ఆజాద్ ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.. 16 మంది ఎమ్మెల్యేలతో ముఫ్తీ సీఎం ఎలా అయ్యారో వివరణ..

ఇందిరా గాంధీతో వ్యూహం రచించడం నుంచి రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం, పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీని ఒప్పించడం వరకు, రాహుల్ గాంధీ, హిమంత బిస్వా శర్మ మధ్య పోరులో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, కాంగ్రెస్‌‌లో గులాం నబీ ఆజాద్ పాత్ర ఎంతో ఉంది. ఆయన ట్రబుల్ షూటర్ నుంచి పార్టీలో ఇబ్బందుల్లో పడేదాక.. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చేసి  పార్టీని విడిచిపెట్టారు.  ఆజాద్ తన  సుదీర్ఘమైన ఇండియన్​ పాలిటిక్స్‌‌ యాత్రలో గత 5 దశాబ్దాలుగా  పరివర్తన […]

Share:

ఇందిరా గాంధీతో వ్యూహం రచించడం నుంచి రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం, పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీని ఒప్పించడం వరకు, రాహుల్ గాంధీ, హిమంత బిస్వా శర్మ మధ్య పోరులో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, కాంగ్రెస్‌‌లో గులాం నబీ ఆజాద్ పాత్ర ఎంతో ఉంది. ఆయన ట్రబుల్ షూటర్ నుంచి పార్టీలో ఇబ్బందుల్లో పడేదాక.. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చేసి  పార్టీని విడిచిపెట్టారు.  ఆజాద్ తన  సుదీర్ఘమైన ఇండియన్​ పాలిటిక్స్‌‌ యాత్రలో గత 5 దశాబ్దాలుగా  పరివర్తన చెందిన రాజకీయ నాయకుడి పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐసీసీ ఇన్‌‌ ఛార్జ్‌‌‌గా ఆజాద్‌‌కు హైదరాబాద్, తెలంగాణ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌‌‌తోనూ సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ అనుభవాల సారాంశాన్ని ఆయన ఆత్మకథగా మలచి ఆజాద్ యాన్ ఆటోబయోగ్రఫీ  పుస్తకాన్ని రచించారు.. ఈ పుస్తకాన్ని  మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కరణ్ సింగ్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్ మోహన్‌తో ఫరూక్ అబ్దుల్లాకు ఉన్న సంబంధాలు, ప్రధాని నరేంద్ర మోడీతో అతని సంబంధాల గురించి కూడా ఆజాద్ ఈ పుస్తకంలో రాశారు.. 

2002లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అధిష్టాన్ని పిడిపి నేత ముఫ్తీ  మహమ్మద్ సయ్యద్ 2002లో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా అధిష్టానం దోచుకున్నారని.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవిని చేజెక్కించుకోవలసి ఉండగా ముఫ్తీ ఆ స్థానాన్ని ఎలా కైవసం చేసుకున్నారో కూడా వివరించారు. 

87 మంది ఉన్న సభలో 42 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని.. ఇక ఖచ్చితంగా తనే ముఖ్యమంత్రి అవుతానని ఆయన ఆత్మ కథలో రాసుకున్నారు. కాగా ప్రభుత్వంలో చేరడానికి నేను సిద్దంగా ఉండగా.. పిడిపిని ఆహ్వానించడానికి మారిన పరిస్థితులు చాలా రాజకీయంగా ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ 20 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగా.. పిడిపికి 16 మంది , నేషనల్ కాన్ఫరెన్స్ 20 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేయడానికి నిరాకరించింది. సిపిఐ ఒక బీఎస్సీ కి చెందిన ఇద్దరూ మినహా 15 మంది స్వతంత్రులు నలుగురు పాంధర్స్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు ఆజాద్ తెలిపారు. 42 మంది ఎమ్మెల్యేతో నేను ఉండగా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఇద్దరు మహిళా సభ్యులను ఓటింగ్ హక్కులతో నామినేట్ చేయవచ్చని నిబంధన ఉందని అది నేను మర్చిపోయానని.. ఆజాద్‌కి మెజారిటీ‌కి రాకుండా ఉండేందుకు వాళ్ళు పిడిపి పార్టీలోకి వెళ్లిపోయారని దాంతో వాళ్ళు 44 స్థానానికి చేరుకున్నారని తెలిపారు..

ఆలోగా నేను గవర్నర్‌కు ఫోన్ చేశాను ప్రమాణ స్వీకార తేదీ గురించి కూడా మాట్లాడాను.. మరుసటి రోజు నన్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించారు కూడా. గవర్నర్‌తో సమావేశానికి కొన్ని గంటల ముందు ఉదయం 8 గంటలకు నేను శ్రీనగర్‌లోని ‘హోటల్ బ్రాడ్ వే’ లో నా గది బాల్కనీలో అశోక్ భాన్ స్నేహితుడు,  మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదితో టీ తాగుతున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది ముఫ్తీ పార్టీని ప్రభుత్వంలో చేరమని అడగాలని భాన్‌కి చెప్పాను. 

కానీ అనుకోని పరిస్థితుల్లో మూడు సంవత్సరాల పాటు నేను సీఎంగా.. మరో మూడు సంవత్సరాల పాటు సీఎంగా ముఫ్తి ఉండేలాగా ఓ ఏర్పాటు చేయమని సోనియా గాంధీని అభ్యర్థించానని ఆయన ఆత్మ కథా పుస్తకంలో రాసుకొచ్చారు.