G20 సదస్సులో ముఖ్యమైన అంశాల గురించి మొదలైన చర్చ

సెప్టెంబర్ 9, 2023 శనివారం, జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మరియు ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఇతర అగ్ర నాయకులు ప్రపంచ సవాళ్లకు సంబంధించి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీటిపైన ప్రత్యేకమైన దృష్టి:  మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న భారత దేశంలో జరుగుతున్న G20 సదస్సులో, వాతావరణ పరివర్తన కోసం ఫైనాన్సింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి అభివృద్ధి లక్ష్యాల మీదగా వేగవంతమైన అమలు, […]

Share:

సెప్టెంబర్ 9, 2023 శనివారం, జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మరియు ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఇతర అగ్ర నాయకులు ప్రపంచ సవాళ్లకు సంబంధించి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

వీటిపైన ప్రత్యేకమైన దృష్టి: 

మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న భారత దేశంలో జరుగుతున్న G20 సదస్సులో, వాతావరణ పరివర్తన కోసం ఫైనాన్సింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి అభివృద్ధి లక్ష్యాల మీదగా వేగవంతమైన అమలు, క్రిప్టోకరెన్సీ కోసం ఫ్రేమ్‌వర్క్ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సంస్కరణలకు సంబంధించిన ఫైనాన్సింగ్ రంగాలలో భారతదేశం ప్రత్యక్ష ఫలితాలను చూపించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ గ్లోబల్ సౌత్ మరియు వర్ధమాన దేశాల ఏకాభిప్రాయాన్ని మరొకసారి గుర్తు చేస్తుందని భారత జి20 షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం అన్నారు. G20 సమ్మిట్ ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలు అంతర్జాతీయ రుణ నిర్మాణాన్ని పునర్నిర్మించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు అందించడం మరియు క్రిప్టోకరెన్సీ మరియు కృత్రిమ మేధస్సు కోసం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం.

సదస్సుకు హాజరైన ప్రతినిధులు: 

భారత G20 ప్రెసిడెన్సీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోని, దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్, ఇన్సియో లులా డా సిల్వా ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు ఈ సదస్సుకు హాజరు కాలేదు

దేశ రాజధాని నడిబొడ్డున భారత్ మండపంలో జరుగుతున్న రెండు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆఫ్రికన్ యూనియన్ వంటి అనేక ప్రముఖ ప్రపంచ సంస్థల చీఫ్‌లు కూడా హాజరయ్యారు

ఉక్రెయిన్ విషయం మీద ఏకాభిప్రాయం: 

ఉక్రెయిన్ వివాదంతో పాటు వాతావరణ మార్పులతో సహా కొన్ని ఇతర ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం సాధించడంలో చైనా ప్రధాన అడ్డంకిగా మారిందని బహుళ వర్గాలు శుక్రవారం రాత్రి PTIకి తెలిపాయి. ఉక్రెయిన్ సమస్యపై రష్యా పూర్తిగా ఒంటరిగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. G20 ఏకాభిప్రాయ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. అయితే ఇంతకుముందు బాలి డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ వివాదంపై రెండు పేరాలకు రష్యా మరియు చైనాలు అంగీకరించినప్పటికీ, మళ్లీ ఈ సంవత్సరంలో ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గారు, నిజానికి ఈ విషయం భారతదేశానికి ఇబ్బందులు సృష్టించింది.

G20 సభ్య దేశాలతో పాటు, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా మరియు నెదర్లాండ్స్ నాయకులు భారత్ సమావేశానికి అతిథులుగా విచ్చేయడం జరిగింది. డిసెంబరు 1న కూటమి అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశం తన ప్రధాన రంగాల పరిధిలో దేశవ్యాప్తంగా G20కి సంబంధించి దాదాపు 200 సమావేశాలను నిర్వహించింది.

G20 సభ్య దేశాలు ప్రపంచ GDPలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. ఈ సమూహంలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూనియన్ (EU), UK, US మరియు యూరోపియన్ దేశాలు ఉన్నాయి.