ఎయిర్ ఇండియాలో మూత్ర విసర్జన చేసిన ముంబై వ్యాపారవేత్త పై ఎఫ్ఐఆర్ కేసు నమోదు

ఒక్కొక్కసారి మనుషుల ధోరణి ఏ విధంగా ఉంటుంది అంటే వారి ప్రవర్తన ఇతరులను మరింతగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పటికీ కూడా మహిళలు నేటికీ కొంతమంది మానవ మృగాల చేత ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆడవారు కనిపిస్తే చాలు కొంతమంది రాక్షసులుగా మారిపోయి వారిపై విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ చివరికి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది మద్యం మత్తులో ఎక్కడ ఏం చేస్తున్నామో తెలియక మరింత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనే […]

Share:

ఒక్కొక్కసారి మనుషుల ధోరణి ఏ విధంగా ఉంటుంది అంటే వారి ప్రవర్తన ఇతరులను మరింతగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పటికీ కూడా మహిళలు నేటికీ కొంతమంది మానవ మృగాల చేత ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆడవారు కనిపిస్తే చాలు కొంతమంది రాక్షసులుగా మారిపోయి వారిపై విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ చివరికి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది మద్యం మత్తులో ఎక్కడ ఏం చేస్తున్నామో తెలియక మరింత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనే ఒకటి ముంబై ఢిల్లీ ఏరోప్లేన్ లో జరిగిన సంఘటన మరింత అసహ్యకరంగా మారిందని చెప్పాలి.

అసలు విషయంలోకి వెళితే ముంబై – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ప్రయాణిస్తున్న సమయంలో నేలపై ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేశాడని ఆరోపణలతో ఢిల్లీలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. జూన్ 24వ తేదీన ఏఐసి 866 విమానంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తాజాగా అతనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లుగా కూడా తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది. అసలు విషయంలోకి వెళితే సీట్ నంబర్ 17 ఎఫ్ లోని ప్రయాణికుడు రామ్ సింగ్ విమానంలోని తొమ్మిదవ వరుసలో మలమూత్ర విసర్జన చేయడమే కాదు ఉమ్మి వేశాడు.  ఈ దుష్ప్రవర్తన గమనించిన తర్వాత క్యాబిన్ సిబ్బంది మౌనిక ప్రయాణికుడికి మందలించింది.

ఈ పరిస్థితి వెంటనే పైలెట్ ఇన్ కమాండ్ కి కూడా తెలియజేయగా ప్రయాణికులను ఎస్కార్ట్ చేయడానికి వచ్చిన వెంటనే భద్రత కోరుతూ కంపెనీకి సందేశం పంపబడింది. ఇకపోతే ఈ చర్య వల్ల అక్కడ చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక విమానం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ హెడ్ హాజరై ప్రయాణికుడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 అస్లీల చర్యలు,  సెక్షన్ 510 మద్యం సేవించిన వ్యక్తి బహిరంగంగా దుర్వినియోగం చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగినట్లుగా కొంతమంది సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. 2022 నవంబర్ 26వ తేదీన కూడా మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఇలా న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న తోటి మహిళపై సహ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు అని ఒక ప్రయాణికుడు వివరించగా.. పది రోజుల తర్వాత డిసెంబర్ 6వ తేదీన ప్యారిస్ – న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలు దుప్పటిపై మూత్ర విసర్జన చేసి,  మద్యం పోయడం మరింత దారుణం అంటూ ఇంకొక ప్రయాణికుడు వెల్లడించారు. ఇలా కొంతమంది మద్యం సేవించి విచక్షణ రహితంగా తోటి ప్రయాణికులపై ప్రవర్తించడం చాలా దుర్ఘటన అని దీనిని వెంటనే విమాన సంస్థలు ఖండించాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. ఇక ఇలా ప్రతిసారి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు విమానంలో ప్రయాణించాలంటే కూడా భయపడుతున్నారు అని మరొక నెటిజన్ ట్వీట్ చేయడం జరిగింది. మరి ఈ ఆగడాలను అరికట్టడానికి ఎయిర్ ఇండియా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి.