గంగా పుష్కరాలు 2023: విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ ఇదిగో

నదీ పుష్కరాలలో గంగానదికి కాశీ, యమునానదికి ప్రయాగరాజ్, గోదావరికి రాజమంహేంద్రవరం, కృష్ణానదికి విజయవాడ ప్రసిద్ధి గాంచాయి. గంగానది పరీవాహక ప్రాంతంల్లో గంగా పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా గంగోత్రి, దేవప్రయాగ, ప్రయాగ రాజ్, గంగాసాగర్ , ఋషీకేశ్, హరిద్వార్, గర్హ్ ముక్తేశ్వర్, వారణాశిల్లో గంగా పుష్కరాలు జరిగినా.. చాలా మంది కాశీకి వెళ్ళడానికే ఆసక్తిని చూపిస్తారు. ఈ క్షేత్రంలో  త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారని భక్తుల నమ్మకం. వారణాశిని చేరుకోవడానికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి విమాన, […]

Share:

నదీ పుష్కరాలలో గంగానదికి కాశీ, యమునానదికి ప్రయాగరాజ్, గోదావరికి రాజమంహేంద్రవరం, కృష్ణానదికి విజయవాడ ప్రసిద్ధి గాంచాయి. గంగానది పరీవాహక ప్రాంతంల్లో గంగా పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా గంగోత్రి, దేవప్రయాగ, ప్రయాగ రాజ్, గంగాసాగర్ , ఋషీకేశ్, హరిద్వార్, గర్హ్ ముక్తేశ్వర్, వారణాశిల్లో గంగా పుష్కరాలు జరిగినా.. చాలా మంది కాశీకి వెళ్ళడానికే ఆసక్తిని చూపిస్తారు. ఈ క్షేత్రంలో  త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారని భక్తుల నమ్మకం. వారణాశిని చేరుకోవడానికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. మీరు విశాఖ వాసులు అయ్యుండి.. వారణాశి వెళ్లాలనుకుంటున్నారా.? అయితే .. విశాఖపట్నం నుంచి గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల గంగా పుష్కరాలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక  రైళ్ల టైమింగ్స్ తెలుసుకోండి.

ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు లక్షల సంఖ్యలో హాజరవుతారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక ట్రైన్స్ ప్రకటించింది. 

రైలు నెంబర్ 08588 విశాఖపట్నం నుంచి బనారస్ వరకు 2023 ఏప్రిల్ 19 నుంచి మే 17 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి గురువారం సాయంత్రం 4.30 గంటలకు బనారస్‌కు వెళ్తుంది.

 రైలు నెంబర్ 08587 బనారస్ నుంచి విశాఖపట్నం వరకు 2023 ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ గురువారం సాయంత్రం 6 గంటలకు బనారస్‌లో బయల్దేరి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం, బనారస్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, సింగాపూర్ రోడ్, మునిగూడ, కేసింగ, తిత్లాగఢ్, బాలంగిర్, బార్‌గఢ్ రోడ్, సంబాల్‌పూర్, జంక్షన్, దేహ్రీ, సాసారం, భభువా రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ, ఝర్సుగూడ, రౌర్కెల, హతియా, రాంచీ, మురి, బార్కకన, లేథర్, దాల్తోన్‌గంజ్, గార్వారోడ్, న్యూ వెస్ట్ క్యాబిన్, వారణాసి, బనారస్‌లలో ఆగుతాయి. 

గంగా పుష్కరాల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వారణాసి వెళ్లే భక్తులకు కాటేజీలు అందుబాటులో లేకపోతే టెంట్ సిటీలో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. గంగానది తీరంలో 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీని కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ విశ్వేశ్వరుడిని చూసేందుకు వచ్చే భక్తుల రోజు రోజుకి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత  భారీగా తరలివచ్చినా భక్తులకు వసతికి ఇబ్బంది లేకుండా టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. దాంతో కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్‌లో బస చెయ్యచ్చు. 

గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో నిర్మించిన టెంట్ సిటీలో ఒకే సారి 200 మందికి వసతి అందుబాటులో ఉంటుంది. గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలుగా ఉన్నాయి.  ఈ విల్లాలో 900 చదరపు అడుగులు, కాశీ సూట్స్‌లో 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్‌లో 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్‌లో 250 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వసతి ఉంటుంది. ఇందులో చిన్న ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ వంటి వసతులు ఉన్నాయి. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే 12 వేల నుంచి 14వేలు చెల్లించాలి. స్విస్ కాటేజీల్లో ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, గేమింగ్ జోన్, రెస్టారెంట్లు, డైనింగ్ ఏరియా, కాన్ఫరెన్స్ సదుపాయాలు, స్పా, యోగా స్టూడియోలాంటి సౌకర్యాలు ఉన్నాయి