మత్స్య-6000 మిషన్ విశేషాలు

చంద్రుడు మీద పరిశోధనలు జరపడానికి చంద్ర మిషన్, అదే విధంగా సూర్యుడు మీద పరిశోధనలు జరపడానికి ఆదిత్య మెషిన్ అనే రెండు మిషన్లను విజయవంతంగా నింగిలోకి పంపించిన తర్వాత, ఇస్రో ఇప్పుడు సముద్ర అడుగున మరింత రీసెర్చ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తనదైన విశేషాలతో సముద్రయాన్ మిషన్ వార్తల్లో నిలుస్తోంది. సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్ గురించిన మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం..  సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్:  సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో రీసెర్చ్ […]

Share:

చంద్రుడు మీద పరిశోధనలు జరపడానికి చంద్ర మిషన్, అదే విధంగా సూర్యుడు మీద పరిశోధనలు జరపడానికి ఆదిత్య మెషిన్ అనే రెండు మిషన్లను విజయవంతంగా నింగిలోకి పంపించిన తర్వాత, ఇస్రో ఇప్పుడు సముద్ర అడుగున మరింత రీసెర్చ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తనదైన విశేషాలతో సముద్రయాన్ మిషన్ వార్తల్లో నిలుస్తోంది. సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్ గురించిన మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం.. 

సముద్రయాణ్- మత్స్య-6000 మిషన్: 

సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో రీసెర్చ్ చేసేందుకు సముద్రయాన్ని మిషన్ రూపుదిద్దుకోంటోంది. అత్యాధునిక సబ్‌మెర్సిబుల్ ‘మత్స్య 6000’ నీటి అడుగున పరిశోధనలో భాగం అవుతుందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కిరెన్ రిజిజు ఇటీవల వెల్లడించారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో అభివృద్ధి చేసిన ఈ మిషన్లో సుమారు ముగ్గురు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. సముద్ర వనరులపై సమగ్ర అధ్యయనం మరియు సముద్ర జీవవైవిధ్యాన్ని అంచనా వేయడంపై మత్స్య 6000 మిషన్ అధ్యయనం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

‘సముద్రయాన్’ మిషన్ ‘బ్లూ ఎకానమీ’కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించిన మిషన్. సముద్ర పర్యావరణ వ్యవస్థ లోటుపాట్లను అంచనా వేసే విధంగా తయారు చేయబడింది సముద్రయాన్ మిషన్. అంతే కాకుండాఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు ఎటువంటి హాని తలపెట్టదు అని హామీ ఇస్తూ, రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

డైరెక్టర్ ఆనంద్ రామదాస్ మాటల్లో: 

NIOT డైరెక్టర్ ఆనంద్ రామదాస్ మాట్లాడుతూ, సముద్ర వనరులను ఉపయోగించుకుంటూ ముందుకు సాగడం వంటివి అభివృద్ధి చేయడం, సరైన పని తీరు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా, ముందుగా చెప్పుకున్నట్టే..మత్స్య 6000 ముగ్గురు మనుషులను తీసుకువెళుతుందని, ఇది 6 కిలోమీటర్ల లోతులో తనదైన శైలిలో సైంటిఫిక్ అనాలసిస్ చేయగలదని పేర్కొన్నారు. ఇప్పుడు తయారవుతున్న మిషన్ చేసే ప్రయాణం కూడా, అంతరిక్ష ప్రయాణం వంటి కష్టమైనదే అంటూ మరొకసారి గుర్తు చేశారు.

మత్స్య 6000 కోసం భద్రతా ఏర్పాట్లు: 

NIOT శాస్త్రవేత్త సత్యనారయణ్ మాట్లాడుతూ, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని.. ఇది 500 మీటర్ల లోతులో పరీక్ష చేయించుకున్న, ప్రత్యేకమైన ఐరన్ తో చేసిన ప్రెజర్ హల్‌గా రూపుదిద్దుకుంది అని పేర్కొన్నారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఏడు మీటర్ల లోతులో మనుషులతో సహా ప్రయాణించి పరీక్ష చేయడం జరిగిందని వెల్లడించారు.

సముద్రియ మిషన్ అండర్ లో తయారవుతున్న మత్స్య 6000 అనేది, 12 గంటల పాటు నిరంతరం పనిచేస్తుంది అని, అంతేకాకుండా మత్స్య 6000 క్రిందికి దిగడానికి బ్యాలస్ట్ ట్యాంకులను ఉపయోగిస్తున్నామని, బ్యాలస్ట్ బరువులను విడుదల చేయడం ద్వారా పైకి ఎక్కడానికి కూడా వీలుగా ఉంటుందని సత్యనారాయణన్ అన్నారు. 22mm మందం, 2.1 మీటర్ల వ్యాసం కలిగిన ఉక్కు గోళమైన ప్రెజర్ హల్‌ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. సబ్‌మెర్సిబుల్ సిబ్బందిలో ఒక పైలట్, అంతేకాకుండా ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు, వీరు యాక్రిలిక్ కిటికీల ద్వారా సముద్రాన్ని చూడగలరు. అంతేకాకుండా ముఖ్యంగా రౌండ్ షేప్ లో ఉండే ఈ మత్స్య 6000 నిజానికి సముద్రంలో వెళ్లేటప్పుడు బరువుని తగ్గించుకుంటుందని, దీని ద్వారా ఇందులో ప్రయాణించే సిబ్బందికి మరింత భద్రత ఏర్పడుతుందని నొక్కి చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

ముఖ్యంగా పవర్ మరియు బ్యాలస్ట్ బరువును విడుదల చేయడానికి ఉపయోగించే బ్యాటరీలతో.. వాహనం 96 గంటల పరిశోధనను నిర్వహించగలదు, పరిశోధన కోసం ఉద్దేశించిన 12 గంటలు మినహాయించి, లైఫ్ టైం మద్దతును అందించగలదని సత్యనారాయణన్ చెప్పారు. ముఖ్యంగా ఈ మిషన్ కి సంబంధించి ఉపయోగించే ప్రతి మెటీరియల్‌కు కఠినమైన పరీక్షలు చేయవలసి ఉంటుందని, దాని ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యాన్ని చూడటానికి, ఒక డివైస్ కూడా మిషన్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.