అద్భుతం చేసిన జర్మన్ ఆర్టిస్ట్ 

ఓ జర్మన్ ఆర్టిస్ట్ అద్భుతం చేశాడు. అది కూడా ఇండియాలో అతడు అద్భుతం చేయడంతో ఘటన వైరల్ అవుతోంది. అతడు లడఖ్ లో జరిగిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఈ అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అతడు చేసిన ఈ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఇంత కళాఖండాన్ని ఎలా క్రియేట్ చేశాడో మీడియాకు వివరించాడు. అందుకోసమే అతడిని అంతా మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.  ఏం జరిగిందంటే..  సా లడఖ్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలో.. […]

Share:

ఓ జర్మన్ ఆర్టిస్ట్ అద్భుతం చేశాడు. అది కూడా ఇండియాలో అతడు అద్భుతం చేయడంతో ఘటన వైరల్ అవుతోంది. అతడు లడఖ్ లో జరిగిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఈ అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అతడు చేసిన ఈ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఇంత కళాఖండాన్ని ఎలా క్రియేట్ చేశాడో మీడియాకు వివరించాడు. అందుకోసమే అతడిని అంతా మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

ఏం జరిగిందంటే.. 

సా లడఖ్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలో.. ప్రఖ్యాత జర్మన్ ఆర్టిస్ట్ ఫిలిప్ ఫ్రాంక్ అనే వ్యక్తి సహజ ఉపరితలంపై కాంతి ప్రొజెక్షన్ సమయంలో ఆధ్యాత్మికత ను ఉట్టిపడేలా చేసింది. ఈ ఎగ్జిబిషన్ ఆసియాలో బిగెస్ట్ ఎగ్జిబిషన్ గా పేరు గాంచింది. అతడు చేసిన ఈ ఆర్ట్ అనేది ఆధ్యాత్మికత మరియు సహజ ప్రపంచం కలిసి రావడానికి సాక్ష్యమివ్వనుంది. అతడు నీటి నేపథ్యంతో ఒక ప్రదర్శనను రూపొందించాడు. ఈ కళాఖండాన్ని రూపొందించేందుకు కాంతిని మాధ్యమంగా ఎలా ఉపయోగించాడో ఆయన మీడియాతో పంచుకున్నాడు. 

అలానే చేశాను.. 

ఇంతటి ఘనతను ఎలా సాధించాడో  ఫ్రాంక్ మీడియాకు వివరించాడు. కాంతి మరియు నీడలకు పూర్తి విరుద్ధంగా అతడు ట్రిక్స్ ప్లే చేసే కళాఖండాలను సృష్టించాడు. అంతే కాకుండా కాంతి శిల్పాలను రూపొందించడానికి ప్రొజెక్షన్ మ్యాపింగ్ కూడా చేశాడు. అతడు మాట్లాడుతూ.. నేను 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కళను సృష్టించడం ప్రారంభించానని తెలిపాడు. నేను గ్యారేజీ నుంచి కొన్ని స్ప్రే డబ్బాలను తీసుకొని మొదట గ్రాఫిటీ వేయడం నేర్చుకున్నానని, వాటి నుంచి విజయవంతమైన స్ట్రీట్ ఆర్ట్ కెరియర్ ను కూడా ఎలా ప్రారంభించాడో తెలిపాడు. తాను మ్యూనిచ్‌లో పెరిగానన్నాడు. ఫ్రాంక్ చిన్న చిన్న చిత్రాలతో కెరియర్ ను స్టార్ట్ చేశాడట. ఆ తర్వాత వివిధ సహజ ఉపరితలాలపై కాంతిని ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఇంకా అతడు మాట్లాడుతూ… నేను ప్రకృతితో ఎక్కువ సమయం గడిపానని, తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం ప్రకృతే అని అన్నాడు. తాను మ్యూనిచ్‌లోని ఒక చిన్న గ్రామంలో పెరిగానని చెప్పుకొచ్చాడు. తాను చిన్న చిత్రాలతో ప్రారంభించి ప్రొజెక్షన్ మ్యాపింగ్ మరియు నమూనాకు వెళ్లానని తెలిపాడు. తాను ప్రకృతి నుంచి కళాత్మకంగా గ్రహించిన మరియు స్వీకరించే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తానని తెలిపాడు. 

ఆగస్టు 1 నే ప్రారంభం

ఆగస్టు 1న ప్రారంభమైన సా లడఖ్ ఎగ్జిబిషన్ రీసెంట్ గా క్లోజ్ అయింది.  ఇది వాతావరణం, సంస్కృతి మరియు సమాజంపై దృష్టి సారిస్తుంది. మన అమూల్యమైన సహజ వనరులను సంరక్షించడానికి మరియు ప్రకృతి పట్ల ప్రగాఢమైన ప్రశంసలను ప్రేరేపించడానికి కీలకమైన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కళాకారులు తమ కళాకృతుల యొక్క పరివర్తన సామర్థ్యాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నారు. వారు తమ కళాఖండాల ద్వారా చెప్పదలచుకున్న విషయాలను ప్రొజెక్ట్ చేశారు. అందుకోసం ఈ ఎగ్జిబిషన్ ను ఉపయోగించుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను చూసిన తర్వాత కూడా మనం మారకపోతే ఇందులో ఎటువంటి సందేశం ఉండదు. అందుకోసమే మనం తప్పనిసరిగా ఈ విషయాలను చూసైనా మారాలి. లేకపోతే ఆర్టిస్టుల కష్టానికి ప్రతిఫలం ఉండదు.

వారే స్టార్ట్ చేశారు… 

2023లో టెన్జింగ్ ‘జమ్మీ’ జమ్యాంగ్, రాకీ నికాహెటియా మరియు సాగదీప్ సింగ్‌ అనే వ్యక్తులు కలిసి ఈ ఎగ్జిబిషన్ ను స్టార్ట్ చేశారు. ఇది 3600 మీటర్ల ఎత్తులో దక్షిణాసియాలోని అత్యున్నత సమకాలీన ప్రాంతంలో స్టార్ట్ చేశారు. అందుకోసమే ఈ ఎగ్జిబిషన్అందరి దృష్టిని ఆకర్షించింది.