కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన కార్లు

నాగాలాండ్ లో ఈరోజు సాయంత్రం కొండ చరియలు విరిగి కార్ మీద పడి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చుమోకెడిక్ జిల్లాలో దిమాపూర్, కోహిమా మార్గంలో నేషనల్ హైవే29లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియ రాలేదు.  అందర్నీ షాక్ కి గురిచేసి సంఘటన: కొండ చరియలు కార్ మీద పడడం ఇదంతా ఒక కార్ డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయింది.  చనిపోయిన వాళ్లలో […]

Share:

నాగాలాండ్ లో ఈరోజు సాయంత్రం కొండ చరియలు విరిగి కార్ మీద పడి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చుమోకెడిక్ జిల్లాలో దిమాపూర్, కోహిమా మార్గంలో నేషనల్ హైవే29లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియ రాలేదు. 

అందర్నీ షాక్ కి గురిచేసి సంఘటన:

కొండ చరియలు కార్ మీద పడడం ఇదంతా ఒక కార్ డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయింది. 

చనిపోయిన వాళ్లలో ఒకరు స్పాట్ లో చనిపోగా, ఇంకొకరు హాస్పిటల్లో చనిపోయారు. కారులో ఇంకొక పర్సన్ ఇంకా ఇరుక్కునే ఉన్నాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ యాక్సిడెంట్ పాకాల పహర్ అనే ప్లేస్ లో జరిగింది. చీఫ్ మినిస్టర్ చనిపోయిన వాళ్లకు తన సానుభూతి తెలియజేశాడు. ఈరోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, ముగ్గురికి గాయాలు అయ్యాయి అందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశాడు. నాలుగు లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలియజేశాడు. స్టేట్ గవర్నమెంట్ వెంటనే ఇలాంటి ప్లేస్ లలో అన్నింటిని మార్చేస్తామని తెలియజేసింది. ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. 

వానాకాలంలో కొండ చరియల వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి? 

కొండ చరియలు విరిగిపడడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రమాదం అంచున ఉన్న ప్రదేశాలలో ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం అనేది జరగకుండా చేయాల్సిన చర్యలు అన్నీ చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ లు వర్షాకాలంలో ఆ ప్రదేశాలలో ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి. ప్రాణ నష్టం జరగకుండా ఏం ఏం చేయాలో అన్ని చేయాలి. కొండ చరియల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చేసినట్లయితే ప్రమాదాలు తగ్గుతాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం కొండ చరియలు విరిగిపడి చాలామంది ప్రమాదాల పాలవుతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది గాయాల పాలవుతున్నారు. నాగాలాండ్ లో జరిగిన ఈ ఘటనను చూసి అన్ని రాష్ట్రాలు మేల్కొనాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని ఎదురవుతాయి. ప్రతి రాష్ట్రంలో కొండ చరియల వల్ల జరిగే ప్రమాదాలను ముందుగానే గమనించి తగు నివారణ చర్యలు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడతాయి. దీనివల్ల గవర్నమెంట్ అంటే ప్రజలకు నమ్మకం వస్తుంది. మంచి ప్రభుత్వం కచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుందనే నమ్మకం వస్తుంది. చనిపోయాక నష్టపరిహారం ఇచ్చేకన్నా ప్రాణాలు కాపాడితే బాగుంటుంది. 

ప్రభుత్వం వర్షాకాలం రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వర్షాలు వస్తున్న టైం లో బయటకు వెళ్లకపోవడమే బెటర్. 

మరీ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రమాదానికి దూరంగా ఉంటారు. ప్రభుత్వాలు, ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఆశిద్దాం. 

నాగాలాండ్, కార్, చీఫ్ మినిస్టర్, ట్విట్టర్, రెయినీ సీజన్.