కొడుకు సమాధి పక్కనే అతీక్, అష్రఫ్‌ల ఖననం

గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిసాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్ రాజ్‌లోని కసారీ మసారి స్మశాన వాటికలో ఇద్దరి ఖననం చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అతిక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్ రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసులు, ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించి కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే స్మశాన వాటికలో […]

Share:

గ్యాంగ్ స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిసాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్ రాజ్‌లోని కసారీ మసారి స్మశాన వాటికలో ఇద్దరి ఖననం చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అతిక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్ రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసులు, ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించి కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే స్మశాన వాటికలో అతి కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతిక్ తల్లిదండ్రుల సమాధులు కూడా ఇదే స్మశాన వాటికలో ఉన్నాయి.

శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన అతిక్ అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరుపై తుపాకులతో దాడి చేసి, పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపారు. దుండగులు రిపోర్టర్ల ముసుగులో వచ్చి క్షణాల్లో కాల్పులు జరిపి వెళ్లిపోయారు. అక్కడున్న వారంతా హతాసులయ్యారు. అది కుమారుడు అహ్మద్ 48 గంటల ముందే ఎన్‌కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. అతిక్ భార్య పరారీలో ఉండటంతో ఆమె కూడా తన కొడుకు హత్యక్రియలకు హాజరు కాలేదు. 

అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా పేరు ప్రఖ్యాతల కోసమే తాము అతిక్‌ని, అతని సోదరుడిని అందరి ముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. వీరు ఏమీ పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో వీళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారు. అతీక్ 44 ఏళ్లుగా నిర్మించిన నేర  సామ్రాజ్యాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత 48 రోజుల్లోనే కూకటి వేళ్ళతో సహా పెకిలించింది. అతీక్‌తో పాటు అతడి ఇద్దరు కుమారులు జైల్లో ఉండగా, మూడో కొడుకు అసద్ బుధవారం ఝాన్సీలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఇద్దరు మైనర్ కుమారులు జువైనల్ హోమ్‌లో ఉండగా అతని భార్య పైష్టా పర్వీన్ పరారీలో ఉంది. అసద్ అహ్మద్‌తో పాటు ఝాన్సీ ఎన్‌కౌంటర్‌లో అతనితో పాటు హతమైన గుల్హం భౌతిక కాయాన్ని శనివారం ప్రయాగ్‌రాజ్‌లో ఖననం చేశారు.

 2005 జనవరి 5న ప్రయాగ్‌రాజ్ బిఎస్పి ఎమ్మెల్యే రాజుపాల్ అతని అనుచరులపై దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న లాయర్ ఉమేష్‌పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే హత్యకు గుయారయ్యారు. అతీక్, అతడి భార్య పర్వీన్, అతడి కొడుకు అసద్ తదితరులు ఈ హత్య చేశారని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే పొలిటీషియన్ కం గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యం కుప్పకూలింది.