండ్ వెంటనే అక్కడికి వచ్చిన వారి నుండి సహాయం కోరాడు, అప్పుడు అతను పోలీసులకు ఫోన్ ద్వారా జరిగింది చెప్పడం జరిగింది.

అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు, డాగ్ స్క్వాడ్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాన్ని మోహరించారు మరియు సిసిటివి ఫుటేజీ సహాయంతో జోధ్‌పూర్‌లోని గణేష్‌పురాలోని ఒక ఇంట్లో ముగ్గురిని ట్రాక్ చేశారు. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారు పడిపోయి గాయపడ్డారు. అందుకే వారిలో ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయని, మూడో వ్యక్తి చేతికి గాయమైందని ఎమ్మెల్యే దుహాన్ తెలిపారు. అయితే మొత్తానికి ముగ్గురు నిందితుల్ని పట్టుకోవడానికి కేవలం మూడు గంటల సమయం పట్టిందని. ఆ బాలికకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తాము అని ఎమ్మెల్యే దుహన్ చెప్పారు.

బాలికపై వేధింపులకు పాల్పడిన గెస్ట్ హౌస్ కేర్‌టేకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లైంగిక నేరాల, బాలల రక్షణ చట్టంతోపాటు షెడ్యూల్డ్ కులాల రక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

 స్పందించిన ముఖ్యమంత్రి: 

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారా బాధితురాలికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.