IIT Kharagpur: అంత ఒత్తిడి ఎందుకు.. ఐఐటీపై మృతుడి తండ్రి విమర్శలు

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT Kharagpur)లో బుధవారం ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది . అయితే తన కుమారుడు తీవ్ర ఒత్తిడి(Extreme stress)కి లోనవుతున్నాడని.. అతని తండ్రి కె చందర్(K. Chander) వాదించారు . మా బాబుని ఐఐటీ(IIT)లో ఎందుకు బాధపెట్టారు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్‌(IIT Kharagpur)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా.. తెలంగాణకు […]

Share:

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT Kharagpur)లో బుధవారం ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది . అయితే తన కుమారుడు తీవ్ర ఒత్తిడి(Extreme stress)కి లోనవుతున్నాడని.. అతని తండ్రి కె చందర్(K. Chander) వాదించారు . మా బాబుని ఐఐటీ(IIT)లో ఎందుకు బాధపెట్టారు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు.

భారత్‌లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్‌(IIT Kharagpur)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా.. తెలంగాణకు చెందిన కే కిరణ్ చంద్ర అనే స్టూడెంట్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని(hanged) ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ చంద్ర(Kiran Chandra) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(Electrical Engineering) విభాగంలో డ్యుయల్ డిగ్రీ కోర్సు ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. మృతుడి స్వగ్రామం.. తెలంగాణలోని మెదక్ జిల్లా చెట్ల తిమ్మాయిపల్లి.

లాల్‌బహదూర్‌ శాస్త్రీ హాస్టల్‌(Lalbahadur Shastri Hostel)లో ఉంటున్న కిరణ్ చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో కిరణ్ తన రూమ్‌మెట్స్‌తో కలిసి హాస్ట్‌లో గదిలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్దులు పని మీద బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఇద్దరు తిరిగి వచ్చే సరికి గది లోపల నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. బలవంతంగా తలుపు తీయడంతో గదిలో కిరణ్(Kiran) ఊరేసుకొని కనిపించాడు. హుటాహుటిన బీసీ రాయ్ టెక్నాలజీ(BC Roy Technology) ఆసుపత్రికి తరలించగా రాత్రి 11.30 అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

కిరణ్ తండ్రి కేతావత్ చంద్ర(Ketawat Chandra) విలేకరులతో మాట్లాడుతూ.. ఐఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విపరీతమైన ఒత్తిడి(Extreme stress) గురించి ఆందోళన వ్యక్తం చేశారు మరియు అక్కడ తన బిడ్డ ఎందుకు చాలా బాధలు పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన కొడుకు ర్యాగింగ్(Raging) బాధితుడే కాదని, విద్యాపరమైన సవాళ్ల కారణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నాడు.  అర్ధరాత్రి దాటిన సమయంలో తన కుమారుడి మృతి గురించి ఐఐటీ ఖరగ్‌పూర్(IIT Kharagpur) నుంచి తనకు సమాచారం అందిందని చెప్పారు. తన కుమారుడు ముందు నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడని తెలిపాడు. ఇంజినీరింగ్‌ చదివిన మూడేళ్లలో ఒక్క బ్యాక్‌లాగ్‌ కూడా లేదని అన్నారు. కానీ ప్రాజెక్ట్‌ వర్క్ విషయమై గత కొంత కాలంగా డిప్రెషన్‌(Depression)లో ఉన్నట్లు వెల్లడించారు. తన కుమారుడితో తను చివరగా అక్టోబర్ 16న మాట్లాడానని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గత సంవత్సరం నుండి, ఐఐటీ ఖరగ్‌పూర్‌(IIT Kharagpur) క్యాంపస్‌లో విద్యార్థుల అనుమానాస్పద మరణాలతో వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ విద్యా సంస్థలో ఏడాదిన్నర కాలంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అక్టోబర్ 2022లో, ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో విద్యార్థి ఫైజాన్ అహ్మద్(Faizan Ahmed) అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అతని విషయంలో కూడా, మృతదేహాన్ని హాస్టల్ గది నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం కలకత్తా హైకోర్టు వ‌ర‌కు చేరింది. మళ్లీ ఈ ఏడాది జూన్‌లో మరో విద్యార్థి సూర్యా దిపెన్‌ మృతదేహాన్ని క్యాంపస్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్ చంద్ర కూడా ఉరేసుకొని చనిపోవటం కలకలం రేపుతోంది. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, కిరణ్ చంద్ర మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువు ఒత్తడి వల్లే విద్యార్థులు ఇలా వరుసగా ప్రాణాలు తీసుంటున్నట్లు తెలిసింది.