అహ్మదాబాద్ హాస్పిటల్లో చెలరేగిన మంటలు

అహ్మదాబాద్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జూలై 30వ తారీఖు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు రాజస్థాన్లో ఉన్న హాస్పిటల్ బేస్మెంట్లో మంటలు చెలరేగడంతో, అందులో ఉన్న పేషెంట్లు, కొంతమంది సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే బేస్మెంట్ లో మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.  అగ్ని ప్రమాదం ఎలా జరిగింది:   ఆదివారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని సాహిబాగ్ ప్రాంతంలోని 10-అంతస్తుల ఆసుపత్రి బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి, అనంతరం వెంటనే పేషంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు […]

Share:

అహ్మదాబాద్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జూలై 30వ తారీఖు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు రాజస్థాన్లో ఉన్న హాస్పిటల్ బేస్మెంట్లో మంటలు చెలరేగడంతో, అందులో ఉన్న పేషెంట్లు, కొంతమంది సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే బేస్మెంట్ లో మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. 

అగ్ని ప్రమాదం ఎలా జరిగింది:  

ఆదివారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని సాహిబాగ్ ప్రాంతంలోని 10-అంతస్తుల ఆసుపత్రి బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి, అనంతరం వెంటనే పేషంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది హాస్పిటల్. ప్రమాదం జరిగిన వెంటనే, 20-25 ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బందితోపాటుగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం కూడా హాస్పిటల్ బేస్మెంట్ నుంచి పొగలు వస్తూనే ఉన్నాయని చెప్పారు పోలీసులు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పది అంతస్తుల ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ముందుజాగ్రత్త చర్యగా 125 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అందుకే ముప్పు తప్పింది.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని షాహిబాగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎండి చంపావత్ తెలిపారు.

అయితే హాస్పిటల్లో రెనోవేషన్ పనుల కారణంగా, హాస్పిటల్ బేస్మెంట్ లో అనేక వస్తువులు స్టోర్ చేయడం జరిగింది. ఈ వస్తువులకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని హాస్పటల్ సిబ్బంది పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని షాహిబాగ్ ప్రాంతంలో ఉన్న ఈ హాస్పిటల్ నిజానికి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ MD చంపావత్ మాట్లాడుతూ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారని.. మంటలు చెలరేగిన హాస్పిటల్ బేస్మెంట్ నుంచి మంటలు అదేవిధంగా దట్టమైన పొగ ఇప్పటికీ వస్తూనే ఉంది అని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా 10 అంతస్థుల భవనం నుండి దాదాపు 100 మంది రోగులను ఖాళీ చేయించినట్లు ఆయన చెప్పారు. పది అంతస్థుల రాజస్థాన్ హాస్పిటల్‌లోని రెండవ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయని, తెల్లవారుజామున 4:30 గంటలకు తమకు కాల్ వచ్చిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ జయేష్ ఖాడియా తెలిపారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి దుర్ఘటనపై సమాచారం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు, రోగులను రక్షించడం మరియు సహాయక చర్యలలో నిమగ్నమై ఉందని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలిదు. 

ప్రమాదాలు ఎక్కువయ్యాయి: 

అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు తెల్లవారుజామున జరిగినందువలన ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడగలిగారు. అంటే ప్రస్తుతం ఎలాంటి అగ్ని ప్రమాదాలు చాలా చోట్ల సంభవించాయి. ముఖ్యంగా హాస్పిటల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు కూడా ఉన్నాయి. నిజానికి బేస్మెంట్ పరిసరాల్లో స్టోర్ రూమ్స్ లో హాస్పిటల్లో అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు మరి ఇతర కావలసిన సామాగ్రి ఉండడం కారణంగా, అగ్ని ప్రమాదం వాటిలినప్పుడు, బేస్మెంట్ లో ఉండే వస్తువుల కారణంగా, ఆక్సిజన్ సిలిండర్లు పైప్ లైన్లు కారణంగా కూడా అగ్ని ప్రమాదం తారా స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.