మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ మొద‌లైన హింస‌

మణిపూర్ లో అంతకంతకు రెచ్చిపోతున్న హింసకాండలు. ఇటీవల జరిగిన మరో ఘటనలో, తండ్రి కొడుకులు మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిద్ర పోతూ ఉండగా సురత్చంద్రపూర్ అనే ఊరు నుంచి వచ్చిన కొంతమంది దుండగులు, విష్ణుపూర్ గ్రామంలో ఒక ఇంట్లో నిద్రపోతున్న తండ్రి కొడుకులను మరో ముగ్గురు వ్యక్తులను దారుణంగా తుపాకీలతో కాల్చి అదేవిధంగా కత్తులతో నరికి చంపిన వైనం మరోసారి మణిపూర్ హింసను గుర్తు చేస్తోంది.  ఆగని […]

Share:

మణిపూర్ లో అంతకంతకు రెచ్చిపోతున్న హింసకాండలు. ఇటీవల జరిగిన మరో ఘటనలో, తండ్రి కొడుకులు మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిద్ర పోతూ ఉండగా సురత్చంద్రపూర్ అనే ఊరు నుంచి వచ్చిన కొంతమంది దుండగులు, విష్ణుపూర్ గ్రామంలో ఒక ఇంట్లో నిద్రపోతున్న తండ్రి కొడుకులను మరో ముగ్గురు వ్యక్తులను దారుణంగా తుపాకీలతో కాల్చి అదేవిధంగా కత్తులతో నరికి చంపిన వైనం మరోసారి మణిపూర్ హింసను గుర్తు చేస్తోంది. 

ఆగని హింస: 

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

పోలీసులను విడిచిపెట్టట్లేదు: 

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో గుంపులు గురువారం నాడు ఇద్దరు పోలీస్ అధికారులను చంపి వారిని దోచుకున్నట్లు, అంతేకాకుండా వారి నుంచి భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలోని కౌత్రుక్ దగ్గర దాడికి పాల్పడిన కొంతమంది, భద్రతా దళాలతో  ఘర్షణకు దిగిన అనంతరం, ఒక భద్రతా సిబ్బంది మరణించారు.

విచ్చలవిడిగా దోచుకుంటున్నారు: 

బిష్ణుపూర్‌లోని మణిపూర్ ఆర్మ్‌డ్ పోలీస్ 2వ బెటాలియన్‌కు చెందిన కైరెన్‌ఫాబి పోలీస్ అవుట్‌పోస్ట్.. అదే విధంగా తంగలవాయి పోలీస్ అవుట్‌పోస్టులపై ఒక కొంతమంది గుంపులు దాడి చేసి భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లిందని, మణిపూర్ పోలీసుల ప్రకటించారు. అదేవిధంగా పురుషులు మరియు మహిళలతో కూడిన గుంపు అదే జిల్లాలోని హీంగాంగ్ పోలీస్ స్టేషన్ ఇంకా సింగ్జామీ పోలీస్ స్టేషన్ నుండి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని లాక్కోవడానికి ప్రయత్నించింది, ఈ క్రమంలోనే భద్రతా దళాలు అలర్ట్ అవడంతో ఆ గుంపులను చెదరగొట్టి తరిమి కొట్టినట్లు తెలుస్తోంది.

ఇది ఎవరి కుట్ర:

భారీ సంఖ్యలో పారామిలటరీ సిబ్బంది ఉన్నప్పటికీ, ఇతర జిల్లాల నుంచి వచ్చిన దుండగులు విష్ణుపూర్ గ్రామానికి వచ్చి ముగ్గురిని దారుణంగా హతమార్చారని, ఇది కేవలం వైఫల్యమే అంటూ, రాజ్‌కుమార్ ఇమో సింగ్ చెప్పారు.

మరో వైపు, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసలో విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవానే (రిటైర్డ్) అన్నారు, దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతంలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనా చేస్తున్న సహాయాన్ని ధ్వజమెత్తారు. పొరుగు దేశంలో (మయన్మార్) మాత్రమే కాకుండా, సరిహద్దు రాష్ట్రం (మణిపూర్)లో కూడా అస్థిరత ఉంటే, అది మన మొత్తం జాతీయ భద్రతకు బంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది అని ఆయన అన్నారు. అంతర్గత భద్రత మనకు చాలా ముఖ్యం అని జనరల్ నరవానే అన్నారు.