ముంబైలో మొదలైన వర్షాలు

మహారాష్ట్రలో అడుగుపెట్టిన రుతుపవనాల కారణంగా ముంబైలో నిన్న శనివారం నుంచి వర్షాలు మొదలయ్యాయి రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.  శనివారం మధ్యాహ్నం నుంచి ముంబైలో వర్షాలు మొదలయ్యాయి రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కారణంగా చాలా చోట్ల నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అంతేకాకుండా పలుచోట్ల నీరు ఉండిపోవడం […]

Share:

మహారాష్ట్రలో అడుగుపెట్టిన రుతుపవనాల కారణంగా ముంబైలో నిన్న శనివారం నుంచి వర్షాలు మొదలయ్యాయి రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. 

శనివారం మధ్యాహ్నం నుంచి ముంబైలో వర్షాలు మొదలయ్యాయి రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కారణంగా చాలా చోట్ల నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అంతేకాకుండా పలుచోట్ల నీరు ఉండిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబైలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోయి అందేరి సబ్వే అనేది మూసివేశారు, ట్రాఫిక్ ను స్వామి వివేకానంద రోడ్డు వైపుకు మరల్చారు. పలు ప్రాంతాలు, వర్లి సీలింక్ గేట్ దగ్గర్లో ఉన్న గఫర్ ఖాన్ రోడ్, ఆసల్ఫ, బీడీ రోడ్, మహాలక్ష్మి టెంపుల్, ఇలా పలు ప్రాంతాలలో నీరు భారీగా నిలిచిపోవడం జరిగింది. 

చెంబుర్ రైల్వే స్టేషన్ దగ్గర అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, విక్రోలి దగ్గర 79 మిల్లీమీటర్లు, సీయోనులో 61.9 మిల్లీమీటర్లు, ఘట్కపర్ లో 61మిల్లీమీటర్లు, మట్టుంగాలో 25 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. 

రాష్ట్రాలకు రుతుపవనాల రాక: 

అయితే ఐ ఎం డి ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం 2023లో రుతుపవనాలు జూన్ 4న కేరళను తాకాయి. అయితే, అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడుతుందన, ఇది జూన్ మూడవ వారానికి ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల రాకను ఆలస్యం చేస్తుందని తెలిపింది. ఎందుకంటే, భారతదేశానికి రుతుపవనాలను తీసుకువచ్చే గాలులు అయిన వెస్టర్లీస్ తుఫాను వ్యవస్థను అధిగమించేంత బలంగా ఉండవని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. ఫలితంగా జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ భావిస్తున్నారు.

అయితే, రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత, జూన్ మూడు మరియు నాల్గవ వారాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినట్లుగానే, ఇప్పుడు జూన్ చివరి వారంలో వర్షాలు మొదలయ్యాయి. రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందన రైతులు తమ ప్రణాళికలను జూన్ మూడో వారానికి వాయిదా వేయాలని ముందుగానే సూచించడం జరిగింది.

భారత వాతావరణ శాఖ (IMD) జూన్ 27 వరకు ఒడిశాలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికను జారీ చేసింది. కటక్, జాజ్‌పూర్, దెంకనల్, కియోంజర్ మరియు మయూర్‌భంజ్‌లలో శనివారం మరియు ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాతావరణ శాఖ ప్రకారం, నైరుతి రుతుపవనాలు గురువారం ఒడిశాకు చేరుకున్నాయి మరియు మల్కన్‌గిరి, కోరాపుట్ మరియు గజపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను దాకా తిని కారణంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గంగా నది పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు, జార్ఖండ్ మరియు బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు మరియు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోకి కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున తూర్పు రాజస్థాన్‌లో జూన్ 27 నుండి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో రుతుపవనాలు సకాలంలో ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయని రాజస్థాన్‌లోని ఐఎండీ డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ తెలిపారు. “దౌసా, అల్వార్, భరత్‌పూర్ మరియు కోట వంటి ప్రాంతాలు మరియు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో శనివారం నుండి రుతుపవనాల కారణంగా వర్షాలు రావడం వేగవంతం అవుతాయని భావిస్తున్నారు” అని ఆయన తెలిపారు.