హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌

ఫ్యాన్సీ నెంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్, ఇష్టమైన నెంబర్, న్యూమరాలజీ.. తదితర  కారణాలతో ఫ్యాన్సీ నెంబర్ల కోసం  బడా  బాబులు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు  నగల వ్యాపారులు మరియు ప్రైవేట్ గ్రూపులు మంగళవారం ఫ్యాన్సీ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ నంబర్‌లను పొందడానికి తమ వేలం గేమ్‌ను వేగవంతం చేశాయి, ఈ ప్రక్రియలో ‘9999’ రిజిస్ట్రేషన్ నంబర్‌కు బిడ్డర్ ఆల్‌టైమ్ హై రూ.21.6 లక్షలను సాధించారు. నగరంలోని వీఐపీ సంస్కృతిలో భాగంగా […]

Share:

ఫ్యాన్సీ నెంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్, ఇష్టమైన నెంబర్, న్యూమరాలజీ.. తదితర  కారణాలతో ఫ్యాన్సీ నెంబర్ల కోసం  బడా  బాబులు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు 

నగల వ్యాపారులు మరియు ప్రైవేట్ గ్రూపులు మంగళవారం ఫ్యాన్సీ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ నంబర్‌లను పొందడానికి తమ వేలం గేమ్‌ను వేగవంతం చేశాయి, ఈ ప్రక్రియలో ‘9999’ రిజిస్ట్రేషన్ నంబర్‌కు బిడ్డర్ ఆల్‌టైమ్ హై రూ.21.6 లక్షలను సాధించారు.

నగరంలోని వీఐపీ సంస్కృతిలో భాగంగా లేదా మూఢ నమ్మకాల కారణంగా తమ గుర్తింపును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నందున ఎంపిక చేసిన నంబర్‌లకు అధిక డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు.

తాజాగా జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం రవాణా శాఖకు కాసుల పంట కురిపించింది..  ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే రూ.53,34,894 ఆదాయం వచ్చింది అని  చెప్పారు.. . ఈ వేలంలో అత్యధికంగా ‘‘9999’’ నెంబర్ ఏకంగా రూ. 21,60,000 పలికింది.  రిజిస్ట్రేషన్ నంబర్‌ల కొత్త సిరీస్ GDకి సంబంధించి ఫ్యానీ నెంబర్ల కోసం  ఆన్‌లైన్ వేలం జరిగింది.

అత్యధిక బిడ్డర్‌లో ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. TS 09 GD 9999 నంబర్‌కు రూ.21.6 లక్షలు వెచ్చించింది. ఇక, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ TS 09 GD 0009 నంబర్‌ను రూ.10.5 లక్షలకు దక్కించుకుంది. ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్.. TS 09 GD 0001 నంబర్ కోసం రూ. 3,01,000 వెచ్చించింది.

ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీఎస్ 09 జీడీ 0006ను గోయాజ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ.1.83 లక్షలుకు సొంతం చేసుకుంది. టీఎస్ 09 జీడీ 0019 నెంబర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూ. 1,70,100కు దక్కించుకుంది. టీఎస్ 09 జీడీ 0045 ను రూ.1,55,000కు సాయి పృధ్వీ ఎంటర్ ప్రైజెస్, టీఎస్ 09 జీడీ 0007 ను రూ.1,30,000కు ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, టీఎస్ 09 జీడీ 0027 ను రూ.1,04,999కు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర పలికిన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ సాధారణంగా కొత్త సిరీస్ ప్రారంభంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక్కో సిరీస్‌లో 9,999 నంబర్లు ఉంటాయి  అని  చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ కు 9999 సెంటిమెంట్.

యంగ్ టైగర్ దగ్గర కార్స్ కలెక్షన్ బాగానే ఉంది. అన్నింటికి ఒకే నెంబర్ ఎందుకు ఉంది అనేది మాత్రం చాలా మందికి అర్థం కాని విషయం. దీని వెనక ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. పైగా సినిమా ఇండస్ట్రీలో అన్నింటి కంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. ఏదైనా కలిసొచ్చిందంటే దాన్ని వదలడానికి మనసు రాదు మనోళ్లకు. కలిసిరాకపోతే దాని వైపు కనీసం చూడరు. సినిమాల విషయంలో కానీ.. వ్యక్తిగతంగా కానీ కొన్ని కలిసొచ్చిన సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు మన స్టార్స్.

అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఈయన కార్ నెంబర్ 9999 ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్‌కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. తన ప్రతీ కారుకు 9999 ఉండటంపై యంగ్ టైగర్ కూడా స్పందించాడు. అయితే అంతా అనుకుంటున్నట్లు తనకు కార్ నెంబర్ విషయంలో ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్

కాకపోతే తన కార్లకు 9999 నెంబర్ ఉండటం వెనక ఓ కారణం… తనకు 9 అనే అంకె ఇష్టమని మాత్రం చెప్పాడు తారక్. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్‌ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పాడు. అందుకే మరో ఆలోచన లేకుండా తన కార్లకు అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు  జూనియర్ ఎన్టీఆర్.

ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే తప్ప అది సెంటిమెంట్ కాదు.. తనకు ఇష్టమైన వాళ్లు వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నాను అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కారుతో పాటు ఎన్టీఆర్ ట్విటర్‌ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. తాత, తండ్రి గుర్తుగా ఆ నెంబర్ కంటిన్యూ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.