TDPకి మరో షాక్ ఇచ్చిన సీఐడీ

ఒకప్పుడు ఏపీని పరిపాలించిన టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేతను జైలులో వేసిన సంస్థ ఇంకో కీలక పరిణామానికి బీజం వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కొత్తగా ఐదుగురు నిందితులను యాడ్ చేసింది. నలువైపుల నుంచి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంస్థ తాజా పరిణామంతో టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టింది.  నేడు కూడా విచారణకు లోకేష్  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కు […]

Share:

ఒకప్పుడు ఏపీని పరిపాలించిన టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేతను జైలులో వేసిన సంస్థ ఇంకో కీలక పరిణామానికి బీజం వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కొత్తగా ఐదుగురు నిందితులను యాడ్ చేసింది. నలువైపుల నుంచి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంస్థ తాజా పరిణామంతో టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టింది. 

నేడు కూడా విచారణకు లోకేష్ 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కు సీఐడీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.న ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్ కు నోటీసులిచ్చిన సంస్థ అక్టోబర్ 4వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై లోకేష్ కోర్టుకెక్కారు. దీంతో కోర్టు లోకేష్ కు ఊరటనిస్తూ 4వ తేదీన కాదు కానీ 10వ తేదీన సీఐడీ ముందు హాజరు కావాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో కాస్త సంబరపడ్డ టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక లోకేష్ కోర్టు తీర్పును అనుసరించి నిన్నఏపీలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అతడిని దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు మరలా నేడు కూడా విచారణకు రావాల్సిందిగా లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. 

గూగుల్ చేస్తే సరిపోయేది

సీఐడీ విచారణ తర్వాత లోకేష్ మాట్లాడుతూ…. గూగుల్ లో సమాధానాలు దొరికే ప్రశ్నలనే అడిగారని తెలిపారు. అంత దానికి నన్ను పిలవాల్సిన అవసరం లేదని వారే గూగుల్ చేసుంటే ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేదన్నారు. నేడు కూడా విచారణకు రమ్మన్నారని పేర్కొన్నారు. ఎంత ఆలస్యం అయినా ఉంటానని, ఈ రోజే ముగించాలని చెప్పినా వారు వినిపించుకోలేదని ఆరోపించారు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు లోకేష్ వివరించారు. ఇక లోకేష్ తమ విచారణకు సరిగా సహకరించలేదని సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆయన అన్ని ప్రశ్నలను దాటవేశారని వారు ఆరోపించారు. 

రింగ్ రోడ్ కేసులో కొత్తగా మరో ఐదుగురు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ కొత్తగా మరో ఐదుగురి పేర్లను చేర్చింది. వారు కూడా టీడీపీతో సంబంధం ఉన్న వ్యక్తులే కావడం గమనార్హం. నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఈ మేరకు సోమవారం ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ భార్య రమాదేవి, ప్రమీల (ధనంజయ్‌ నారాయణ కళాశాల ఉద్యోగి భార్య), ఆవుల మణిశంకర్‌ (నారాయణ బంధువు) రాపూరి సాంబశివరావు (రమాదేవి బంధువు), వరుణ్‌కుమార్‌ పేర్లను యాడ్ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే క్రైం నెం. 16/2021 సెక్షన్ 120 (బీ), 409, 420, 166, 167, 34, 35, 37, 13(2), 13(1) పీసీ యాక్ట్ కింద ఎఫ్‌ ఐ ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. 

చంద్రబాబు కూడా… 

ఈ స్కాంలో సీఐడీ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది మీద కేసులు ఫైల్ చేసిన సీఐడీ లోకేష్ ను విచారిస్తోంది. ఆల్రెడీ స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ స్కాంలో ఏ1గా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు ఏ-1, మాజీ మంత్రి పి.నారాయణ ఏ-2, నారా లోకేష్ ఏ-14గా ఉన్న విషయం తెలిసిందే. కాగా కొత్తగా నారాయణ సతీమణి రమాదేవి ఏ-15, ఆర్. సాంబశివరావు ఏ-16, ఏ. మణిశంకర్ ఏ-17, ప్రమీల ఏ-18, వరుణ్ ఏ-19 గా సీఐడీ చేర్చింది. ఇప్పటికే తమ ఎదుట హాజరుకావాలని లోకేష్, నారాయణలకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ఆల్రెడీ సీఐడీ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏ-1 చంద్రబాబు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సోమవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే.