పసికందుకి ముక్కు లేకుండా చేసిన డాక్ట‌ర్

పిల్లాడి తండ్రి చెప్పిన దాని ప్రకారం డాక్టర్లు తమ తప్పు ఒప్పుకొని ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు తామే భరిస్తామని చెప్పారని చెప్పాడు. అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడికి ఫోటో థెరపీ ఎక్కువ చేశారని నారాయణగూడ పోలీసులు డాక్టర్ పై కేసు నమోదు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం: డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం జూన్ 8న బాధితుడు భార్య డెలివరీ అయింది. ఆ చిన్న పిల్లాడిని డాక్టర్ల […]

Share:

పిల్లాడి తండ్రి చెప్పిన దాని ప్రకారం డాక్టర్లు తమ తప్పు ఒప్పుకొని ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు తామే భరిస్తామని చెప్పారని చెప్పాడు. అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడికి ఫోటో థెరపీ ఎక్కువ చేశారని నారాయణగూడ పోలీసులు డాక్టర్ పై కేసు నమోదు చేశారు.

డాక్టర్ల నిర్లక్ష్యం:

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం జూన్ 8న బాధితుడు భార్య డెలివరీ అయింది. ఆ చిన్న పిల్లాడిని డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచారు. అక్కడ వాళ్ళు ఫోటో థెరపీ చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం డాక్టర్లు తమ తప్పు ఒప్పుకొని ట్రీట్మెంట్ తామె చేయిస్తామని చెప్పారని చెప్పాడు. పోలీసులు సెక్షన్ 337 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 

డాక్టర్లకు ఏమైంది? :

ఒకప్పుడు హాస్పిటల్ కి పేషెంట్లు ధైర్యంగా వెళ్లేవారు. ఎందుకంటే పేషంట్ల మీద డాక్టర్లు చాలా కేర్ తీసుకునేవారు. కానీ కాల క్రమేణా డాక్టర్లకు నిర్లక్ష్యం పెరిగింది. ఇంకా చెప్పాలంటే డాక్టర్లకు వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. కొన్నిసార్లు డాక్టర్లు 24 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇలా తప్పిదాలు జరుగుతూ పోతుంటే ప్రజల హాస్పిటల్స్ కి వెళ్లాలంటే భయపడడం మరింత పెరుగుతుంది. ఇప్పటికైనా డాక్టర్లు పేషంట్ల మీద కాస్త కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వానిది కూడా తప్పుంది. మన దేశంలో పేషెంట్లకు సరిపడే డాక్టర్లు లేరు. డాక్టర్ల కొరత వల్ల ఉన్న డాక్టర్ మీదే ఎక్కువ వర్క్ లోడ్ పడుతుంది. దీనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్లు కొన్ని కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దానివల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే డాక్టర్లు చాలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో ఫోకస్ అంతా పేషంట్ మీదే ఉంచాలి, ఆపరేషన్ థియేటర్లో మొబైల్ ఫోన్స్ అసలు వాడకూడదు. పేషంట్ కి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. డాక్టర్లు పేషెంట్ ప్రాబ్లమ్ ఎంతో క్లియర్ గా అడిగి తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ కి ముందు ఏదైనా ప్రాబ్లం ఉందా అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం వల్ల తప్పిదాలు జరగవు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఘటన లాంటివి మళ్లీ జరగకూడదు అంటే డాక్టర్లు పై నియమాలు పాటించాలి. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రోజు డాక్టర్ల తప్పిదాల వల్ల ఎవరో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలాగే జరగుతూ పోతే పేషంట్ కి డాక్టర్ అంటే నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోయాక పేషెంట్ ఆ హాస్పిటల్ కి వెళ్ళడు. ఇప్పటికైనా డాక్టర్లు కళ్ళు తెరిచి తమ వల్ల జరిగే తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల పేషెంట్ నమ్మకం పెరిగి డాక్టర్ వృత్తి మీద గౌరవం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు  జరగకూడదని కోరుకుందాం. మన దేశంలో డాక్టర్ని దేవుడిలా చూస్తారు. డాక్టర్లు దాన్ని నిలబెట్టుకోవాలి.